హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: హుజూరాబాద్ లో హీటెక్కిన రాజకీయం..కారు పార్టీలో కలకలం!

Karimnagar: హుజూరాబాద్ లో హీటెక్కిన రాజకీయం..కారు పార్టీలో కలకలం!

హుజూరాబాద్ లో హీటెక్కిన రాజకీయం

హుజూరాబాద్ లో హీటెక్కిన రాజకీయం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. గులాబీ పెద్దలు బుజ్జగించినా మంటలు చల్లారడం లేదు. హుజూరాబాద్ నియోజవర్గంనకు చెందిన కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న విబేధాలు కారు పార్టీలో కలకలం రేపుతున్నాయి. జడ్పీ చైర్ పర్స న్ కనుమల్ల విజయకు దళిత సంఘాలు , కమ్యూనిస్టులు మద్దతు ప్రకటించడంతో ఇక్కడి పరిస్థితి చక్కబడటం ఇప్పట్లో కనిపించడంలేదు. ఈ నెల 18 న టీఆర్ ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు జీవీ రామ కృష్ణారావు అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథులుగా ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్లు హాజరయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Karimnagar

కరీంనగర్ జిల్లా, శ్రీనివాస్. పి., న్యూస్ 18 తెలుగు ప్రతినిధి..

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. గులాబీ పెద్దలు బుజ్జగించినా మంటలు చల్లారడం లేదు. హుజూరాబాద్ నియోజవర్గంనకు చెందిన కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న విబేధాలు కారు పార్టీలో కలకలం రేపుతున్నాయి. జడ్పీ చైర్ పర్స న్ కనుమల్ల విజయకు దళిత సంఘాలు , కమ్యూనిస్టులు మద్దతు ప్రకటించడంతో ఇక్కడి పరిస్థితి చక్కబడటం ఇప్పట్లో కనిపించడంలేదు. ఈ నెల 18 న టీఆర్ ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు జీవీ రామ కృష్ణారావు అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథులుగా ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్లు హాజరయ్యారు.

అడవిని తలపించేలా... జూ లో జంతువులకు ఏర్పాట్లు.! ఎలా చేశారో చూడండి!

వీరీ ఎదుట జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ కంట తడిపెట్టారు. పాడి కౌశిక్ రెడ్డి వేదికపై మాట్లాడుతున్న సమయంలోనే ఆమె కంటతడి పెట్టడం కలకలం రేపింది. గంగుల కమలాకర్ , వినోద్ కుమార్ బుజ్జగించడమే కాకుండా సమావేశం అనంతరం ప్రతిమ హోటల్ కు కనుమల్ల విజయ , పాడి కౌశిక్ రెడ్డిలను పిలిపించుకొని నచ్చజెప్పారు. కలిసి ఉండాలని హితబోధ చేశారు. మంటలు చల్లారకపోగా మరింత హీటెక్కింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో విజయ కంటతడిపెట్టడం పై సీపీఐ పార్టీతో పాటు దళిత సంఘాలు స్పందించి ఆమెకు మద్దుతుగా నిలుస్తూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

Historical place: బీచ్‌లు ఒక్కటే కాదు బౌద్ధ నిర్మాణాలు అక్కడ బాగా ఫేమస్ .. ఒక్కసారి చూస్తే మర్చిపోరంతే

ఇదిలా ఉండగా ఇటీవలే వీణవంక మండలం కొండపాకలో పాడి కౌశిక్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి తృప్తి నివ్వడంలేదని, వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తానని మాట్లాడటం కూడా సంచలనమైంది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం నియోజకవర్గం ఇన్చార్జీగా వ్యవహరిస్తున్నారు. పాడి ప్రకటన గెల్లు వర్గీయులను ఆందోళనకు గురి చేసింది. ఈ వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారి హుజూరాబాద్ రాజకీయం చలికాలం పూట కాకరేపుతుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంను దళితబంధు పథకం కోసం పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ క్రమంలో నియోజక వర్గంలో అర్హులైన అందరికి దళితబంధు మంజూరు చేశారు. ఇందులో భాగంగా కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ భర్త కనుమల్ల గణపతితో పాటు మరో 24 మంది కలిసి చిన్నతరహా పరిశ్రమ కోసం గ్రూపును ఏర్పాటు చేసి కామధేనువు ఇండస్ట్రీస్, తిరుమల ఇండస్ట్రీస్ పేరుమీద సంస్థను ఏర్పాటు చేశారు. కామధేనువు సంస్థకు ఎండీగా కనుమల్ల గణపతి వ్యవహరిస్తున్నారు. తాము పరిశ్రమలను నెలకొల్పేందుకు స్థలం కావాలని దరఖాస్తు చేసుకున్నారు.

Kakinada: అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్న జిల్లా కలెక్టర్.. వాటి కోసమే మేడమ్ హడావుడి

టీఎస్ఎస్ఐఐసీకి తాము రూఫ్ షీట్ మేకింగ్ యూనిట్ తోపాటు సోడా కంపెనీ ఏర్పా టుకు ఈ స్థలం కేటాయించాలని, రెండు కోట్ల 30 లక్షలతో చిన్నతరహా పరిశ్రమలను నెలకొల్పుతామని, దీని ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు.  దీనికి స్పందించి పది సంవత్సరాల లీజు అగ్రిమెంట్తో జమ్మికుంటలో నిరుపయోగంగా ఉన్న యూఎల్ -2 కింద ఉన్న సర్వే నెంబర్ 275 , 278 లోని ఒక ఎకరం స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలం చుట్టూ గుట్టలు ఉండటంతో చాలా సంవత్సరాలుగా ఒడ్డెర కుటుంబాలు కంకర, బండలు కొడుతూ జీవనోపాధి సాగిస్తున్నారు. దామోదర్ రెడ్డి మంత్రి గా ఉన్న సయం నుంచి వీరు ఇక్కడే జీవనోపాధి సాగిస్తున్నారు. మొత్తం నాలుగు ఎకరాల వరకు ఉంటుంది. ఈ స్థలంలో ఎకరం స్థలం కామధేనువు, తిరుమల ఇండస్ట్రీసు కేటాయించడం వారు ఇక్కడి భూమిని చదును చేసేందుకు రావడంతో ఆందోళన మొదలైంది. వడ్డెర కులస్థులు కొందరు గత నెల కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఈ స్థలంలో మేము జీవనం సాగిస్తున్నామని, ఎవరి కి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడ దంటూ ధర్నా చేపట్టారు. ధర్నా చేపట్టిన వారు హుజురాబాద్ కు చెందిన టీఆర్ ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి నిలువెత్తు ఫొటోతో ఉన్న జెండాలతో ధర్నాలో పాల్గొన్నారు. వీరంతా పాడికి అనుకూలంగా జడ్పీ చైర్పర్సన్ విజయ భర్త కామధేనువు ఇండస్ట్రీస్ ఎండీ గణపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కౌశిక్ రెడ్డితోపాటు జమ్మికుంట మునిసిపల్ చైర్మన్ రాజేశ్వర్రావులు తాము పరిశ్రమ నెలకొల్పకుండా అడ్డుకుంటున్నారని జడ్పీ చైర్పర్సన్ వర్గీయులు ఇదివరకే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తు తం ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనితో ప్రతిపక్షాలకు ఇది అస్త్రంగా మారింది. అధిష్టానం ఇప్పటికే కౌసిక్ రెడ్డికి పలుమార్లు మందలించిన తను మారడం లేదని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Huzurabad, Huzurabad By-election 2021, Karimnagar, Telangana

ఉత్తమ కథలు