Home /News /telangana /

KARIMNAGAR REAL ESTATE TRADERS TAKING RYTHU BANDHU FOR HOUSES IN KARIMNAGAR DISTRICT OF TELANGANA SNR KNR

Telangana: 2ఏళ్లుగా ఇళ్లకు రైతుబంధు .. సర్కారు పథకానికి తూట్లు పొడుస్తున్న వ్యాపారులు

(ఇళ్లకు రైతుబంధు)

(ఇళ్లకు రైతుబంధు)

Rythu Bandhu:వ్యవసాయం చేసుకునే చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయంగా సర్కారు అందజేసే రైతుబంధును ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొందరు రాబంధులు దోచుకుంటున్నారు. పథకం కింద నగదు పొందడానికి ఎలాంటి అర్హతలు లేకపోయినా నాలుగేళ్లుగా డబ్బులందుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,New18,Karimnagar)
    వ్యవసాయం చేసుకునే చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయంగా సర్కారు అందజేసే రైతుబంధును ఉమ్మడి కరీంనగర్‌ (Karimnagar)జిల్లాలో కొందరు రాబంధులు దోచుకుంటున్నారు. అన్నీ అర్హతలున్న సామాన్య రైతులకు రైతుబంధు (Rythu bandhu)రావాలంటే ప్రభుత్వ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలి. అదే బడా బాబులకు రైతు బంధు కావాలంటే జేబులో డబ్బులిచ్చినంత సులువుగా ఇచ్చేస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పొలాలకు బదులుగా బీడు భూములకు, గుట్టులకు రైతుబంధు అందుతుందనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. కొత్తగా బయటపడిన మరో రహస్యం ఏమిటంటే జిల్లాలో ఇళ్లు(Houses)కట్టించిన స్తలాలకు కూడా రైతు బంధు ఇస్తున్నారంటే రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం నిధులు ఎంత దుర్వినియోగం అవుతున్నాయి అర్ధం చేసుకోవచ్చు

    వేల కోట్ల అవినీతి..
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ చోద్యం సాక్షాత్తు రెవెన్యూ కార్యాలయం పక్కనే ఉండడం విశేషం. హైదరాబాద్ హైవేపై నిర్మించిన శంకర్ హోమ్స్ వెనుక జరిగిన లోగుట్టు అంతా ఇంతా కాదు . దాదాపు ఐదేళ్ల క్రితం ప్లాట్లుగా విభజించిన ఈ స్థలంలో రెండేళ్ల క్రితం ఇండిపెండెంట్ ఇండ్ల నిర్మాణం చేపట్టి అమ్మకాలు చేశారు. సర్వేనెంబర్ 299లోని 6 ఎకరాల వ్యవసాయ భూమిలో నాలుగు ఎకరాల్లో హోమ్స్ నిర్మించారు. ఒక్కో ఇంటిని రూ .30 నుంచి రూ .40 లక్షలకు ఓ రియల్టర్ విక్రయించారు.

    ఇళ్లకు రైతుబంధు..
    ఇళ్లు కట్టించి రియలెస్టేట్ వ్యాపారం చేసుకున్న భూమి యజమానికి మాత్ర ఈ నాలుగు ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో మాత్రం వ్యవసాయ భూమిగానే ఉండడం ఆశ్చర్యం కల్గిస్తోంది . పట్టాదారు కూడా నాలుగు సార్లు రైతు బంధు కూడా తీసుకున్నట్లుగా వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి .  తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఏర్పడిన శంకర్ హోమ్స్ విషయంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది . నాలా కన్వర్షన్ అయిన తర్వాత అప్ డేట్ చేయడంలో రెవెన్యూ యంత్రాంగం రికార్డులు పరిశీలించకుండానే వ్యవసాయ భూమిగా ఆన్లైన్ లోకి ఎక్కించారు .

    అధికారుల నిర్లక్ష్యం..
    ఆ కారణంగానే పట్టాదారు కూడా తనకు రైతు బంధు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోవడంతో నాలుగు సార్లు నాలుగు ఎకరాలకు రైతు బంధు డబ్బులు కూడా అకౌంట్లో జమ అయ్యాయి. మ్యాన్యువల్ సిస్టం ద్వారా నాలా అనుమతులు ఇవ్వడం అవి ఆన్ లైన్లో అప్ లోడ్ చేయకపోవడంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని తెలుస్తోంది. అయితే కమర్షియల్ భూముల వివరాలను అప్ లోడ్ చేసేప్పుడు అన్నిరికార్డులను పరిశీలించకుండా వ్యవహరించడమే ఈ తప్పిదానికి కారణమంటున్నారు అధికారులు.

    ఇలాంటి అక్రమాలెన్నో..
    ఇదే విషయం తహసిల్ధార్‌ను వివరణ కోరగా ధరణి అమలుకు ముందు ఆర్డీఓ కార్యాలయం నుంచి మ్యాన్యూవల్ గా అనుమతులు ఇచ్చినప్పటికీ ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయకపోవడంతో రైతు బంధు అమలైందంటున్నారు. ఇది మచ్చుకు మాత్రమే..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు వేల కోట్ల రూపాయలు గోల్‌మాల్ అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Karimnagar, Rythu bandhu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు