ఆయన చదివింది ఇంజనీరింగ్ చేసింది , ఎంతో మంది భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన లెక్చరర్ ఉద్యోగం అయితే చేస్తున్న వృత్తి సంతృప్తి నివ్వకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించి , కోట్లకు పడగెత్తాలనే దురాశ లెక్చరర్ మనసులో మొలకెత్తింది ,దీంతో వంచనకు పాల్పడ్డాడు. అదికూడ ప్రభుత్వ బ్యాంకులను బురిడి కొట్టించే ప్లాన్‌కు స్కెచ్ వేశాడు.. నకిలీ కిసాన్ వికాస పత్రాలు సృష్టించి అనేక బ్యాంకులను బురిడీ కొట్టించి సుమారు కోటి రూపాయలకు పైగా రుణాలు పొంది బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టాడు. ఇలా కరీంనగర్ , వరంగల్ నిజమాబాద్ , గుంటూరు జిల్లాలో కేసులు నమోదై జైలుకు వెళ్ళాడు. కాగా నిందితుడిపై వివిధ కేసుల్లో సుమారు 40 కి పైగా నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయ్యాయి. దీంతో వాటి నుండి కూడ కాగా తప్పించుకొనుటకు 15 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు.
వివరాల్లోకి వెళితే... నిజమాటాద్ జిల్లా కామారెడ్డి ఎన్.జీ.వో కాలనీ కి చెందిన శ్రీనివాసరావు శశాంక రావు తండ్రి టెలికాం డిపార్ట్మెంట్లో ఉన్న ఉన్నత ఉద్యోగిగా విధులు నిర్వహించేవాడు తల్లిదండ్రులు అందించిన తోడ్పాటుతో కుందన శ్రీనివాసరావు వరంగల్ లోని కిట్స్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యాడు . తదనంతరం కరీంనగర్ లోని ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా చేరి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే వాడు . 2006 సంవత్సరం వరకు ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశాడు . ఈ క్రమంలో అతడికి మరి కొంత మంది తోడవగా నకిలీ కిసాన్ వికాస పత్రాలు సృష్టించి బ్యాంకులలో మేనేజ్ చేసి , వాటి ద్వారా బ్యాంకు లోను తీసుకొని బ్యాంకులకు బురిడీ కొట్టడం మొదలు పెట్టారు. ఇలా కరీంనగర్ , నిజామాబాద్, వరంగల్, తోపాటు గుంటూరు జిల్లాల్లో పలు బ్యాంకులను మోసగించి సుమారు కోటికి పైగా రూపాయలను రుణాలుగా పొందారు . దీంతో పలు స్టేషన్లలో 40 కేసులు నమోదయ్యాయి.
కాగా బ్యాంకుల మోసం కేసుల్లో శ్రీనివాసరావును 2007 వ సంవత్సరంలో కరీంనగర్ టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి అతని రిమాండ్ కు తరలించగా సుమారు ఒక సంవత్సరం పాటు జైలు జీవితం గడిపాడు..ఆ తర్వాత జైలు నుండి విడుదలై వివిధ పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసులకు బయపడి అజ్ఞాత జీవితంలోకి వెళ్లాడు.. దీంతో తన పేరును కూర శశాంక రావు తండ్రి పేరు గౌతమరావు అనే అవతారం ఎత్తి హైదరాబాదుకు మకాం మార్చాడు నకిలీ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డులను సృష్టించి తరచుగా చిరునామాలు మారుస్తూ హైదరాబాదులోని పలు ప్రైవేటు కాలేజీ లో మూడు సంవత్సరాల పాటు అధ్యాపకుడిగా పని చేశాడు .
అక్కడ నుండి వరంగల్ కు మకాం మార్చి కొంతకాలం అధ్యాపకుడిగా పని చేశాడు . తర్వాత కుటుంబంలో తలెత్తిన వివాదంతో అతని భార్య అతని నుండి వెళ్ళిపోగా తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులను కూడా అమ్ముకొని శ్రీనివాస రావు తన మకాంను మరోసారి విజయవాడకు మార్చాడు . విజయవాడలో కొంతకాలం పోలల్లో పని చేసి అక్కడి నుండి తిరుపతికి వెళ్లాడు.అయితే తిరుపతిలో జరిగిన ప్రమాదంలో శ్రీనివాస రావు కాలు పోగొట్టుకున్నాడు. దీంతో మానసికంగా , ఆర్థికంగా , సామాజికంగా చితికిపోయిన శ్రీనివాస్ కి , గత్యంతరం లేక బిక్షాటన చేసుకోవడమే అతనికి జీవన ఆధారమైంది . పూట గడవడానికి అలిపిరి మెట్లమీద భిక్షాటన చేసుకుంటూ రోజులు గడిపాడు . అనంతరం తమ్ముడి సహాకారంతో బెంగుళూరు వాచ్మెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు.
మరోవైపు శ్రీనివాస రావు కనిపించకపోవడంతో బెంగుళురులో సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ , 2018 లో వరంగల్ లో శ్రీనివాస అదృశ్యమైనట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు . అంతేకాకుండా నిజామాబాదు లో కూడా శ్రీనివాస్ మిస్సింగ్ కేసు నమోదైంది.
అయితే గత కొద్ది రోజులుగా పెండింగ్ కేసులపై విచారణ కోసం కరీంనగర్ సీపీ కమాలాసన్ రెడ్డి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుతో పాత నేరస్థులందరని తిరిగి రిమాండ్‌కు పంపుతున్నారు.ఇలా ఇప్పటికే చాల మందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. దీంతో 40 కేసులున్న శ్రీనివాసరావు పై కమలాహసన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. దీంతో కరీంనగర్ టౌన్ ఏ.సి.పి అశోక్ ఇతర సిబ్బందితో శ్రినివాస రావును తిరిగి పట్టుకోగలిగారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Karimangar