KARIMNAGAR PEOPLE ARE CONCERNED OVER THE HIGH NUMBER OF CORONA OMICRON CASES BEING REPORTED ACROSS THE JOINT KARIMNAGAR DISTRICT KNR VB
Omicron Cases: అటు చలి.. ఇటు ఒమిక్రాన్.. వణికిపోతున్న ఆ ప్రాంత ప్రజలు.. రికార్డు స్థాయిలో కేసులు..
ప్రతీకాత్మక చిత్రం
Omicron Cases: అక్కడి ఉమ్మడి జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఒ పక్క ఒమిక్రాన్.. మరోపక్క చలి భయం గుప్పెట్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు . కనిష్ట ఉష్ణో గ్రత 6డిగ్రీలకు పడిపోతున్నాయి . జిల్లాలో తో పాటు పల్లెల్లో చలి తీవ్రత పెరిగింది. ప్రజలు 11 దాటితే గానీ ఇళ్లనుంచి బయ టకు రాని పరిస్థితి నెలకొంది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఒ పక్క ఒమిక్రాన్.. మరోపక్క చలి భయం గుప్పెట్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు . కనిష్ట ఉష్ణో గ్రత 6డిగ్రీలకు పడిపోతున్నాయి . జిల్లాలో తో పాటు పల్లెల్లో చలి తీవ్రత పెరిగింది. ప్రజలు 11 దాటితే గానీ ఇళ్లనుంచి బయ టకు రాని పరిస్థితి నెలకొంది. మరో పక్క ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమి క్రాన్ వేరియంట్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరడం ఆందోళన కలిగిస్తున్న అంశం . ముస్తాబాద్ మండలం గూడెంకు చెంది న వ్యక్తి ఇటీవల దుబాయి నుంచి ఇంటికి చేరాడు .
ఆయనకు ఒమిక్రాన్ పాజిటీవ్ గా నిర్ధారణ కావడంతో హైదరాబాదు తరలించారు . ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురిని , అతన్ని కలిసిన ఏడుగురిని క్వారంటైన్ చేశారు . ఇప్పల్లపల్లెకు చెంది న మరో వ్యక్తిపై కూడా అనుమానాలు రావడంతో నమూనాలను సేకరించి పరీ క్షలకు పంపించారు.ఇది ఇలా ఉంటే చలి తో కూడా ప్రజలు బేంబేలెత్తి పోతున్నారు.జిల్లాలో 6 డిగ్రీల సెల్సియెస్ నమోదైంది . ఉమ్మడి ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాల తరువాత అత్యంత ఉష్ణోగ్రతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నమోదయ్యాయి..మరో రెండు మూడు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది .
ఇది ఇలా ఉంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇంటికొక్కరు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినవారు ఉన్నారు . వీరిలో చాలామంది తరచూ తమ గ్రామాలకు వచ్చిపోతుంటారు .. నిన్న దుబాయ్ నుండి జగిత్యాలకు వచ్చిన వ్యక్తి కూడా ఓమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు హైదరాబాద్ ఎయిర్ పోర్టులలో ఒమిక్రాన్ పరీక్షలు చేశారు . అప్పుడు పాజిటివ్ రిపోర్టు రాగా ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణకు జీనోమ్ సీక్వెన్సీ పరీక్ష కోసం నమూనా సేకరించి పరీక్షకు పంపగా వేరియంట్ నిర్ధారణ అయ్యింది .
ఈ కేసు బయటపడడంతో ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా జగిత్యాల లో వణుకు మొదలైంది . జగిత్యాల , రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు పెద్దపల్లి , కరీంనగర్ జిల్లాలకు గల్ఫ్ దేశాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు . గల్ఫ్‌లోనే కాకుండా అమెరికా , కెనడా , సింగపూర్ తో పాటు మన దేశంలోని ముంబాయి ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తుంటారు .. అసలే చలితీవ్రత పెరుగుతుండటంతో దగ్గు జ్వరం లాంటి లక్షణాలు ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి .
జలుబు , దగ్గు జ్వరం విపరీతమైన అలసటతో పాటు వాంతులు , గుండె వేగంగా కొట్టు కోవడం , ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే ఒమిక్రాన్ పరీక్షలు చేయించు కోవాలని నిర్లక్ష్యంగా ఉంటే ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుందని వైద్య అధికారులు హెచ్చరిస్తున్నారు . చలితీవ్రత పెరుగు తుండడంతో జలుబు , జ్వరం కేసులు కూడా పెరుగుతున్నాయి .
ఈ క్రమంలో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటకలిగిస్తున్న అంశం కాగా ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఆం దోళన కలిగిస్తున్న అంశం. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా కేసు ఇండోనేషియా మతగురువుల ద్వారా వచ్చిన విషయం అందరికీ తెలిసినదే..ఇప్పుడు కూడారెండవ ఓమిక్రాన్ కేసు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రావడం తో ప్రజలు మరోసారి భయందోళనకు గురవ తున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.