హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana:కరీంనగర్ జిల్లాలో పూజారులు వాటికి ముహుర్తాలు పెట్టరు..ఇదిగో ఫ్లెక్సీలు చూడండి

Telangana:కరీంనగర్ జిల్లాలో పూజారులు వాటికి ముహుర్తాలు పెట్టరు..ఇదిగో ఫ్లెక్సీలు చూడండి

(ముహుర్తాలు పెడితే జైలుకే)

(ముహుర్తాలు పెడితే జైలుకే)

Telangana:ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పూజారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రసవాలకు ముహుర్తాలు పెట్టమని తేల్చి చెబుతున్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్లుగా ఫ్లెక్సీలు కూడ ఏర్పాటు చేశారు.

ఇంకా చదవండి ...

(P.Srinivas,New18,Karimnagar)

ఉమ్మడి కరీంనగర్( Karimnagar)జిల్లా వ్యాప్తంగా పూజారులు (Priests)ఇకపై అలాంటి వాటికి ముహుర్తాలు పెట్టమని తేల్చి చెప్పారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సక్రమంగా అమలు జరిగేలా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల(Hospitals)దగ్గర ఫ్లెక్సీలు (Flexes)సైతం ఏర్పాటు చేశారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూజారుల పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసలు దీనంతటికి కారణం ఏమిటనే అంశంపై ఆరా తీసింది న్యూస్‌18. గత కొన్ని రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవం కోసం వస్తున్న గర్భిణీ(Pregnants)లకు శస్త్రచికిత్స  చేసి.. డెలివరీ(Delivery)చేస్తున్నారు డాక్టర్లు(Doctors). అయితే  సాధారణ ప్రసవాలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికి వాటిని డాక్టర్లు పట్టించుకోకుండా ఆపరేషన్‌లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఇకపై ముహుర్తాలు పెట్టవద్దు..

ఎందుకు ఇలా చేస్తున్నారని వైద్యుల్ని ప్రశ్నిస్తే ...కాన్పు కోసం వస్తున్న గర్భిణీలు వారి కుటుంబ సభ్యులు కడుపులో ఉన్న బిడ్డ శుభ ఘడియల్లో పుట్టాలనే సెంటిమెంట్‌తో పూజారులతో టైమ్, డేట్‌ ఫిక్స్ చేసుకొని ఈ ముహుర్తానికే డెలవరీ చేయమని కోరుతున్నారని అంటున్నారు. వాళ్ల కోరిక మేరకు ఆవిధంగా తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తోందని వైద్యులంటున్నారు. సిజేరియన్లు పెరగడం, నార్మల్ డెలివరీలు తగ్గడానికి పురోహితులు ముహుర్తాలు పెట్టడమే ఇందుకు ప్రధాన కారణమని తేలింది. అయితే పూజారులు మాత్రం ఇది మేం నిర్ణయించింది కాదని..గర్బిణులు, వారి కుటుంబ సభ్యులే స్వయంగా తమను సంప్రదించి కాన్పులకు ముహుర్తాలు పెట్టమని కోరడం వల్లే చేస్తున్నామంటున్నారు. ఆ విధంగా ముహుర్తాలు పెట్టకూడదని చెప్పినప్పటికి పదే పదే కోరడం వల్లే తప్పడం లేదంటున్నారు పురోహితులు.

పూజారులకు కలెక్టర్ వార్నింగ్..

కాన్పులకు ముహుర్తాలు పెట్టడం అనే అంశం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సమస్యగా తయారవడంతో కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ,ప్రైవేటు, గైనకాలజిస్టులు, పురోహితులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెరగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆపరేషన్‌ చేసి బిడ్డల్ని బయటకు తీయడం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులకు సూచించారు.

రూల్స్ పాటించకపోతే జైలుకే..

ఇంతే కాదు ఇకపై డెలివరీలకు ముహుర్తాలు పెట్టమంటూ పూజారులు తీర్మానిచుకున్నట్లుగా ఓ ప్రత్యేక పోస్టర్లను గైనకాలజిస్టులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. వాటిని అన్నీప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు,ఆరోగ్య కేంద్రాల దగ్గర ఏర్పాటు చేశారు. ఇకపైన పూజారులు డెలివరీలకు ముహూర్తాలు పెడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఎవరైనా ముహూర్తాలు పెట్టాలని ఫోన్ చేసి అడిగితే వాళ్ల వివరాల్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని సూచించారు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

First published:

Tags: Karimnagar, Pregnant women

ఉత్తమ కథలు