(P.Srinivas,New18,Karimnagar)knr
కరీంనగర్( Karimnagar)జిల్లా కేంద్రంలో స్మార్ట్ సిటి పనుల్లో భాగంగా కరెంట్ పోల్స్, కండక్టర్స్‌ని తొలిగించేందుకు మున్సిపల్ అధికారులు టర్న్ కీ బేసిక్ కింద వర్క్ చేశారు. అందులో మున్సిపాలిటీలో ఉన్న పాత ఐరన్ విద్యుత్ పోల్స్(Electricity poles), కండక్టర్ల(Conductors)ను తొలగించి కరీంనగర్‌లోని ఎన్సీడీసీఎల్(NCDCL)స్టోర్‌కు అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ గత మూడు సంవత్సరాలుగా స్మార్ట్ సిటి (Smart City)పనుల్లో భాగంగా కరెంట్ పోల్స్ తొలగిస్తూ వాటిని గుట్టు చప్పుడు కాకుండా స్క్రాప్(Scrap)గా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మున్సిపాలిటీ, ఎన్ఎడిసిఎల్ అధికారులు కుమ్మకై ఈ భారీ స్కామ్(Scam)కు తెరలేపారు. మున్సిపాలిటీ అధికారులు తొలగించిన కరెంట్ పోల్స్, కండక్టరు తిరిగి స్క్రాప్ కింద జిల్లా కేంద్రంలోని ఎన్పిడిసిఎల్ స్టోర్కు అప్పజెప్పాల్సి ఉన్నప్పటికి, అవేమి అక్కడ కనిపించడం లేదు.
తిలా పాపం తలా పిరికెడు..
కరీంనగర్ వన్ టౌన్ విద్యుత్ ఏఈ నుంచి టౌన్ 9 ఏఈ వరకు అందరూ వర్క్ ఆర్డర్స్ ఓపెన్ చేసి, స్క్రాపు స్టోర్ అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎన్పిడిసిఎల్ విద్యుత్ ఏఈలు ఎవరు కూడా ఇప్పటివరకు వర్క్ ఆర్డర్స్ ఓపెన్ చేయకపోవడం గమనార్హం. అంతే కాకుండా వర్క్ ఆడర్స్ కూడా ఎవరు తీసుకోవడం లేదనే సమాచారం బయట చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తొలగించిన ఐరన్ కరెంట్ పోల్స్, కండక్టర్స్ స్క్రాప్ మొత్తం బయట అమ్ముకొని అధికారులు సొమ్ముచేసుకున్నారు. అందులో ఎవరి వాటా ఎంత అని తేల్చాల్సింది.
మూడేళ్లుగా కొనసాగుతున్న దందా..
మూడు సంవత్సరాల నుంచి స్క్రాప్ స్టోర్స్‌కు చేరాడం లేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు యాభై కోట్ల పైనే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కరీంనగర్ ఎన్పిడిసిఎల్ ఎస్ఈ, మున్సిపాల్ కమీషనర్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారమంత కొనసాగినట్లు తేటా తెల్లమవుతుంది. మూడు సంవత్సరాలు గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి, సొమ్మును వారీ ఖాతాల్లో జమ చేసుకున్నారు. ఈ విషయం బయటికి చెప్తే ఉన్నతాధికారులు నుంచి ఒత్తిడి తప్పదనే ఉద్దేశ్యంతో కింది స్థాయి సిబ్బంది ఎవ్వరు నోరు మెదపడం లేదు. ఈ విషయం ఎక్కడ బయటకు చెప్పకూడదని కొంత మంది విద్యుత్ ఏఈలను కూడా ఆ శాఖఉన్నతాధికారి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
స్క్రాప్ అమ్మితే వచ్చే డబ్బులు ఎన్ని..?
కరీంనగర్ మున్సిపాలిటీ స్మార్ట్ సిటి వర్క్ లో బాగంగా ఇప్పటి వరకు తొలగించిన ఐరన్ కరెంట్ పోల్స్, కండక్టర్, ఇతర సామాగ్రీ స్క్రాప్ వివరాలు ఇలా ఉన్నాయి.. అందులో ఐరన్ కరెంట్ పోల్స్, ఇతర సామాగ్రీ సంబంధించి సుమారు 62 డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పిడిసిఎల్) అధికారులు, మున్సి పాల్ అధికారుల వాటా ఎంత అనేది ఉన్నతాధికారులు నిగ్గు తేల్చాల్సిందే అని పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి, ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విచారణ చేపట్టినట్లైతే, ఈ స్కామ్ ఎవరి పాత్ర ఎంత, ఎవరు సూత్రదారులు, ఎవరెంత దోచుకున్నారు అనే విషయాలు బయటికి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఆ శాఖల ఉన్నతాధికారులు ఈ స్కామ్పై ఎలా స్పందిస్తారో ఇక వేచి చూడాల్సిందే మరీ. ఈ విషయంపై వివరణ కోరగా మున్సి పాల్ కమిషనర్ను సంప్రదించేందుకు ప్రయత్నం చేసినప్పటికి అందుబాటులో లేడని అన్నారు.
అన్ని వర్క్ ఆర్డర్స్ తీసుకుంటున్నాం: కరీంనగర్ ఎనిపిడిసిఎల్ ఎస్ఈ గంగాధర్.
కరీంనగర్ స్మార్ట్ సిటి పనుల్లో బాగంగా తొలగించిన విద్యుత్ పోల్స్, కండక్టర్స్ స్క్రాప్కు సంబంధించిన వర్క్ ఆర్డర్స్ తీసుకుంటున్నాం. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మున్సిపాల్, విద్యుత్ అధికారులతో జాయింట్ మీటింగ్ జరుగుతుంది. అందులో చర్చించి పనులు పూర్తి కాగానే, వర్క్ ఆర్డర్స్ క్రియేట్ చేసి స్క్రాప్‌ను స్టోర్స్‌కు తరలిస్తున్నామంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Telangana News