KARIMNAGAR PSYCHO HUSBAND BURNS CAR IN ANGER AT WIFE IN PEDDAPALLI DISTRICT SNR KNR
Peddapalli::లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్య ఆ పని చేసిందని సైకోగా మారి ఆ పని చేశాడంట
(సైకో చేష్టలు)
Peddapalli:ఎవడికైనా కోపం వస్తే దానికి కారణమైన వారిపై పగ తీర్చుకుంటారు. కాని తనకు తానే నష్టం చేసుకున్నాడో సైకో. పెద్దపల్లి జిల్లాలో ఓ వ్యక్తి భార్యపై కోపంతో చేసిన ఘనకార్యం తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. సైకో చేసిన పనికి వేరే వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
కొందరు వ్యక్తులు చేసే చర్యలు, వాళ్లు ప్రవర్తించే విధానాన్ని బట్టే సైకోలంటారు. పెద్దపల్లి(Peddapalli)జిల్లాలో కూడా ఓ సైకో వింత చర్యకు పాల్పడ్డాడు. అందుగులపల్లి(Andhugulapalli)గ్రామ శివార్లలోని ఎల్లమ్మ టెంపుల్ (Yellamma Temple)దగ్గర ఓ స్కార్పియో కారుScorpio car నడిరోడ్డుపై మంటల్లో కాలిపోయింది. రోడ్డుపై వెళ్తున్న వాళ్లు చూసి వెంటనే పోలీసు(Police)లకు సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది సాయంతో స్పాట్‌కి చేరుకున్న పోలీసులు కారులో ఎవరైనా ఉన్నారేమోనని ఫైరింజన్(Fire engine)సాయంతో మంటలార్పారు. అంతలోనే కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో మంటలు ఎలా వచ్చాయని ఆరా తీసిన పోలీసులకు నిజం తెలిసి షాక్ అయ్యారు. కారు ఓనర్ వివరాలు తెలుసుకున్నారు. స్కార్పియో వాహనం మంటల్లో కాలిపోవడానికి ప్రమాదమో, దుండగుల చర్య కాదని తేల్చారు. కాలిపోయిన కారు పాలకుర్తి(Palakurti)మండలం జీడీ నగర్ బీసీ కాలనీకి చెందిన అర్జున్(Arjun)అలియాస్ ఆపిల్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. అతనే స్వయంగా కారుపై పెట్రోల్(Petrol) పోసి నిప్పంటించి తగలబెట్టాడు. పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారిపై స్కార్పియో దగ్ధం అవుతుంటే చూసి నవ్వడంతో రోడ్డుపై వెళ్తున్న వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఓనరే తన కారును ఎందుకు తగలబెట్టుకున్నాడని ఆరా తీయడంతో అతనో సైకో(Psycho)అని విచారణలో తేలింది. కారు యజమాని అర్జున్ అనూష(Anusha) అనే యువతి ప్రేమించుకున్నారు. కొద్దిరోజుల క్రితమే ప్రేమ వివాహం(Love marriage) చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్య, భర్తల మధ్య గొడవలు తలెత్తడంతో అనూష మనస్తాపానికి గురై పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలి వెళ్లిపోయిందని సైకోగా మారాడు అర్జున్.
కారు ఓనరే సైకో..
అందుగులపల్లి శివార్లలో కారు తగలబడిపోయిన ఘటనపై బసంత్‌నగర్ ఎస్ఐ మహేందర్ యాదవ్ మాట్లాడుతూ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఇచ్చిన సమాచారం ప్రకారం తగలబడిపోతున్న కారును ఫైరింజన్ల సాయంతో ఆర్పామన్నారు. కారు ఓనరే ఇలా తన వాహనాన్ని తగలబెట్టుకొని సైకోలా ప్రవర్తించడంపై కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో ఆరా తీస్తున్నామన్నారు. అర్జున్ అనుషని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇరువురి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని అందుకే ఆమె పుట్టింటికి వెళ్లిందని తేల్చారు.
భార్య దూరమైందనే కోపంతో..
భార్య పుట్టింటికి వెళ్లడంతో సైకోగా మారాడు అర్జున్. ఈక్రమంలోనే ఎవరిపై తన కసి తీర్చుకోవాలో తెలియక కారుకు నిప్పుపెట్టుకున్నాడని పోలీసుల విచారణలో రాబట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో సైకోగా మారిన అర్జున్ తన వాహనాన్ని తగలపెట్టుకున్నాడు కాబట్టి ప్రమాదం జరగలేదని..వేరే వ్యక్తుల ఆస్తులను తగలబెట్టి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.