హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG : క్షుద్రపూజలు, చేతబడులు .. అక్కడే ఎందుకిలా జరుగుతోంది .. కారణమదేనంటున్న జిల్లా ప్రజలు

OMG : క్షుద్రపూజలు, చేతబడులు .. అక్కడే ఎందుకిలా జరుగుతోంది .. కారణమదేనంటున్న జిల్లా ప్రజలు

karimnagar occult worship

karimnagar occult worship

OMG: కరీంనగర్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని హుజురాబాద్ పట్టణ శివారులో రాత్రి క్షుద్రపూజలు జరిపించారు గుర్తు తెలియని వ్యక్తులు.  ఉదయం దర్శనమిచ్చిన విచిత్ర పూజల ఆనవాళ్లు స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేశాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  ప్రపంచం  మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న సమయంలో కొంతమంది మాత్రం మూఢనమ్మకాల ముసుగులోనే మగ్గుతున్నారు . మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్మేవారు చాలా మందే ఉన్నారు . ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్(Karimnagar)జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా మూఢనమ్మకాల పేరుతో ఎన్నో దారుణాలకు కూడా పాల్పడున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. క్షుద్ర పూజల పేరుతో ఏకంగా నరబలి ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతున్నారు. గుప్తనిధులు, కీడు సోకిందంటూ తాంత్రిక పూజల(Tantric worship)తో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

  Bathukamma sarees: బతుకమ్మ చీరలు పంపిణి ప్రారంభం .. ముందుగా ఎవరికి ఇస్తున్నారంటే ..

  క్షుద్రపూజల కలకలం..

  కరీంనగర్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని హుజురాబాద్ పట్టణ శివారులో రాత్రి క్షుద్రపూజలు జరిపించారు గుర్తు తెలియని వ్యక్తులు.  ఉదయం దర్శనమిచ్చిన విచిత్ర పూజల ఆనవాళ్లు స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేశాయి. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పసుపు , కుంకుమ నైవేద్యాలతో విచిత్రమైన పూజలు చేశారు. మర్నాడు ఉదయం ఇదంతా చూసిన ప్రజలు హడలెత్తిపోయారు. అసలేం జరుగుతందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పూజలు ఎవరు చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారో ? అర్ధం కాక అయోమయంలో ఉన్నారు.

  స్థానికుల్లో భయం భయం..

  హుజురాబాద్ పట్టణం రంగనాయకుల గుట్ట వద్ద క్షుద్ర పూజలు జరిపించారంటే .. గుప్తనిధుల కోసమేనంటూ కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గం కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామ శివారులో పురాత శిథిలావస్థలో ఉన్న మల్లన్న ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. గ్రామ శివారులోని మల్లన్న ఆలయం 200 ఏళ్ల క్రితందిగా గ్రామస్తులు చెప్పుకుంటారు. గుడిలో శివలింగంతో పాటు నంది విగ్రహం ఉంది. గ్రామానికి చెందిన భక్తులు ప్రతి ఆదివారం గుడి పరిసరాలను శుభ్రం చేసి దేవునికి దీపం పెట్టి పూజిస్తారు.

  Terror Zone : ఉగ్రమూకల జాడ కోసమే ఎన్‌ఐఏ సోదాలు .. సెకండ్‌ టెర్రర్ జోన్‌పైనే గట్టి నిఘా

  గుప్త నిధుల కోసమేనని డౌట్..

  తాజాగా సోమవారం ఓ భక్తుడు దేవుడికి దీపం పెట్టేందుకు వెళ్లగా శివలింగం కింద తవ్వకాలు చేపట్టి లింగం కింద ఉన్న కొన్ని బండరాలను తొలగించారు. శివలింగం తొలగించేందుకు దొంగలు ప్రయత్నించగా శివలింగం కదలక పోవడంతో వదిలేసి వెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆలయం ఊరికి దూరంగా ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేపట్టినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై భక్తులు సర్పంచ్ లంక రాజేశ్వరి సదయ్యకు తెలపడంతో సంఘటన స్థలానికి వెళ్లి శివాలయాన్ని పరిశీలించారు. తవ్వకాలు చేపట్టిన విషయంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి క్షుద్రపూజలు, తవ్వకాలను అరికట్టాలంటే శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని మరమ్మతులు చేపట్టే విధంగా దాతలు ముందుకు అభివృద్ధి చేస్తే బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimangar, Telangana News

  ఉత్తమ కథలు