KARIMNAGAR PETROL ATTACK ON OFFICERS WHO WENT TO INSPECT ROAD ENCROACHMENT IN JAGITTALA DISTRICT SNR KNR
Telangana: ఆక్రమణలు తొలగించడానికి అధికారి వెళితే..అంత పని చేశాడేంటి..
(అధికారిపై పెట్రోల్ దాడి)
Petrol Attack:తమ భూములు, ఇళ్లు కబ్జా చేస్తున్నారని ప్రభుత్వ ఆఫీసుల ముందు బాధితులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం చూశాం. కాని జగిత్యాల జిల్లాలో సీన్ రివర్సైంది. రోడ్డు కబ్జా చేశారన్న ఫిర్యాదుపై విచారణకు వెళ్లిన అధికారులపైనే ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
(P.Srinivas,New18,Karimnagar)
జగిత్యాల Jagityalaజిల్లాలో ఓ ప్రభుత్వ అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బీర్పూర్(Birpur)మండలం తుంగూరు(Tungur)లో మంగళవారం(Tuesday)ఈ ఘటన చోటుచేసుకుంది. తుంగూరు గ్రామంలో రహదారిని ఆక్రమించుకోవడంతో(Road Encroachment)10 నుండి 15 కుటుంబాలకు చెందిన వాళ్లు ఇబ్బందులు పడుతున్నామని ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఆ ఘటనపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం తహసీల్దార్ మహమ్మద్ ఫరిదుద్దీన్(Mohammad Fariduddin) , ఎస్సె గౌతమ్(Gautam) , ఎంపీఓ రామకృష్ణరాజు(Ramakrishnaraju)తుంగూరుకు వెళ్లి విచారించారు. విచారణలో భాగంగా చుక్క గంగాధర్(Chukka Gangadhar)అనే వ్యక్తి రోడ్డును ఆక్రమించుకుని కట్టెలు అడ్డుగా పెట్టాడని అధికారులు నిర్ధారించారు. వాటిని తొలగిస్తుండగా గంగాధర్ అధికారులపై పెట్రోల్ (Petrol)పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. ఎంపీఓ రాజు , ఎస్సె గౌతంలు అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఎంపీఓకు మంటలు అంటుకున్నాయి. చొక్కా విప్పేయడంతో అతనికి పెద్ద ప్రమాదం తప్పింది. మండల పంచాయితీ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్ఐ ప్రాణపాయం నుండి బయటపడ్డారు.
ప్రభుత్వ అధికారిపైనే పెట్రోల్ దాడి..
నిందితుడు గంగాధర్ పెట్రోల్ దాడిలో గాయపడిన రాజును జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జగిత్యాల ఆసుపత్రికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ , అడిషనల్ కలెక్టర్ లతలను చేరుకుని ఎంపీఓను పరామర్శించారు. అధికారులపై పెట్రోల్ దాడికి యత్నించిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిలా కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు . నిందితుడు రాజుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లుగా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత తెలిపారు.
(అధికారిపై పెట్రోల్ దాడి)
ఆక్రమణలు తొలగించడానికి వస్తే..
రాష్ట్రంలో ఈ తరహా ఘటన ఈమధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అధికారులే డబ్బులు తీసుకొని ఒకరి భూములు, పొలాలను వేరే వ్యక్తుల పేరుతో మార్చుతున్నరనే విమర్శలు వచ్చాయి. కాని జగిత్యాల జిల్లాలో రోడ్డును అక్రమించిన విషయంపై విచారణకు వెళ్లిన అధికారులపై పెట్రోల్‌తో దాడి చేయడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా చోట్ల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి ఏర్పాటు చేసి అందులో ఫిర్యాదు స్వీకరిస్తున్నారు అధికారులు. అలాంటి చోట కూడా న్యాయం జరగడం లేదని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. రెండ్రోజుల క్రితం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు కూడా తమకు న్యాయం జరగడం లేదనే మనస్తాపంతో ఓ మహిళ, రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. అలాంటి కేసుల్ని ఆధారంగా చేసుకొని సమస్యలు పరిష్కరిద్దామని వచ్చిన అధికారులకు ఆక్రమణదారులు ఈతరహాలో పెట్రోల్ దాడులకు తెగబడటంతో అధికారులకు సమస్యలను పరిశీలించడానికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.