Home /News /telangana /

KARIMNAGAR PRIVATE SCHOOLS MANAGEMENT GIVES ULTIMATUM TO GOVERNMENT ON REOPEN

Private schools : స్కూళ్లు తెరుస్తారా..? లేదా..? ప్రభుత్వానికి ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యం అల్టిమేటమ్

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Private schools : ప్రైవేటు స్కూళ్ల రీ ఓపెన్ పై ఆయా సంస్థల యాజమాన్యం ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేసింది. ముప్పై ఒక్కటి తర్వాత ప్రభుత్వం తేల్చకపోతే తామే విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి స్కూళ్లను రీ ఓపెన్ చేస్తామని చెప్పారు.

  ( కరీంనగర్ జిల్లా న్యూస్ 18. తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి.)

  కరోనాతో స్కూళ్లకు సెలవులపై ఆ సారి పలు విమర్శలు చెలరేగుతున్నాయి.. ఇతర వ్యాపార సంస్థలకు లేని కరోనా కేవలం విద్యార్థులకే ఎలా సోకుతుందంటూ విద్యా సంస్థల ప్రతినిధులతో పాటు పలు సామాజిక రంగ నిపుణులు, మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా స్కూళ్ల మూసివేత వెనక ఏదో కుట్ర దాగుందనే విమర్శలు ఇటివల ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆదాయాన్ని ఇచ్చే వాణిజ్య కార్యకలాపాలకు లేని కరోనా ప్రత్యేకంగా విద్యార్థులకే ఎలా సోకుందనే ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రవేటు విద్యా సంస్థల యజమానులు ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చారు.

  ఈ క్రమంలోనే రాష్ట్రంలో కరోనా ఉధృతి కారణంగా సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ( ట్రస్మా ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే స్కూళ్లు తెరవాలని లేనిపక్షంలో ఈనెల 31 తర్వాత పేరేంట్స్ ఒప్పందంతో బడులు తెరుస్తామని స్పష్టం చేశారు .ఈ సంధర్భంగా వారు పలు ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించారు. వీటిలో ముఖ్యంగా కరోనా అదుపులోని ఉందని ప్రభుత్వమే చెబుతుందని అలాంటప్పుడు ఎందుకు స్కూళ్లు మూసి వేశారని ప్రశ్నించారు . తెలంగాణ కంటే ఎక్కువ కేసులు నమోదువున్న రాష్ట్రాల్లో బడులు నడుస్తున్నాయని తెలంగాణలోనే ఎందుకు ఇలా చేస్తున్నారని అన్నారు. స్కూళ్లు తెరవాలని పిల్లల తల్లిదండ్రులే స్వయంగా కోరుతున్నారని చెప్పారు. పిల్లలకు లెర్నింగ్ లాస్ ఇప్పటికే పెరిగిపోతుందని అలాగే పరీక్షల కాలం మొదలవుతున్నందున కావున కనీసం 50 శాతం మందితో ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  Khammam : ముందుగా మర్యాద రామన్న ఆ తర్వాత మున్నాభాయ్ ఎంబీబీఎస్.. మాములుగా లేదు కథ..

  ఈసందర్బంగా TRSMA అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ప్రభుత్వ విధానలపై మండిపడ్డారు..కరోనా పేరుతో విద్యార్థుల జీవితాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కరోనాతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని దీంతో ప్రాధమిక స్థాయి విద్యార్థులకు పై తరగతులకు వెళ్లినప్పుడు ఏం చదవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కరోనా వైరస్ జాగ్రత్తలను పాటిస్తూ విద్యాసంస్థలను నిర్విరామంగా సాగిస్తూ ఉన్నప్పుడే విద్యార్థుల జీవితాలు వెలుగులోకి వస్తాయని పేర్కోన్నారు .

  కరోనా కేసులు పెరగడంతో రాష్ట్రంలో వీటిని మూసివేయకుండా విద్యాసంస్థలు మాత్రమే మూసివేసి విద్యార్థులతో ఉపాధ్యాయు లతో చెలగాటం ఆడటం సమంజసం కాదని అన్నారు.? తెలంగాణ రాష్ట్రంలో కేవలం విద్యాసంస్థలు మూసివేసినంత మాత్రాన కరోనా మూడవ దశ ఆగిపోతుందని నాయకులు అనుకోవడం పొరపాటుగా అభివర్ణించారు.. , వివిధ రాజకీయపార్టీల సమావేశాలు , సంబరాలు జరుపుతున్నప్పుడు కార్యకర్తలకు నాయకులకు రాని కరోనా పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఎందుకు వస్తుంది ? రెస్టారెంట్ హోటల్ , మద్యం దుకాణాలు సముదాయాలు విచ్చలవిడిగా నిర్వహిస్తూ , పర్మిట్ రూమ్లకు అనుమతులు కల్పిస్తూ మందుతాగే మద్యం ప్రియులకు రాని కరోనా వైరస్ నేటి బాలలే రేపటి పౌరులు అన్న విద్యార్థులకు ఎందుకు వస్తుంది ? అంటూ ప్రశ్నించారు.

  Adilabad : నువ్యుల నూనెతో ఆ దేవుడికి నైవేధ్యం... అది తాగిన తర్వాతే ఉత్సవం

  స్కూళ్ల మూసివేతతో ప్రైవేట్ ఉపాధ్యాయులు కూలిపని చేసు కుంటూ పస్తులు ఉంటూ కాలం గడుపుతున్న ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వం నెలలు మాత్రమే 25 కేజీల బియ్యం , రెండువేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వ ఆదాయం గండిపడుతుందన్న సాకుతో చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం .అంటూ ప్రశ్నిస్తున్నారు.

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Karimnagar, Private parts

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు