Huzurabad: ఉప పోరుకు ముందే బేరాలు.. ఇప్పటికే ప్రతీ గ్రామానికి రూ.కోట్లల్లో చేరిన ముడుపులు..! అత్యంత ఖర్చుతో కూడిన ఎన్నికగా మారుతుందా..!

హుజూరాబాద్ గ్రామ సూచిక

Huzurabad: తెలంగాణ లో పార్టీలన్నీ అక్కడే మకాం వేశాయి. ఎప్పుడో జరగబోయే ఉప పొరుకోసం ఇప్పటి నుండే, ప్రణాళికలు రచిస్తున్నారు. కసరత్తులు మొదలు పెట్టారు. గెలుపు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు, మనీ పాలిటిక్స్ కు తెరతీశాయా.. ఇప్పటికే కోట్ల రూపాయలు గ్రామాలకు చేరయా.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

  • Share this:
    (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

    కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఖాయమైంది. ఈటెల రాజేందర్ టీఆరెస్ కు రాజీనామా చేసి బీజేపీ లో చేరడం తో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పుడు అందరి దృష్టి ఈ నియోజకవర్గం వైపు మళ్లాయి. ముఖ్యంగా టీఆరెస్, బీజేపీ, పార్టీలు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నిక షెడ్యూలు రాకముందే నియోజకవర్గంలో పార్టీల నేతల కోలాహలం మొదలయింది. ఇప్పుడు విజయం కోసం టీఆరెస్, బీజేపీ లకు ప్రతిష్టాత్మకంగా మారడంతో విజయం కోసం ఎంతవరకైనా వెళ్లనున్నారని ప్లాన్ చేశారని అంటున్నారు. భారీ మొత్తంలో ఖర్చుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు ఇప్పుడు చాలా అత్యంత కాస్ట్లీ అని రాజకీయాలలో చర్చ సాగుతోంది. ఇటు టీఆరెస్ అటు ఈటెల రాజేందర్ వర్గం, పోటాపోటీ సమావేశాలు, నిర్వహిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆరెస్, ఇద్దరు మంత్రులు టీఆరెస్ పార్టీ రంగంలోకి దింపింది. మరోపక్క దుబ్బాక విజమామే స్ఫూర్తిగా తీసుకొని హుజూరాబాద్ ఉప ఎన్నికలు రెడీ అవుతోంది. బీజీపీ పార్టీ బలం పెంచుకునేందుకు ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రంగంలో కి దిగింది. ఇపుడు బీజేపీ పార్టీకి ప్రధాన బలం ఈటెల ఆపార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని ముందుకు వెళ్తున్నారు...

    ఇక హుజురాబాద్ లో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుందనే వార్తలు బలంగా వినబడుతున్నాయి. పలు మండలాల్లో ఇప్పటికే ముఖ్య నేతలకు డబ్బు అందాయని జోరుగా చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికల షెడ్యూలు రాకముందే, ఇప్పటినుండే పార్టీ కార్యకర్తలకు, ముఖ్యనాయకులకు రోజువారీ ఖర్చులు ఇతర వాటితో కలిపి ఎన్నికలు వచ్చేవరకు పార్టీలకు తడిసి మోపడవుతుందని, అందుకే ఈ ఎన్నికలు చాలా ఖర్చుతో కుడుకున్నవని చర్చ జోరందుకుంది.. ఒక్కో గ్రామానికి కోటినుండి.. రెండు కోట్లు ఇప్పటికే అన్ని పార్టీల నుండి చేరాయని అందుకే ఈ ఎన్నికలు చాలా ఖర్చు అని అంటున్నారు.

    సమావేశాలకు, రోడ్ షోలకు, ఆహ్వానాలకు, మంగళ హారథులకు, బైకు ర్యాలీలల్లో పాల్గొనాలంటే ఒక్కో రేటు ఫిక్స్ చేసి ఇస్తున్నారట. ఎన్నికలు రాకముందే ఇలా ఖర్చు పెడితే ఎన్నికల సమయానికి పరిస్థితులు ఎలా ఉంటుంది. ఎన్నికలు రాకముందే హుజూరాబాద్ నియోజకవర్గం ఖరీదైన నియోజకవర్గంగా మారిపోతుంది. వందల కోట్లు ఖర్చు పెడితే తప్ప, విజయాన్ని అందుకోలేని పరిస్థితి వచ్చి పడింది. కోట్లు ఖర్చు పెట్టినా గెలుస్తామన్న ధీమా అభ్యర్థులల్లో కూడా కనిపించడం లేదట.
    Published by:Veera Babu
    First published: