(P.Srinivas,New18,Karimnagar)
సాధారణంగా ఎక్కువగా ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా, నిజామాబాద్ (Nizamabad) జిల్లాలకు చెందిన కుటుంబలు ఎక్కువగా జీవనో ఉపాధి కోరకు గల్ఫ్ దేశాల(Gulf countries)కు వలస వెళ్లి పనులు చేసుకుంటూ కాలం వెలదీస్తున్నారు ..ఐతే ఈ మధ్య కాలంలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కుటుంబాల్లో ఇటీవల గుండెపోటు(Heart attack)మరణాలు ఎక్కువయ్యాయి. పని ఒత్తిడి, వీసా మోసాలు(Visa fraud),వాతావరణం అనుకూలించకపోవడం తదితర కారణాలతో మృత్యు ఘటనలు పెరుగుతున్నాయి. కళ్లముందు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే తట్టుకోలేని అభాగ్యుల కుటుంబాలు వేల మైళ్ల దూరంలో నిర్జీవంగా మారిన తమ వారి గురించి తెలుసుకుని తల్లడిల్లుతున్నారు.
పొరుగు దేశాల్లో పోతున్న ప్రాణాలు..
అక్కడ కంపెనీలు చేయూత ఇవ్వక.. ఇక్కడ ప్రజాప్రతినిధుల చేదోడు లేక విధి వైపరీత్యాన్ని తలచుకుంటూ రోదిస్తున్నారు. గుండెనొప్పితో మృతి చెందుతున్న ఘటనలు తలచుకుంటూ పలు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వాలు సాయం చేయాలని, బాధితులు పనిచేస్తున్న కంపెనీలు కూడా ఆదుకోవాలని అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి . గల్ఫ్ దేశాల్లో కార్మికులు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఆయా సందర్భాల్లో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఎన్నారై విభాగం ఏర్పాటు చేసి ఇతర దేశాలకు ఎందరు వెళ్తున్నారో కచ్చితమైన వివరాలు నమోదు చేయాలి. మృతిచెందిన వారి వివరాలు అందుబాటులో ఉంచి ఎక్స్రేషియా అందజేయాలి. మరణాలపై అధ్యయనం చేసి కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా చేయూత అందించేలా చూడాలని..న్యూస్ 18కి బాధితులు తెలిపారు.
గాల్లో వలస పక్షుల ప్రాణాలు..
ఇటీవల కాలంలో గుండె పోటుతో మృతిచెందుతున్న ఘటనలే ఎక్కువగా ఎక్కువగా జరుగుతున్నాయి .ఇటీవలి ఘటనల్లో 35 నుంచి 50 సంవత్సరాల వారు మృతిచెందడం విషాదం నింపుతోంది.శారీరక, మానసిక ఒత్తిడి వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.అతి తక్కువ ఉష్ణోగ్రతతో పాటు అధిక ఉష్ణోగ్రతలో పని చేయాల్సి రావడం గుండెపోటుకు కారణమవుతోదని వైద్యులు అంటున్నారు. మధ్య వయస్కులు ఉపాధి కోసం రావడం, వేతనాల సమస్యతోకుటుంబ పోషణ భారం కావడం ఇబ్బందిగా ఉంది. గల్ఫ్ దేశాల్లో కొందరికి ఉపాధి లేక.. అప్పుల భారంతో ఇంటికి వెళ్లలేక.. మానసికంగా కుంగిపోతున్నారు.ధ్రువీకరణ పత్రాలు కలిగిన వారిని కూడా కంపెనీలు పలు సందర్భాల్లో సతాయిస్తుండటం ఒత్తిడి కలిగిస్తోంది.కొన్ని రకాల పనుల్లో రసాయనిక, జీవ సంబంధమైన వ్యర్థాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.ఆకాశ హర్మ్యాలను తలపించే నిర్మాణాల్లో కూలీల పని గుండె నొప్పిని తెచ్చి పెడుతోంది.
వలస కుటుంబాల కన్నీటీ కథలు..
ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన రాడ చిన్న రామోజీ ఖతర్ గుండెపోటుతో మృతిచెందాడు కోరుట్ల మండలం యూసుఫ్ నగర్‌కు చెందిన బత్తిని రవి ఒమన్ లో గుండెపోటుకు గురై మృతిచెందారు.మేడిపల్లి మండలం గోవిందారం. గ్రామానికి చెందిన మొగిళ్ల శ్రీనివాస్ ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. నవంబరులో గుండెపోటుతో మృతిచెందగా ఆయన మృతదేహం కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివలింగాలపలికి చెందిన మారవేని రాములు గుండెపోటుతో చనిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Telangana News