KARIMNAGAR PARTIES PREPARING FOR BY ELECTION BATTLE ELECTION SCHEDULE RELEASED ON THAT DAY KNR VB
Telangana: ఉపఎన్నిక సమరానికి సిద్ధమవుతున్న పార్టీలు.. ఆ రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదల..
సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్)
Huzurabad By Elections: హుజూరాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి . ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు . ఉప ఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు . సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఆదరగొడుతోంది.
హుజూరాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి . ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు . ఉప ఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు . సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఆదరగొడుతోంది. మండలాలు , మున్సిపాలిటీల వారీగా పలువురిని నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలు పెట్టేసింది . ఇక ఇది ఇలా ఉండగా ... ఎలాగైనా హుజురాబాద్ నియోజక వర్గంలో గులాబీ జెండా ఎగుర వేసేందుకు సీఎం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు .ఇందులో భాగంగా ఇప్పటికే దళిత బందు పథకం, అలాగే గొర్రెల పంపిణీ, ఇంకా రైతు రుణమాఫీ వంటివి ఇప్పటికే అమలు చేసి క్షేత్ర స్థాయిలో దూసుకెళ్తున్నారు. ఇక బీజీపీ పార్టీ నుండి ఈటెల ఇప్పటికే తన గ్రౌండ్ లెవల్ వర్క్ ను పూర్తి చేసుకొని పాదయాత్ర కూడా మొదలు పెట్టారు.
11రోజులు తరువాత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరి మోకాలి శస్త్ర చికిత్స చేసికొని నిన్న హుటాహుటిన మళ్ళీ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలతో చిట్ చాట్ చేసి డాక్టర్ల సూచన మేరకు 2 లేదా 3 రోజులో తిరిగి పాదయాత్ర చేస్తానని మాట్లాడారు. ఇక కేసీఆర్ ఈమధ్య ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఈటెల పుణ్యమేనని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈటెల కు భయపడి కేసీఆర్ ఇవ్వని ఇస్తున్నాడని ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇక కాంగ్రెస్ ఇప్పటికే హుజురాబాద్ లో పాగ వేయాలని రేవంత్ రెడ్డి మూడు రోజుల కిందట పార్టీ మీటింగ్ పెట్టి దామోదర రాజనర్సింహ మరియు పొన్నం కు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా ఎంపిక చేయాలని సూచించారు.
రేపో మాపో కాంగ్రెస్ అభ్యర్ధి గా కొత్త వ్యక్తి ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. టీఆరెస్ అభ్యర్థి గా గేళ్ళు శ్రీనివాస్ యదవ్ ను ఈనెల16 కేసీఆర్ ప్రకటించనున్నారు. ఇలా ఎవరికి వారే ఇప్పటికే ప్రచారం మమ్మురం చేశారు. ఇక రేపో మాపో ఎన్నిక ల షెడ్యూలు రానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు హుజురాబాద్ లొనే మాకం వేసి వారి వారి పార్టీ తరుపున ప్రచారం చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.