KARIMNAGAR ONGOING DALIT BANDHU AWARENESS SEMINAR IN PRAGATHIBHAVAN KNR VB
Telangana News: కొనసాగుతున్న దళిత బంధు అవగాహన సదస్సు.. హుజూరాబాద్ నుంచి హాజరైన పలు కీలక నేతలు..
హుజూరాబాద్ నుంచి బయలుదేరిన పలు కీలక నేతలు, దళితులు
Telangana News: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయనున్న దళిత బంధు పథకంపై ఎంపిక చేసిన వారు నేడు ప్రగతిభవన్ ఏర్పాటు చేసిన అవగామన సద్సులో పాల్గొన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీరితో సమావేశమై చర్చిస్తున్నారు.
(పి. శ్రీనివాస్. కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయనున్న దళిత బంధు పథకంపై ఎంపిక చేసిన వారు నేడు ప్రగతిభవన్ ఏర్పాటు చేసిన అవగామన సద్సులో పాల్గొన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీరితో సమావేశమై చర్చిస్తున్నారు. ఇప్పటికే సీఎం హుజురాబాద్ నియోజకవర్గంకు చెందిన పలువురితో ఫోన్లో మాట్లాడారు. శనివారం వారాల రామస్వామితో మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది .ఎంపిక చేసిన వారితో సీఎం మాట్లాడిన తీరు గమనిస్తే ఈ పథకం పై ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారన్నది స్పష్టమవుతుంది . కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ ఆదివారం రిసోర్స్ పర్సన్స్ తో సమావేశమై నేటి కార్యక్రమంపై అవగాహన కల్పించడమే కాకుండా ఇక్కడి నుంచి ప్రగతి భవన్కు వెళ్లనున్న వారికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు . దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు .
ఏ కార్యక్రమమైనా కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభిస్తే విజయవంతమవుతుందన్న నమ్మకంతో సీఎం కేసీఆర్ దళిత బంధు ను ఇక్కడి నుంచి ప్రారంభించాలని నిర్ణ యించి పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. ఈ రోజు నిర్వహించే సదస్సు అనంతరం ఒక్కో గ్రామానికి ఒక్కో ఐఏఎస్ అధికారి చొప్పున వారం రోజుల పాటు దళితుల స్థితిగతులపై మైక్రోలెవల్ సర్వే చేయనున్నారు . రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 33 మంది కలెక్టర్లు , 38 మంది అదనపు కలెక్టర్లు మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు గ్రామాల్లో పర్యటించి మైక్రో లెవల్ సర్వే చేసిన అనంతరం పథకం అమలు ప్రారంభమవుతుంది. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం అయింది. ఈ సమావేశం సాయంత్రం వరకు జరగనుంది. సదస్సుకు గ్రామానికి నలుగురి చొప్పున అందులో ఇద్దరు మహిళలు ఉండేలా ఎంపిక చేశారు .
హుజురా బాద్ నియోజవర్గం నుంచి మొత్తం 412 మంది ఇందులో 206 మంది మహిళ లు , వీరికి గైడ్ చేసేందుకు 15 మంది రిసోర్స్ పర్సన్స్ మొత్తం 427 హాజరయ్యారు . వీరిని సదస్సుకు తరలించేందుకు 8 బస్సులను ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో బస్సులను ఉదయం ఏడుగంటల లోపు సిద్ధంగా ఉంచి జిల్లా కలెక్టర్ కర్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. సదస్సుకు వెళ్లే దళిత బంధువులు హుజురాబాద్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించి బయలు దేరారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లో మొత్తం 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.