Home /News /telangana /

KARIMNAGAR ONCE AGIAN GOING ON FINACE HARRASMENTS IN KARIMNAGER VRY KNR

Karimnagar : కరీంనగర్‌లో ఇంకా ఆగని ఫైనాన్స్ దందాలు.. అధిక వడ్డీతో దోపిడి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Karimnagar : కరీంనగర్లో ఫైనాన్స్ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది . పది నుంచి 15 శాతం వరకు వడ్డీలు వసూలు చేస్తూ అవసరాలకు అప్పు తీసుకున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు .

  గతంలో జిల్లాలో సంచలనంగా మారిన ఏఎస్సై మోహన్ రెడ్డి కేసు తరహాలోనే భూములు , ప్లాట్లు , ఇండ్లను కుదువ పెట్టుకొని అప్పులిస్తున్నారు . డబ్బులు తిరిగి చెల్లించినా వారి ఆస్తులు అమ్మకానికి పెడుతున్నారు . దీంతో ఆస్తులు కోల్పోయిన వారు మానసికంగా కుమిలిపోతున్నారు . తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు . కమీషన్ల పేరిట .. నగరంలో డబ్బులున్న కొందరు గ్రూపుగా ఏర్పడి ఈ దందా చేస్తున్నారు . అప్పు ఇవ్వడానికి ముందు ఆస్తులను వాళ్ల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు . ఓ వ్యక్తికి రూ . 10 లక్షలు అప్పు అవసరమైతే అందులో మీడియేటర్ కమిషన్ , రిజిస్ట్రేషన్ చార్జీలు , ఐటీ చార్జీలు అంటూ సుమారు రూ .2.5 లక్షల వరకు ముందే కట్ చేసుకుని రూ .7.5 లక్షలు చేతిలో పెడుతున్నారు.

  ఈ ఫైనాన్స్ దందా చేస్తున్న వారికి వడ్డీపై ఒక పద్ధతి లేదు . పది నుంచి 15 శాతం వసూలు చేయడమే కాకుండా కిస్తీ ఏ ఒక్క నెల ఆలస్యమైనా .. మొత్తం అసలులో ఇంట్రస్ట్ కలిపి వచ్చే నెల అసలుగా చూపుతున్నారు . ఇలా తీసుకున్న అప్పు కొంచెమైనా వడ్డీలే ఎక్కువవుతున్నాయి . అప్పులకు చక్రవడ్డీలు వేసి..అప్పు తీసుకున్న మొత్తానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లెక్కలు చూపుతున్నారు . దీంతో అప్పు తీసుకున్న వారు ఇక తీర్చలేమని మానసి కంగా కుంగిపోతున్నారు .

  అయితే..ఈ ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులు అప్పు ఇవ్వ డానికి ముందు క్లయింట్ల దగ్గర నుంచి ఆస్తులను కుదువ పెట్టుకుంటున్నారు . కుదువ పెట్టుకున్న ఆస్తి విలువలో కేవలం పావు వంతు మాత్రమే అప్పుగా ఇస్తారు సాధారణంగా అయితే అప్పు తీసుకునే ముందే ఆస్తులను సేల్ కమ్ జీపీఏ చేస్తారు . అప్పు తీసుకున్న వారు కట్టలేని స్థితిలో ఉన్నపుడు ఈ ఆస్తులను వేలం వేయాలి . వచ్చిన అమౌంట్ లో అప్పు పోగా మిగిలినది సదరు వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది . కానీ ఇక్కడ ఏ నిబంధనలు పట్టించుకోవడం లేదు . కుదువ పెట్టుకున్న ఆస్తులను కబ్జా చేయడానికే ప్లాన్ చేస్తున్నారు .

  ఇది చదవండి : ధాన్యం కొనుగోలు చేయకుండా సీఎం ధర్నా చేయడం సిగ్గు చేటు ..


  ఈ కంపెనీల నిర్వాహకులు అప్పు తీసుకున్న వ్యక్తి కిస్తీలు లేట్‌గా కట్టడం .. ఆలస్యం అవుతుండం చూసి వారిని ఎక్కువగా ఇబ్బంది పెడతారు . ఒక వేళ ఉన్న ఆస్తిలో ఎంతో కొంత అమ్మి అప్పు తీరుద్దా మనుకున్నా అది తమ దగ్గర కుదువపెట్టారని అమ్మడానికి , కొనడానికి వీళ్లేదని ప్రచారం చేస్తారు ఎవరైనా కొనడానికి వస్తే వారిని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.. దీంతో అప్పు తీసుకున్న వారికి ఎటువంటి ఆప్షన్ లేకుండా పోతోంది . ఇలా ఇబ్బంది పెట్టి బలవంతంగా వారి నుంచి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు .

  ఈ కంపెనీ బాధితులంతా ఇప్పుడిపుడే బయటకు వస్తున్నారు . ఎలాగైనా తమ ఆస్తు లను కాపాడుకోవాలని చూస్తున్నారు . ఫైనాన్స్ నిర్వాహకుల చేతిల్లోంచి తమ ఆస్తి పత్రాలను విడిపించాలని వేడుకుంటున్నారు . ఇప్పటికే ఓ ఫైనాన్స్ సంస్థపై ఎఫ్ఎఆర్ కూడా నమోదైనట్లు తెలిసింది . ఇదే కంపెనీపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం . పోలీస్ ఆఫీసర్లు పూర్తి సహకారం అందిస్తే మరింత మంది బాధితులు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి .
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime news, Karimnagar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు