(P.Srinivas,News18,Karimnagar)
ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు అనేది ఎంత విలువైనదో అందరికి తెలిసిందే. ఒక వ్యక్తి జీవించి ఉన్నారనడానికి ఓటు(Vote) వేయడం ప్రదానం అని ఇప్పటికి గ్రామీణ ప్రాంత ప్రజలు నమ్ముతారు. సాదారణంగా ఓటు ఉపయోగించుకునే వారు స్త్రీ లేదా పురుషులు అని అందరికి తెలుసు అయితే స్త్రీ లేదా పురుషులు కాని వారిని ట్రాన్స్ జెండర్ (Trance gender)లగా గుర్తించి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం థర్డ్ జెండర్ అనే ఒక కేటగిరిని ప్రవేశ పెట్టింది. అయితే థర్డ్ జెండర్ గా పేరు నమోదు చేసుకొని ఈ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు ను వినియోగించు కునే ఒకే ఒక వ్యక్తి హుజురాబాద్ నియోజకవర్గం లో ఉన్నారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
హుజురాబాద్ ఉప ఎన్నికలలో మొత్తం 2 లక్షల ,37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు వారిలో స్త్రీలు ఒక లక్ష 19 వేల 102 మంది ఉండగా పురుషులు ఒక లక్ష 17 వేల 933 మంది ఉన్నారు. ఒక వ్యక్తి పేరు ఆథర్ కేటగిరీ లో నమోదు అయింది ఆ థర్డ్ జెండర్ పేరు రోంటాల కుమారి, హుజురాబాద్ పట్టణానికి చెందిన కుమారి చిన్నప్పటి నుండి హుజురాబాద్ లోనే పెరిగింది.
గతం లో ఒక సారి పురుషునిగా, మరో సారి స్త్రీ గా ఓటు హక్కు వినియోగించుకున్న కుమారి ఇప్పుడు మాత్రం ఆథర్ కేటగిరిలో తన పేరుని నమోదు చేసుకొని నియోజక వర్గం లోనే ఓకే ఒక్క ఓటరుగా నిలిచింది. అయితే ఎన్నికల అధికారులు ప్రకటించిన లిస్టు లో కుమారి పేరు ఉండటం ఈ సారి తాను ఓటు హక్కును ట్రాన్ జెండర్ గా వినియోగించుకుంటున్నదుకు చాల సంతోషంగా ఉంది అని కుమారి న్యూస్ 18కి కు తెలిపారు.
గతం లో సాదారణంగా ఓటు వేయాలంటే స్త్రీ కాని పురుషులు కాని ఉండాలి. దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ తీర్పుతో కేంద్ర ఎన్నికల సంఘం 2014 నుండి ట్రాన్స్ జెండర్ ల కోసం ప్రత్యేకంగా ఆథర్ అనే ఒక కెటగిరి ఏర్పాటు చేసారు. అప్పటి నుండి ట్రాన్స్ జెండర్ లు తమ పేరును థర్డ్ జెండర్ కేటగిరీ లో నమోదు చేసుకొని ఓటు వేస్తున్నారు. దేశంలో ఒక గుర్తింపు పొందిన సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్ జెండర్ ల సంఖ్య 90 వేలకు పై మాటే... 20 18 లో సాదారణ ఎన్నికల్లో ఓటు కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్యా 3 వేల లోపే ఉన్నారు.
కాని వీరిలో ఓటు వినియోగించుకున్నవారు మాత్రం 191 మంది అయితే ప్రభుత్వం తన లాంటి వారిని గుర్తించి ఆథర్ కేటగిరీ ని ఏర్పాటు చేయడం చాల మంచి పరిణామం. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేస్తే చాల మంది ట్రాన్స్ జెండర్ లు బాహ్య ప్రపంచం లోకి వచ్చి అధికారికంగా వారి పేర్లు నమోదు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని ట్రాన్స్ జెండర్ కుమారి తెలిపారు. మరి కుమారి ఓటు ఎవరికీ వేస్తది అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.