హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rains Effects: అయ్యో ఎంత కష్టం.. అకాల వర్షాలకు దెబ్బతింటున్న పంటలు.. ఆ జిల్లా రైతుల గోస ఎవరితో మొరపెట్టుకునేది?

Rains Effects: అయ్యో ఎంత కష్టం.. అకాల వర్షాలకు దెబ్బతింటున్న పంటలు.. ఆ జిల్లా రైతుల గోస ఎవరితో మొరపెట్టుకునేది?

పంట నాశనం కావడంతో ఏడుస్తున్న మహిళ

పంట నాశనం కావడంతో ఏడుస్తున్న మహిళ

మూలిగే నక్కపై తాటిపండు అన్న చందాన అకాల వర్గాల అలజడి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి .

  (శ్రీనివాస్. పి. న్యూస్ 18, కరీంనగర్)

  మూలిగే నక్కపై తాటిపండు అన్న చందాన అకాల వర్గాల అలజడి రైతులను (Farmers) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి . బుధవారం  జగిత్యాల (jagityal), సిరిసిల్ల (Siricilla), కరీంనగర్ పట్టణంలో సాయంత్రం రాళ్లవర్షం (Hail) కురవగా, గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు , వడగండ్ల వాన (hailstrom) రైతులను అతలాకుతలం చేసింది . ఈదురుగాలతో కూడిన వానతో ఆయా జిల్లాలో వరి , మామిడి, నువ్వు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది . వరి చేతికి వచ్చే పరిస్థితుల్లో నేల వాలడంతో పాటు నువ్వు సైతం నేల వాలింది . మామిడి తోటల్లో కాయలు రాలిపడి తీవ్ర నష్టం వాటిల్లింది . ఆరుగాలం శ్రమించిన అన్నదాతపై ప్రకృతి మరోసారి పగబట్టి ఆర్థికంగా (Financial) నష్టానికి గురి చేసిందని రైతులు వాపోతున్నారు .

  కాగా భారీ ఈదురు గాలులకు జగిత్యాల (jagityala) పట్టణంలోని గొల్లపెల్లి రోడ్లో గల ఎల్​ఐసీ కార్యాలయం ఎదుట ప్రమాదకరంగా ఉన్న చెట్టు (Tree) ఒక్కసారిగా కూలి ఆగి ఉన్న ఆటోపై పడింది. ఆటోలో ఇద్దరు మహిళా ప్రయాణీకులుండగా  అందులో లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళా ప్రయాణికురాలికి (Woman passenger) స్వల్ప గాయాలయ్యాయి . విషయం తెలుసుకున్న బల్దియా చైర్​పర్సన్​ , కమిషనర్ స్వరూపారాణి , విద్యుత్ శాఖ ఏఈ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.

  Weather Updates in Telangana: మధ్యాహ్నం అలా.. సాయంత్రం ఇలా.. ఎండా వానా దోబూచులాట.. ఆశ్చర్యపోతున్న ప్రజానీకం.. 

  రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెట్లు (Trees fallen) కూలి నాలుగు బైకులు కూడా దెబ్బ తినడం జరిగింది. గాలివాన దుమారంకు మామిడి కాయలు (mangoes crop) నేలరాలాయి. మామి డి తోటల్లోని కాయలు రాలి మామిడి రైతులకు , మామిడి గుత్తేదార్లకు నష్టం వాటిల్లింది. చిరుజల్లులు కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం రక్షించుకునేందుకు పాట్లు పడ్డారు . జగిత్యాల మార్కెట్ యార్డులో చాలా మంది రైతుల వడ్లు తడిసిపోగా, మక్కలు నీటిలో మునిగిపోయాయి.

  Kishan Reddy| CM KCR: ఆ విషయాలపై మాట్లాడే హక్కు మీకు లేదు.. సీఎం కేసీఆర్​పై కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఫైర్​

  ప్రభుత్వం  (Government) స్పందించి రైతు లను ఆదుకోవాలని , తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని (Want to buy,), నష్టపోయిన రైతులకు పరిహారం  (Compensation to farmers) అందించాలని రైతులు కోరుతున్నారు.  ఎక్కువగా జగిత్యాల జిల్లా గ్రామలలో మామిడి పండ్లు నేలరాలగా , ఈదురుగాలులు , వర్షంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది  పరిస్థితిలో వడగళ్ళ వానలతో రైతులకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది . ఇప్పటికే వరిధాన్యం కొనేవాళ్ళు లేక సతమతమవుతున్న పరిస్థితిలో వడగళ్ళ వానలతో రైతులకు తీరని వేదనే మిగిలింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Cyclone effect trains, Farmers, Karimangar, Rains

  ఉత్తమ కథలు