(P.Srinivas,New18,Karimnagar)
విమానం, హెలికాప్టర్‌లో కాకుండా ఆకాశంలో విహరిస్తూ భూమిపైన ఉన్న అద్భుతాలు, అందమైన నిర్మాణాలను, ప్రవహించే నదులు, ఎత్తైన కట్టడాలను చూడటం కేవలం పారాచూట్(Parachute)వల్లే సాధ్యమవుతుంది. అయితే తెలంగాణ(Telangana)లో అలాంటి అద్భుతమైన నిర్మాణాలు, కట్టడాలు ఎన్నో ఉన్నప్పటికి వాటిని ఆలా ఆకాశంలో విహరిస్తూ చూడటమనేది సాధ్యుపడే విషయం కాదు. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు కాని..అతి త్వరలోనే తప్పకుండా చూడవచ్చు. అది కూడా హైదరాబాద్(Hyderabad)లాంటి మహానగరంలో కాదు..కరీంనగర్(Karimnagar)లో చూసే అవకాశం రాబోతుంది. ఇందుకు సంబంధించిన ట్రయిల్ రన్స్ కూడా నిర్వహిస్తున్నారు.
ఆకాశంలో విహరించవచ్చు..
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు నది తీరంలో ప్యారాచూట్ విన్యాసాలు అందుబాటులోకి రానున్నాయి. మానేరు జలాశయం మీదుగా ఆకాశంలో విహరించే అవకాశం అతి త్వరలోనే కల్పించబోతున్నట్లుగా పైలెట్ అధికారులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా మానేరు జలాశయం మీదుగా ఆకాశంలో ఎగురేందుకు సాధ్యాసాధ్యాలని పరిశీలించారు పైలెట్ అధికారి సుకుమార్. పారాచూట్ విన్యాసాలకి మానేరు ప్రాంతం అనువుగా ఉందా లేదా అని విషయాన్ని ఆయన స్వయంగా పారాచూట్‌తో గాల్లో విహరించి ప్రత్యక్ష అనుభూతిని పొందారు. గాలి, ఇతర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పైలట్ సుకుమార్.
ఆనందంలో తేలిపోవచ్చు..
జిల్లా కేంద్రంలో మానెరు అందాలతో పాటుగా తీగెల వంతెన,కరీంనగర్ పట్టణాన్ని ఆకాశం నుండి విక్షించే విధంగా ఎయిర్ షోలో పాల్గొనే అవకాశం కరీంనగర్ జిల్లా ప్రజలకు త్వరలోనే రాబోతుంది. పారాచూట్ పూర్తిగా అందుబాటులోకి రాగానే మానేరు జలాశయంతో పాటు కరీంనగర్‌లోని సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జి, ఐటీ టవర్ ఉజ్వల పార్క్ డియర్ పార్క్, లోయర్ మానేర్. అప్పర్ మానేరు అందాలను వీక్షించేందుకు అనువుగా ఉంటుందంటున్నారు అధికారులు. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరికొద్ది రోజుల్లో వివరిస్తామని పైలెట్ అధికారి సుకుమార్ తెలిపారు. పెద్దపెద్ద నగరాలకు పరిమితమైన ప్యారట్ విన్యాసాలు అతి త్వరలో కరీంనగర్ ప్రజలు చూడబోతున్నారు. ఈ విన్యాసాలను వీక్షించేందుకు కరీంనగర్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నామని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆధునిక ప్రపంచం వైపు..
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సిద్దిపేట,కరీంనగర్, వరంగల్ పట్టణాలు కాస్తా నగరాలుగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ పర్యాటకులు సందర్శించేందుకు పూరాతన కట్టడాలతో ఆధునిక హంగులతో కూడిన ఎన్నో అద్భుతాలు, చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని దేశ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు చూపించే అవకాశం కలగాలంటే ఇలాంటి పారాచూట్‌లు వంటి సేవలు అందుబాటులోకి రావాలని కరీంనగర్ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best tourist places, Karimnagar