Telangana News: ఆసుపత్రిలో ఆ వ్యక్తికి రూ.3.50 కోట్లు మాఫీ.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

Telangana News: దేశం కాని దేశంలో అనారోగ్యానికి గురైన వలస పక్షిని క్షేమంగా సొంత రాష్ట్రానికి చేర్చడంతో పాటు భారీ బిల్లును మాఫీ చేయించడంలో సక్సెస్ అయ్యారు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితీ బాధ్యులు . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వలస బిడ్డకు బాసటగా నిలిచిన బాధ్యులకు దుబాయిలోని ఇండియన్ కాన్సూలెట్ అధికారుల సహకారం కూడా చేదోడుగా నిలిచింది . దీంతో వారి శ్రమ ఫలించింది.

 • Share this:
  (P. Srinivas, News18, Karimnagar)

  దేశం కాని దేశంలో అనారోగ్యానికి గురైన వలస పక్షిని క్షేమంగా సొంత రాష్ట్రానికి చేర్చడంతో పాటు భారీ బిల్లును మాఫీ చేయించడంలో సక్సెస్ అయ్యారు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితీ బాధ్యులు . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వలస బిడ్డకు బాసటగా నిలిచిన బాధ్యులకు దుబాయిలోని ఇండియన్ కాన్సూలెట్ అధికారుల సహకారం కూడా చేదోడుగా నిలిచింది . దీంతో వారి శ్రమ ఫలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా, పెగడపల్లి మండలం, సుద్దపెల్లి గ్రామానికి చెందిన కట్ల గంగారెడ్డి, చాలామంది తెలంగాణా నుంచి వలస వెళ్లేవారిలాగే .. గంగారెడ్డి పొట్ట చేత పట్టుకుని దుబాయ్ వెళ్లాడు . కానీ దురదృష్టవశాత్తూ ... గత ఏడాది 2020 డిసెంబర్ 25 వ తేదీన అనారోగ్యంతో దుబాయ్ లో ఆసుపత్రి పాలయ్యాడు .

  Romance In Flight: విమానంలో హద్దుమీరిన జంట.. పాడుపని చేస్తూ.. వీడియో వైరల్..


  మెడి క్లీనిక్ ఆసుపత్రి డాక్టర్లు పక్షవాతమని తేల్చేశారు . బ్రెయిన్ సర్జరీ కూడా చేయాల్సి ఉందనీ నిర్ధారించారు . అప్పటికే గంగారెడ్డి పరిస్థితి మరింత విషమించి కోమాలోకి వెళ్లి .. చావు అంచును చూసిన పరిస్థితి . ఎంతో ఆయుష్షున్నవాళ్లను కూడా ఒక్కోసారి కనీసం ఊహకు కూడా తెలియకుండా మృత్యురూపంలో లాక్కుని వెళ్లే విధి ... గంగారెడ్డికి ఇంకా భూమ్మీద నూకలు చెల్లున్నాయో ఏంటోగానీ .. కొంత వెనుకడుగు వేసింది . దాంతో ఆరు నెలలపాటు కోమాలో ఉన్న గంగారెడ్డి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు . గత ఏడాది 2020 డిసెంబర్ 25 నుండి ఇప్పటి వరకు 9 నెలలు డాక్టర్లు చికిత్స చేస్కుంటూ వస్తున్నారు . అయితే తండ్రి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా పర్లేదని తెల్సుకున్న తన కొడుకు మణికంఠ .. తండ్రి గంగారెడ్డిని ఎలాగైనా ఇండియా తీసుకురావాలని భావించాడు . కానీ దుబాయ్ ఆసుపత్రిలో తండ్రిని డిశ్ఛార్జ్ చేయాలంటే ఏకంగా 3 కోట్ల 40 లక్షల రూపాయలు చెల్లించాలి .

  ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్టుగా కొన్ని గల్ఫ్ కార్మిక సంఘాలు దేశంగాని దేశంలో చేస్తున్న కృషి అనిర్వచనీయం కాగా ... అదిగో అలాంటి దుబాయిలో సామాజిక సేవనందిస్తున్న గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి ( GWPC ) అధ్యక్షుడు గుండల్లి నర్సింహను గంగారెడ్డి కుమారుడు మణికంఠ .. తన స్నేహితుడు ఇబ్రహీంతో కలిసి తన తండ్రిని తమ ఊరికి రప్పించాలని కోరారు. అదేమంత చిన్న విషయం కాదు.. కానీ , ప్రయత్నం మానవ లక్షణం .. అందుకే నర్సింహ వెంటనే స్పందించాడు .

  Five in the world: ఇప్పటి వరకు ప్రపంచంలో ఐదుగురికి మాత్రమే ఇలా జరిగింది.. అదేంటో తెలుసా..


  నర్సింహా పేషంట్ గంగారెడ్డి చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు పలుమార్లు వెళ్లి .. అక్కడి హాస్పిటల్ అధికారులు , పోలీస్ అధికారులతో మాట్లాడుతూనే .. మరోపక్క కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ( దుబాయి ) అధికారులతోనూ పరిస్థితిని వివరించే యత్నం చేశాడు . పేషంట్ ఆరోగ్య పరిస్థితి ఎంత దయనీంగా ఉంది .. ఇండియాలో వాళ్ల కుటుంబ పరిస్థితులేంటన్నవి మానవత్వమున్న ఎవరైనా కరుణించకతప్పలేని విధంగా దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికార యంత్రాంగాన్ని కన్విన్స్ చేశాడు .

  హాస్పిటల్ యాజమాన్యం వేసిన 9 నెలల బిల్లు ఇంచు మించు అక్షరాలా మూడు కోట్ల నలబై లక్షల రూపాయలను కూడా మాఫీ చేయించాలని కోరాడు . అయితే గంగారెడ్డి కొడుకు మణికంఠ అడగ్గానే నర్సింహ ఏవిధంగానైతే స్పందించాడో .. దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారుల్లోనూ అదే ప్రతిస్పందన కనిపించింది . పైగా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి ( GWPC ) సంస్థ మీద భరోసా ఉంచి .. గంగారెడ్డిని ఇండియా పంపేందుకు కావల్సిన ఫార్మాలిటిస్ , ఇతర పేపర్ వర్క్ అంతా పూర్తిచేయాలని గుండెల్లి నర్సింహను కోరారు. గుండెల్లి నర్సింహ ఆ పనంతా పూర్తి చేసి .. ఇండియన్ కౌన్సిల్ లేట్ అధికారులకు తెలపడంతో .. ఇండియన్ కాన్సులేట్ అధికారులు ప్రయాణించటం కోసం ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్సుని కూడా మాట్లాడ్డంతో పాటు .. పేషంట్ గంగారెడ్డి వెంట అతని ట్రీట్మెంట్ కోసం ఒక నర్సు సదుపాయం కూడా ఏర్పాటు చేశారు .

  Sexual Health: వయసు పెరిగాక మహిళల్లో శృంగార కోరికలు ఎందుకు తగ్గుతాయి..? పునరుత్తేజం పొందాలంటే ఏం చేయాలి..


  ఎట్టకేలకు దుబాయ్ లోని కాన్సలేట్ అధికారుల పూర్తి సహాయ , సహకారాలతో హాస్పిటల్ యాజమాన్యం వేసిన బిల్లు మూడు కోట్ల నలబై లక్షల రూపాయలను కూడా మాఫీ అయి .. నిన్న గంగారెడ్డి ఇండియాకు చేరుకున్నాడు . అయితే పేషంట్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని .. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి పేషంటుని నేరుగా తమ ఇంటికి తీసుకెళ్లకుండా పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు .

  దుబాయిలోని మెడి క్లినిక్ సిటీ హాస్పిటల్ నుండి ఎయిర్పోర్ట్ వరకు ఎయిర్ అంబులెన్స్ తో పాటు .. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నిమ్స్ హాస్పిటల్ వరకు ఎయిర్ అంబులెన్స్ కు అదనంగా అయిన ఖర్చు అక్షరాలా నాలుగు లక్షల నలభై వేల రూపాయలను కూడా దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ అధికారులే సమకూర్చడమంటే మాటలు కాదు . కానీ నర్సింహ కృషి ఫలించింది . తండ్రి గంగారెడ్డిని సొంతూరుకు తీసుకొచ్చుకోవాలనే కొడుకు మణికంఠ కల సాకారమైంది .
  Published by:Veera Babu
  First published: