హోమ్ /వార్తలు /తెలంగాణ /

Textile Park closed: మేడే రోజున కేటీఆర్ ఇలాకాలో మూతపడ్డ టెక్స్​టైల్​ పార్క్.. దిక్కుతోచని స్థితిలో కార్మికులు..

Textile Park closed: మేడే రోజున కేటీఆర్ ఇలాకాలో మూతపడ్డ టెక్స్​టైల్​ పార్క్.. దిక్కుతోచని స్థితిలో కార్మికులు..

సిరిసిల్ల టెక్స్​టైల్స్​ ప్రాంగణం

సిరిసిల్ల టెక్స్​టైల్స్​ ప్రాంగణం

సిరిసిల్ల టెక్స్​టైల్స్​ పార్క్ లోని పరిశ్రమలను మే 1 నుంచి పూర్తిగా మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి . దీంతో పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వందలాది మంది కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

  (శ్రీనివాస్. పి, న్యూస్ 18, కరీంనగర్ )

  మంత్రి కేటీఆర్ (Minister KTR)​ ఇలాకాలో టైక్స్​టైల్​ పార్కు మూతపడింది. సిరిసిల్ల టెక్స్​టైల్స్​ పార్క్ (Textiles Park) లోని పరిశ్రమలను (industries) మే 1 నుంచి పూర్తిగా మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి . దీంతో పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వందలాది మంది కార్మికులు (Workers) దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విద్యుత్ చార్జీల భారం (Burden of electricity charges), పెరిగిన ముడిసరుకుల ధరలకు అనుగుణంగా మార్కెటింగ్ లేక , బతుకమ్మ చీరల ఆర్డర్ల రద్దుతో పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయి . దీంతో 112 యూనిట్లు పూర్తిగా మూసివేయగా ఇప్పటికే పాత ఇనుప సామాను కింద 300 మరమగ్గాలను అమ్ముకున్నారు. 2003 లో ప్రారంభమైన టెక్స్​టైల్స్​ పార్క్​ 75 ఎకరాల్లో రూ .7.76 కోట్లతో ఆధునిక మరమగ్గాలతో ఏర్పా టుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల (Siricilla) నేతన్నలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ప్రభుత్వం తొలి టెక్స్టైల్ పార్క్ (Textiles Park) ను ఏర్పాటు చేసింది.

  ఆధునిక మరమగ్గాలతో నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలనేది ఈ పార్క్ ముఖ్య ఉద్దేశ్యం. 165 ప్లాట్లు పరిశ్రమలకు , 27 వాణిజ్య అవసరాలకు కేటాయించారు . ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశ్రమల ద్వారా సుమారు 15 వందల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. రెండు మూడు నెలల్లోనే తొమ్మిది పరిశ్రమల్లో వందలాది మరమగ్గాలను విక్రయించారు.

  పెరిగిన విద్యుత్ చార్జీలు..

  మొదట్లో పరిశ్రమలు లాభాల బాటలోనే నడిచినప్పటికీ పెద్దనోట్ల రద్దు , జీఎస్టీ , కరోనా ప్రభావం వస్త్ర పరిశ్రమలపై తీవ్రంగా పడింది. తాజాగా పెరిగిన విద్యుత్ చార్జీలు పరిశ్రమలపై మరింత ఆర్ధికభారాన్ని మోపాయి. దీనికి తోడు నూలు ధర పెరగడం , మార్కెట్లో వస్త్రం ధర తగ్గడం కూడా ఆర్థిక సంక్షోభానికి కారణమని యాజమాన్యాలు వివరి స్తున్నాయి. ప్రధానంగా విద్యుత్ చార్జీల భారం పరిశ్రమపై పడుతుండటంతో ప్రభుత్వం ఆదుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు .

  ఆర్థిక భారాన్ని మోయడం కష్టం..

  సిరిసిల్లలో టెక్స్​టైల్​ పార్క్ (Textiles Park) లోని పరిశ్రమలకు విద్యుత్ రాయితీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . 2015 నుంచి డిసెంబర్ 2020 వరకు ఉన్న రూ .15 కోట్ల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని వస్త్రోత్పత్తిదారులు కోరుతున్నారు . ప్రస్తుతం ఒక్కో యూనిట్ రూ .2 లక్షల నుంచి రూ .6 లక్షల వరకు విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నాయి . ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలను నడిపిన ట్లయితే నెలకు రూ.లక్షకు పైగా ఒక్కో యూనిట్ పై నష్టం వాటిల్లుతోందని నిర్వహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఆర్థిక భారాన్ని మోయడం కంటే పరిశ్రమలను మూసి వేయడం (Textiles Park closed) మంచిదని తేల్చి చెబుతున్నారు .

  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని..

  ఈ ఏడాది టెక్స్​టైల్​ పార్క్ లోని పరిశ్రమలకు బతుకమ్మ చీరల ఆర్డర్లను రద్దుచేస్తూ చేనేత జౌళిశాఖ నిర్ణయం తీసుకుంది . దీంతో చేనేత పరిశ్రమలకు పనిలేకుండా పోతోంది . తప్పనిసరి పరిస్థితుల్లో మూసివేస్తున్నట్లు (Textiles Park closed) యాజమాన్యాలు ప్రకటించాయి . ఈ సందర్బంగా సీఐటియు నాయకులు మాట్లాడుతూ..  టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలు తరలిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు . కార్మికులు రోడ్డున పడకుండా ఆదుకోవాలని కోరారు . మంత్రి కేటీఆర్ చొరవ చూపి పరిశ్రమల మూసివేత సంక్షోభాన్ని పరిష్కరించి , టెక్స్​టైల్​ పార్క్ పై ఆధారపడి జీవిస్తున్న 1500 కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు .

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Job less workers, KTR, Siricilla

  ఉత్తమ కథలు