Home /News /telangana /

KARIMNAGAR POLICE ARRESTED THE ACCUSED OF KIDNAPPING A BABY IN KARIMNAGAR WITHIN FOUR HOURS SNR KNR

Kidnapping case : ఇంటి దగ్గర ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లారు .. నాలుగు గంటల తర్వాత ఏం జరిగిందో తెలుసా

karimnagar kidnap

karimnagar kidnap

Crime news: కరీంనగర్ జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏడాదిన్నర వయసున్న శిశువు కిడ్నాప్‌కి గురికావడం కలకలం రేపింది. ఈకేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుల్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నారు. ఎందుకు ఎత్తుకెళ్లారో తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India
    (P.Srinivas,New18,Karimnagar)
    కరీంనగర్(Karimnagar)జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏడాదిన్నర వయసున్న శిశువు కిడ్నాప్‌(Baby Kidnapping)కి గురికావడం కలకలం రేపింది. ఈకేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుల్ని సీసీ ఫుటేజ్(CCTV footage)ఆధారంగా పట్టుకున్నారు. ఎందుకు ఎత్తుకెళ్లారో తెలిసి పోలీసులు(Police)షాక్ అయ్యారు.

    Himanshu Rao Kalvakuntla : మా తాత టైగరే : హిమాన్షు .. నెటిజన్ల సెటైర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన కేసీఆర్ మనవడు



    జెండా పండుగ రోజే కిడ్నాప్..
    ఆగస్ట్ 15వ తేది సాయంత్రం 7 గంటల సమయంలో కరీంనగర్‌లోని అశోక్ నగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసున్న చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. శిశువు తండ్రి దుల్హే బాషాతో పాటు కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండగానే చిన్నారిని ఎత్తుకెళ్లారు. బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెదికారు. ఆచూకి కోసం పలువుర్ని విచారించారు. శిశువును ఓ వ్యక్తి ఆటోలో తన ముందు కూర్చోబెట్టుకొని వెళ్లడం చూశామని చెప్పడంతో చుట్టుపక్కల గాలించారు. జాడ దొరక్కపోవడంతో రాత్రి 9:30 గంటలకు కరీంనగర్-1 టౌన్ పోలీసులకు ఓ ఆటో డ్రైవర్ తమ బిడ్డను కిడ్నాప్ చేసినట్లుగా కంప్లైంట్ ఇచ్చారు.



    4గంటల్లో నిందితులు అరెస్ట్ ..
    కేసు నమోదు చేసుకున్న పోలీసులు కరీంనగర్ సిపి వి సత్యనారాయణ ఆదేశాలతో వన్‌ టౌన్, టూ టౌన్‌, త్రీ టౌన్‌ పోలీసులు, ఎస్‌ఐలతో పాటు క్రైమ్ టీమ్‌ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటై శిశువు ఆచూకీ కోసం వెదికారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలు నేరం జరిగిన ప్రదేశం నుండి నాఖా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా ,సుభాష్ నగర్, కరీంనగర్ బస్టాండ్, రాజీవ్ చౌక్ తదితర ప్రాంతాలలో ఆటో అడ్డాలను తనిఖీ చేశారు. పలువుర్ని విచారించారు. పసివాడు కిడ్నాప్‌కి గురైన ప్రాంతం నిందితుడు ప్రయాణించిన ఆటో మంచిర్యాల్ చౌరస్తా సమీపంలోని ఒక ఆసుపత్రి వద్ద ఆగినట్టుగా అక్కడి నుండి వెళ్లినట్టుగా గమనించారు.

    డబ్బుల కోసం శిశువు అపహరణ..
    అదే దారిలో ఉన్న కూడళ్లలోని కొన్ని వందల సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ సీసీ కెమెరాలలో నిందితుడి ఆటో ముందు జాతీయ జెండాతో ఉన్న విషయం, నిందితుడు లేత గులాబీ రంగు షర్ట్ వేసుకోవడాన్ని పసిగట్టారు. ఆటోకు ఉన్న స్టిక్కర్ గుర్తించిన పోలీసులు ఆటో సుభాష్ నగర్ ప్రాంతం నుండి వచ్చినట్టుగా తేల్చారు. ఆ చిన్న క్లూతో పోలీసులు కరీంనగర్ టౌన్‌లోని ప్రతి గల్లీ జల్లెడ పట్టారు. సరిగ్గా అర్ధరాత్రి రెండు గంటలకు సుభాష్ నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక ఇంటి ముందు ఆటోను గుర్తించారు. ఆటో యజమాని సంతోష్‌ని కిడ్నాప్ కేసుపై విచారించారు.

    Asaduddin Owaisi : సామూహిక జాతీయ గీతాలాపనలో ఎంపీ తీరుపై విమర్శలు .. ఇదేనా మీ దేశభక్తి అంటూ అసదుద్దీన్‌పై సెటైర్లు


    కిడ్నాప్ కేసు సుఖాంతం..
    ముందు తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితుడు తర్వాత నిజాన్ని అంగీకరించాడు. కిడ్నాప్ చేసిన శిశువును అమ్ముకునేందుకు తన మిత్రుడు రాములు దగ్గర దాచిపెట్టినట్లుగా తెలిపాడు. సంతోష్ ఇచ్చిన సమాచారం మేరకు ఖాజీపూర్‌కు చెందిన కొలమద్ది రాములు వ్యక్తి ఇంటికి వెళ్లి పసివాడ్ని రక్షించారు. సంతోష్‌తో పాటు రాములును అదుపు లోకి తీసుకొని శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. ఈకిడ్నాప్ కేసును కరీంనగర్ పోలీసులు సినిమా స్టైల్లో కేవలం నాలుగు గంటల్లో చేధించి శిశును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంపై స్థానికులు పోలీసుల్ని అభినందించారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Karimnagar, Kidnap, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు