కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతి నేపధ్యంలో వైరస్ బారినపడి చికిత్స పొందుతున్న వారికి ఎక్కువగా అవసరమయ్యే రెమిడిసివర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తూ రోగుల అవసరాన్ని ఆసరా చేసుకుని ధనార్జనే ధేయంగా ఈ అక్రమ దందా కొనసాగిస్తున్న 04 సభ్యులుగల మూఠాను శుక్రవారంనాడు కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు .
కరీంనగర్లోని కిసాననగర్ ప్రాంతంలో నివసిస్తున్న దాసరి సురేష్ , ముకరంపురా ప్రాంతానికి చెందిన బాలగోని సత్యనారాయణ , కట్టరాంపూర్ ప్రాంతానికి చెందిన కొత్తకొండ వెంకటసాయిలు వరంగల్ లోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న బొమ్మకంటి నరేష్ తో సంబంధాలను ఏర్పరచుకుని కరోనా వైరస్ సోకిన వారి చికిత్సకు అవసరమైన రెమిడిసివర్ సాధరణంగా 5 వేలకు విక్రయించాల్సి ఉండగా..ప్రస్తుత కొవిడ్ సంక్షోభాన్ని ఆసరా చేసుకుని ఇంజక్షన్లను అధికధరలకు సుమారు 20 నుండి 25 వేల రూపాయలవరకు విక్రయిస్తున్నారు .
కాగా రాష్ట్రంలో రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత ఉండడంతో నాలుగు లక్షల ఇంజక్షన్లను ఉత్పత్తి చేయాలంటూ మంత్రి కేటీఆర్ ఆయా కంపనీలను కోరారు.ఈ నేపథ్యంలోనే వీటి అక్రమదందాకు ఫుల్స్టాప్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు , ఈ మూఠా కొనసాగిస్తున్న అక్రమదందా సమాచారం పై వలపన్ని కిసాననగర్ ప్రాంతంలో ఆ 04 గురిని అదుపులోకి తీసుకున్నారు . వీరివద్ద నుండి 18 రెమిడిసివర్ ఇంజక్షన్లు , 40 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
రెమిడెసివర్ ఇంజక్షన్లతో పాటు కొవిడ్ భాధితులకు చుక్కలు చూపిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యం, ఇతర సిబ్బందిపై కూడ పోలీసులు దృష్టి సారించినట్టు కమిషనర్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Remdesivir, Telangana