KARIMNAGAR RELATIVES AND STUDENTS STAGED A PROTEST AGAINST THE DEATH OF A STUDENT IN KARIMNAGAR DISTRICT SNR KNR
Karimnagar : ప్రైవేట్ హాస్టల్లో నైన్త్ క్లాస్ స్టూడెంట్ మృతి .. అఖిలది అనుమానాస్పదమృతే అంటూ ఆందోళనలు
(అఖిల ఎలా చనిపోయిది..?)
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఉద్రిక్తత నెలకొంది. ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న స్టూడెంట్ చనిపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. కారణం చెప్పమంటే యాజమాన్యం చెప్పకపోవడంతో ధర్నా కొనసాగిస్తున్నారు.
(P.Srinivas,New18,Karimnagar)
ప్రైవేట్ హస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్ధిని అకస్మాత్తుగా చనిపోయింది. బాలిక మృతి( girl died)కి కారణం ఏమై ఉంటుందని పేరెంట్స్ హాస్టల్ నిర్వాహకుల్ని ప్రశ్నించారు. అందుకు రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యం సమాధానం చెప్పకపోవడంతో చేపట్టిన ఆందోళన కరీంనగర్(Karimnagar)జిల్లా జమ్మికుంట(Jammikunta) పట్టణంలో ఉద్రిక్త పరిసిస్థితులకు కారణమైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం హాస్టల్లో తొమ్మిదవ తరగతి చదువుతోంది తిప్పిరెడ్డి అఖిల అనే బాలిక. ఆదివారం అఖిల హాస్టల్లో ఉన్న సమయంలోనే చనిపోయింది. హాస్టల్ యాజమాన్యం విషయాన్ని పేరెంట్స్‌కి తెలియపరిచారు. బిడ్డ మరణవార్త వినగానే హాస్టల్‌కి వచ్చిన అఖిల పేరెంట్స్ తమ బిడ్డ ఎలా చనిపోయింది..కారణం ఏమిటని హాస్టల్ యాజమాన్యాన్ని నిలదీశారు. కారణం చెప్పకపోగా హాస్టల్ యాజమాన్యం మృతురాలి తల్లిదండ్రులను మాటలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
స్టూడెంట్స్ డెత్ మిస్టరీ..
బిడ్డ చనిపోయిన బాధతోనే ఎలా చనిపోయిందో చెప్పమని పట్టుబట్టారు అఖిల తల్లిదండ్రులు. న్యూ మిలీనియం హాస్టల్ యాజమాన్యం, సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో అఖిల తల్లిదండ్రులు, బంధువులు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. అఖిల మృతికి కారణాలు చెప్పాల్సిందేనంటూ ఆదివారం నుంచి స్కూల్ ముందు టెంట్ వేసుకొని ఆందోళనకు దిగారు. దీంతో హాస్టల్ దగ్గరకు భారీగా పోలీసులు చేరుకొని వారి ధర్నాను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు కదిలేది అఖిల తల్లిదండ్రులు పట్టుబట్టారు.
కారణం చెప్పాలంటూ నిలదీత..
మరోవైపు అఖిలది సహజ మరణమా లేక హత్య, ఆత్మహత్య అర్ధం కాకపోవడంతో అఖిలపక్షం విద్యార్ధి సంఘాలు సైతం ఆందోళన చేపట్టాయి. స్టూడెంట్ మృతిపై నెలకొన్న అనుమానాలకు సమాధానం చెప్పాలంటూ హుజురాబాద్- జమ్మికుంట హైవేపై భైఠాయించారు. విద్యార్ధి సంఘాల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని విద్యార్ధి సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
ఇది చదవండి : కామారెడ్డి జిల్లాలో పొరుగింటి వారితో కొట్లాట .. సైకోలా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసా
తల్లిదండ్రుల అనుమానం..
మరోవైపు చనిపోయిన స్టూడెంట్ అఖిల మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. న్యూమిలీనియం హాస్టల్ యజమాని అధికార పార్టీకి చెందిన వీణవంక ఎంపీపీ ముషఇపట్ల రేణుకా భర్త తిరుపతిరెడ్డి కావడం వల్లే తమ ఆందోళనను పట్టించుకోవడం లేదని విద్యార్ది తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈవిషయంలో తమకు న్యాయం జరిగే వరకు ..కాలేజీ యాజమాన్యం సమాధానం చెప్పే వరకూ ఆందోళన కొనసాగిస్తామని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.