• Home
 • »
 • News
 • »
 • telangana
 • »
 • KARIMNAGAR ON THE 26TH OF THIS MONTH L RAMANA PEDDIREDDY HAVE A CHANCE TO JOIN TRS VB KNR

Telangana Politics: టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొనున్న ఎల్.రమణ, పెద్దిరెడ్డి.. ఆ రోజున ముహూర్తం ఖరారు.. ఎల్. రమణకు కీలక పదవి..?

ఎల్. రమణ, పెద్దిరెడ్డి (ఫైల్)

Telangana Politics: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది టీఆర్ ఎస్ లో చేరారు. దీనిలో భాగంగానే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తో పాటు మరో కీలక నేత కూడా కారెక్కేందుకు ముహూర్తం ఖారారయ్యింది. పూర్తి వివరాలివే..

 • Share this:
  (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

  హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి . ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటినుంచే సర్వశక్తులను ఒడ్డుతుంది . ఇప్పటికే చాలా మంది కారెక్కేందుకు సిద్ధమవుతు న్నారు. అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఇటీవల జగిత్యాలలో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు , మాజీ ఎంపీ ఎలగందుల రమణ కారెక్కేందుకు సిద్ధమైనట్లు తెలిసింది . వరంగల్‌కు చెందిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంతనాలు జరిపారు . త్వరలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ పదవి రమణకు ఇచ్చేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది . తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలుగుదేశం పార్టీ బలం క్రమక్రమంగా తగ్గుతుండటంతో రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రమణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది .

  రమణ చేరిక ద్వారా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న పద్మశాలీ ఓటర్లను తమవైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలిసింది. జగిత్యాల నియోజక వర్గంలో మరింత బలం పెరుగుతుందని అంచనావేసి ఈ మేరకు గులాబీ బాస్ రెడ్ కార్పేట్ పరచినట్లు తెలిసింది . ప్రస్తుతం బీజేపీలో ఉన్న టీడీపీ మాజీ నేత , మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. పెద్దిరెడ్డి హుజురాబాద్ నియోజక వర్గం నుంచి రెండు పర్యాయాలు ప్రాతి నిథ్యం వహించి చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన పెద్దిరెడ్డి ఇటీవల రాజేందర్ చేరికతో అలక వహించారు. సీనియర్ అయిన తనను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని బాహాటంగానే విమర్శించిన పెద్దిరెడ్డి ఇటీవల కాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. పెద్దిరెడ్డి ఇప్పటికే గులాబీ బాసును కలిసినట్లు తెలుస్తుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో పట్టు ఉన్న పెద్దిరెడ్డి సైతం రమణ బాటలో పయనించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది . ఈ నెల 26 న పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. పెద్దిరెడ్డిని పార్టీ లోకి తీసుకొని హుజురాబాద్ గులాబీ టికెట్ ఇస్తారా లేక మరేదైనా పదవి కట్ట బెడుతారా అనేది చూడాలి . రమణ , పెద్దిరెడ్డిలు కేసీఆర్ లేదా , కేటీఆర్ సమక్షంలో పార్టీ లో చేరే అవకాశం ఉంది .

  బీసీ నాయకునిగా ఎలగందుల రమణకు గుర్తింపు ఉంది . ఈ నినాదంతోనే కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి సంచలనం సృష్టించారు . జగిత్యాలలో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి చంద్రబాబు హ
  యాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు . జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు . చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు అని పేరుంది . తెలుగుదేశం నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లినా రమణ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు . రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు . రమణ టీఆర్ఎస్లో చేరితే తెలు గుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బే . కార్మిక నేతగా .. ఇనుగాల పెద్దిరెడ్డి కార్మిక నాయకునిగా ఎదిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు . 2003 కుముందువరుసగా రెండు పర్యాయాలు హుజురాబాద్ నుంచి గెలుపొంది చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు .

  టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా పని చేశారు. మధ్యలో చంద్రబాబును విభేదించి దేవేందర్ గౌడ్ తో జతకట్టినా మళ్లీ టీడీపీకి వచ్చారు . రాష్ట్ర విభజన తరువాత జాతీయ కమిటీలో చోటు కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు . ఇటీవల అలక వహించిన ఆయన గులాబీ గూటికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది . పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరితే హుజురాబాద్ నియోజకర్గంలో పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది.
  Published by:Veera Babu
  First published: