(P.Srinivas,New18,Karimnagar)
అర్ధరాత్రి సరిగ్గా టైమ్ 12 గంటలు అవుతోంది. సాధారణంగా అందరు నిద్రపోయే టైమ్. ఆ సమయంలో పోలీసు(Police)లకు ఫోన్ కాల్ వచ్చిందంటే ఏదో ఎమర్జెన్సీ అయి ఉండవచ్చు. లేదంటే పెద్ద క్రైమ్ ఏదైనా జ జరిగి ఉంటుందని అందరూ అనుకుంటారు. కరీంనగర్(Karimnagar)సిపి సత్యనారాయణ(Satyanarayana)కి మిడ్‌నైట్ ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి కరీంనగర్ సిపితో సార్ మా ఇంటిలో ఉన్న బావిలో పిల్లి(cat)పడిపోయింది. దానిని కాపాడటానికి సహాయం చేయండి అని కోరాడు. సహజంగా అంత రాత్రివేళ ..అది కూడా పోలీస్ ఉన్నతాధికారికి కాల్ చేసి ఇంత చిన్న సమస్య చెబితే అవతలి వ్యక్తి నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
బావిలో పడ్డ పిల్లిని కాపాడమని ఫోన్‌కాల్..
ఈ తరహా ఫోన్ కాల్ పోలీస్ స్టేషన్‌కి చేస్తేనే పోలీసుల చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేస్తారు. అలాంటిది డ్యూటీ టైమ్‌లో ఎన్నో కేసులు, ఎంతో ఒత్తిడిని తట్టుకొని ఇంటికి చేరుకున్న సీపీ నిద్రపోతున్న సమయంలో ఇలాంటి కాల్ వస్తే ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. కాని పిల్లే కదా మనకెందుకులే అని వదిలేయకుండా ...ఫోన్ చేసిన వాళ్లకు అసహనం వ్యక్తం చేయకుండా సానుకూలంగా స్పందించారు సీపీ సత్యనారాయణ. వెంటనే తన దృష్టికి వచ్చిన కంప్లైంట్‌ని టౌన్ ఏసీపీకి తుల శ్రీనివాసరావుకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన కాలర్‌తో మాట్లాడి ఆ పిల్లిని రక్షించమని ఆదేశించారు.
సీపీ ఆదేశాలతో పిల్లి సేఫ్..
సీపీ ఆదేశించడంతో పాటు బాధితుడి కాంటాక్ట్ నెంబర్‌ను కరీంనగర్ టౌన్ ఏసిపికి షేర్ చేశారు. దాని ప్రకారం లొకేషన్‌ని వాట్సాప్‌లో గుర్తించారు. బావిలో పడ్డ పిల్లిని రెస్క్యూ చేయమని ఆదేశించడంతో వెంటనే హెడ్ కానిస్టేబుల్ అంజిరెడ్డితో పాటు సిబ్బంది, రెస్క్యూ టీమ్‌తో ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి చేరిపోయారు. అక్కడికి చేరుకున్న పోలీస్ రెస్క్యూ టీమ్ పోలీస్ సిబ్బంది సాయంతో బావిలోకి ఒక బుట్టను తాడుకు పంపించారు. ఆ బుట్టలో పిల్లి కూర్చునే విధంగా ప్రయత్నించారు. పిల్లి బుట్టలో కూర్చున్న తర్వాత దాన్ని సురక్షితంగా పైకి లాగి రక్షించడం జరిగింది.
ఏ టైమ్‌లో కాల్ చేసిన వస్తాం..
పోలీసులు ఓ జంతువు ప్రాణం కాపడానికి తీసుకున్న శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే పిల్లిని రెస్క్యూ చేయడానికి అర్ధరాత్రి 12:30కు ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీస్ బృందం 15నిమిషాల్లో పిల్లిని సురక్షితంగా బావిలోంతి బయటకు తీసి యజమానికి అప్పగించారు. పోలీసులు ఎంతో సహనంతో, శ్రమతో పిల్లిని కాపాడినందుకు యజమాని ఆనందంతో పోలీసులకు కృతజ్ఞత చెప్పారు. అయితే ఈ సంఘటన ఆధారంగా సీపీ ఆపదలో ఉన్న ఎవరైనా పోలీసుల సహాయం కోసం ఎప్పుడు డయల్ 100కి కాల్ చేసినా ఇదే విధంగా స్పందిస్తామని ఆపదలో ఉన్నవాళ్లను కాపాడతామని భరోసా ఇచ్చారు. ప్రజల సంరక్షణ కోసమే పోలీసులు ఉన్నారంటూ స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Police complaint