Home /News /telangana /

KARIMNAGAR SARPANCH OF KARIMNAGAR DISTRICT PROVIDING COMPENSATION TO STUDENTS JOINING GOVERNMENT SCHOOLS SNR KNR

Telangana: ప్రభుత్వ పాఠశాలలో చేరితే నెలకు రూ.500, యూనిఫామ్, బుక్స్ ఫ్రీగా ఇస్తున్న సర్పంచ్ .. ఏ జిల్లాలో అంటే

( సర్పంచ్ పెద్ద మనసు)

( సర్పంచ్ పెద్ద మనసు)

Karimnagar: ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులు చదువుకోవాలని..ప్రభుత్వ ఖర్చు చేస్తున్న నిధులు సద్వినియోగం కావాలని ఆలోచించింది ఓ గ్రామసర్పంచ్. తన సొంత డబ్బులతో బడిపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మిగిలిన గ్రామాల సర్పంచ్‌లకు ఆదర్శంగా నిలిచారు ఆ మహిళా సర్పంచ్.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,New18,Karimnagar)
    ఊరికి మంచి చేయాలన్న ఆలోచన..గ్రామస్తులకు తనకు తోచిన సాయం చేసే మనసు, ప్రభుత్వం కల్పించే సదుపాయాలు అందరికి ఉపయోగపడాలనే దృక్పథం. అందుకే తనకున్న దాంట్లో నలుగురికి సహాయం చేయాలని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ సర్పంచ్ దంపతులు. కరీంనగర్(Karimnagar)జిల్లాలోని హుజూరాబాద్(Huzurabad)మండలం శాలపల్లి(Shalapally) - ఇందిరానగర్(Indiranagar)గ్రామ సర్పంచ్‌ కొడిగూటి శారదా ప్రవీణ్(Sharada (Praveen)దంపతులు ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ దంపతులు రెండు గ్రామాల్లోని స్కూల్‌కి వెళ్లే వయసున్న పిల్లను ప్రభుత్వ పాఠశాల(Government School)ల్లో చేర్పించేందుకు బడి బాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరే ఒక్కో విద్యార్ధికి ఉచితంగా పుస్తకాలుBooks, నోట్‌ బుక్స్notebooks, యూనిఫామ్‌(Uniforms)తో పాటు ఒక్కొక్కరికి నెలకు రూ .500 చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తానని ప్రకటిం చారు.

    బడిబాటకు శ్రీకారం..
    బడిబాట కార్యక్రమం ద్వారా కొత్తగా కనీసం 50 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు సర్పంచ్ శారద. ఈ రెండు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 70 మంది చదువుతున్నారు. 50మంది ని చేర్పించే భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని సర్పంచ్ శారదా తెలిపారు. విద్యార్ధులకు డబ్బులు ఇచ్చి మరీ ఎందుకు ప్రభుత్వ స్కూల్‌లో చేర్పిస్తున్నారని అడిగితే గ్రామంలోని పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదవాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

    ఇది చదవండి : ఖమ్మం జిల్లాలో పెళ్లి చేసుకున్న 48గంటల్లోనే గొంతుకోసుకున్న పెళ్లి కొడుకు .. ఎందుకంటే


    సొంత డబ్బు దానం..
    నిరుపేదలకు సహాయం చేయాలన్నదే తమ కోరిక అని అందులో భాగంగానే బడిబాట కార్యక్రమం ద్వారా తమకు తోచిన సాయం చేస్తున్నామని చెప్పారు. గతంలో కూడా గ్రామానికి, గ్రామ ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సర్పంచ్ దంపతులు. ప్రభుత్వ స్కూల్‌కి పంపడం వల్లే తల్లిదండ్రులపై పడే బుక్స్, యూనిఫామ్స్ ఖర్చు కూడా ఉండకూడదనే ఇలా ఒక్కొక్క విద్యార్ధికి నెలకు 500నగదు ఇస్తున్నట్లుగా తెలియజేశారు. తెలంగాణ ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.



    ఉత్తమ సర్పంచ్..
    రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది పల్లె ప్రగతి కార్యక్రమాలకు గ్రామ సర్పంచ్‌లు అభివృద్ది కార్యక్రమాల పేరుతో సొంత డబ్బులు, పంచాయితీ నిధులు ఖర్చు చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటికి ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో ...తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మళ్లీ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాలకు పిలుపునిస్తున్న సందర్భంలో ఏకంగా సర్పంచ్‌లు ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. చివరకు తమ సర్పంచ్‌ పదవులు రాజీనామా చేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. అందరి పరిస్థితి ఇలా ఉంటే శాలపల్లి - ఇందిరానగర్ గ్రామ సర్పంచ్‌ దంపతులు మాత్రం గ్రామ ప్రజలకు ఈవిధంగా తోడ్పాటు అందించడం గొప్ప విషయమని అందరూ అభినందిస్తున్నారు.

    ఇది చదవండి: ఉమ్మడి ఖమ్మం జిల్లాపై వైఎస్ షర్మిల ఫోకస్‌ .. వ్యూహాత్మకంగానే అడుగులు

    Published by:Siva Nanduri
    First published:

    Tags: Karimnagar, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు