Home /News /telangana /

Huzurabad: మొదలైన మినీ సంగ్రామం.. భారీగా పోలింగ్ నమోదవుతుందని అధికారుల అంచనా.. అతడివైపే మొగ్గుచూపుతున్న..

Huzurabad: మొదలైన మినీ సంగ్రామం.. భారీగా పోలింగ్ నమోదవుతుందని అధికారుల అంచనా.. అతడివైపే మొగ్గుచూపుతున్న..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad By Elections: హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనున్నది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధలను పాటించి ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనున్నది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ సారి పోలింగ్ 90 శాతం వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ తెలిపారు. బ్లైండ్ ఓటర్ల కోసం బ్రెయిలీ EVM లు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 32 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారని... 3,868 మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    Huzurabad Bypoll: ఆత్మగౌరవమా .. అభివృద్ధా..? నేడే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక..


    అంతే కాదు పోలింగ్ సెంటర్లలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు శశాంక గోయల్. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని అన్నారు. మాస్క్ ధరించి.. భౌతిక దూరంల పాటించాలని అన్నారు. ఇక ఎన్నికల సందర్భంగా మొత్తం తనిఖీల్లో రూ.3.50 కోట్లు క్యాష్ పట్టుకున్నట్లు పేర్కొన్నాడు.

    దీనిపై ఎన్నికల సంఘానికి నివేదించినట్లు పేర్కొన్నారు. హుజురాబాద్ లో ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. కవర్లలో డబ్బులను పంపిణీ చేసినట్లు తమకు ఫిర్యాదులు అందాయని.. ఈ డబ్బుల విషయంపై ఎంక్వైయిరీ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 85 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఓటును నోటు తీసుకోవడం.. ఇవ్వడం రెండూ నేరమే అని తెలిపాడు. డబ్బుల కోసం ధర్నా చేసిన వారిని.. ఆందోళన చేసిన మహిళలను గుర్తించి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.

    Huzurabad By Elections: హుజురాబాద్ ఉప ఎన్నిక ఈ సారి ప్రత్యేకంగా నిలవనుంది.. ఎందుకుంటే..


    ఇక ఈ ఉప ఎన్నికలో అభ్యర్థుల గెలుపోటములపై విపరీతంగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి. ఒక వైపు క్రికెట్ వరల్డ్ టీ20 మ్యాచ్ లు జరుగుతుండగా.. ఇటు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ రెండింట్లో పందేలు కాస్తూ.. కాలు దువ్వుతున్నారు పందెం రాయుళ్లు. ఎక్కుగా హుజురాబాద్ ఉప ఎన్నికలపైనే దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. మీడియా ప్రతినిధులకు బెట్టింగ్‌రాయుళ్లు ఫోన్‌లు చేస్తున్నారు. వివరాలు తెలుసుకుని బెట్టింగ్‌లు కడుతున్నారు. మూడు విభాగాలుగా ఈ బెట్టింగ్‌ నడుస్తోంది. పోలింగ్‌ ముందు, పోలింగ్‌ తరువాత ఒక తరహా బెట్టింగ్‌. హాట్‌ ఫేవరెట్‌పై 10 వేలు పెడితే లక్ష ఇచ్చేట్లుగా పందాలు కాస్తున్నారని తెలుస్తోంది. ఈ రోజు పోలింగ్ అయిపోతే నవంబర్ 2 న కౌంటింగ్ ఉంటుంది. ఇక ఆ రోజు మాత్రం బెట్టింగ్ భూతం పడగలు ఎత్తుతుంది.

    Shocking Incident: కన్నతల్లి అని కూడా చూడలేదు.. వాటి కోసం కొడుకు ఏం చేశాడో చూడండి..


    మెజారిటీ ఆధారంగా నడుస్తుందని తెలుస్తోంది. రూ. 50 వేలు పెడితే 5 లక్షలు ఇచ్చేట్టు. ఇదంతా ఆన్‌లైన్‌లోనే నడుస్తుందట. క్రికెట్ కన్నా ఇప్పుడు హుజురాబాద్ పొలిటికల్ లీగ్ పైనే ఎక్కువ బెట్టింగ్‌ జరుగుతోంది. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి పెట్టినట్లుగా సమాచారం. ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

    ఇక ఇక్కడ ఇలాంటి వాళ్లకు ఈటల రాజేందర్ ఫేవరేట్ గా ఉన్నాడు. అతడు గెలుస్తాడనే నమ్మకంతో ఎక్కువగా బెట్టింగ్ లు పెడుతున్నట్లు సమాచారం. మెజారిటీ కూడా 20 వేలు వస్తుందని అంచనా వేస్తున్నారు. అంతక ముందు సర్వేల్లో కూడా అతడి గెలుపుపైనే రిజల్ట్స్ ఇచ్చాయి. చూడాలి మరి చివరికి హుజురాబాద్ పీఠం ఎవరికి దక్కుతుందో.

    మీ నగరం నుండి (కరీంనగర్)

    తెలంగాణ
    కరీంనగర్
    తెలంగాణ
    కరీంనగర్
    Published by:Veera Babu
    First published:

    Tags: Huzurabad, Huzurabad By-election 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు