హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కోవిడ్ బాధితులకు అండగా.. నిత్యావసర సరుకులతో పాటు ఉచిత అంబులెన్స్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు.

Telangana: కోవిడ్ బాధితులకు అండగా.. నిత్యావసర సరుకులతో పాటు ఉచిత అంబులెన్స్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు.

బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

Telangana: కరోనా మానవసంబంధాలను దూరం చేసింది. అయిన వారిని సైతం కాకుండా చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ కోసం.. మీ కష్టాలను తీర్చేందుకు నేనున్నానంటూ ఆపత్కాలంలో ఆపద్బాంధవుడిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అప్తుడిలాగా ఇంటింటికి తిరుగుతూ.. వారి వద్దకు వెళ్లి వారిలో మనోధైర్యం నింపుతున్నారు.

ఇంకా చదవండి ...

(పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18తెలుగు)

ప్రజాప్రతినిధునిగా ఎన్నికైన ఆ ఎమ్మెల్యే కరోనా కాలంలో నేనున్నానంటూ ముందుకు కదిలారు. బాధితులకు నిత్యవసరాలు, పండ్లు, పౌష్టికాహారం అందిస్తున్నారు. తమతో పాటుగా ఎమ్మెల్యే వైద్య సిబ్బందిని వెంట తీసుకుని కారోనా సోకిన వారి ఇండ్ల వద్దకు వెళ్లి వారి ఆరోగ్యపరిస్థితులను తెలుసుకుంటున్నారు. కారోనా బాధితులను అప్యాయ్యంగా పలకరిస్తు మీ కోసం నెనున్నాంటూ వారిలో మనోధైర్యం నింపుతున్నారు. కారోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటరు అన్నదాతగా మారి విజయమ్మ పౌండేషన్ ద్వారా నిత్యం 3 పూటలు అన్నం అందిస్తున్నారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రామగుండం నియోజకవర్గంలోని కరువు బారిన పడిన ప్రజలకు భరోసాగా ఉండేందుకే మీకోసం మీ ఎమ్మెల్యే భరోసా యాత్రలు చేపట్టడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఇప్పటికే చాలా మండలాలు, గ్రామాల్లో, పర్యటించిన ఎమ్మెల్యే, ప్రతి ఇంటికి వెళ్లి కరోనా బాధితులకు ధైర్యం చెప్పారు, నిత్యావసర వస్తువులు పండ్లు అందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా కరోనా వైరస్ బారి నుంచి కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్యులు కేటీఆర్ నిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. రామగుండం నియోజక వర్గంలోని ప్రజలందరికీ రక్షణగా తాముంటామని వారి కష్టాలను కన్నీళ్లను తుడుస్తామని అన్నారు. కరోనా బాధితుల కోసం గోదావరిఖని పట్టణంలోని సప్తగిరి కాలనీలో కరోనా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఇళ్లలో ఉండలేని కరోనా బాధితులు కరోనా కేర్ సెంటర్లో ఉండాలన్నారు. కరోనా బాధితులకు మూడు పూటలా భోజనానికి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా తాము అందిస్తున్నామని చెప్పారు.

బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

కరోనా సోకి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యం తోపాటు కరోనా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా వస్తే ఎవరూ అధైర్యపడవద్దని మనోధైర్యంతో కరోనాను జయించవచ్చన్నారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని.. మే మొదటి రోజు మొదలైన ఈ కార్యక్రమం కరోనా తగ్గే వరకు కొనసాగుతుందని ఎమ్మెల్యే చెప్పారు.

First published:

Tags: Corona helping, Free ambulance, Free food for corona, Help desk, Karimnagar, Ramagundam mla, Telangana

ఉత్తమ కథలు