హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kidnap: పెళ్లైన కొద్దిసేపటికే నవ వధువు మాయం..గుడి నుంచి వస్తుంటే సినిమా స్టైల్లో కిడ్నాప్ స్కెచ్

Kidnap: పెళ్లైన కొద్దిసేపటికే నవ వధువు మాయం..గుడి నుంచి వస్తుంటే సినిమా స్టైల్లో కిడ్నాప్ స్కెచ్

KIDNAP

KIDNAP

Kidnap: కరీంనగర్ జిల్లాలో బుధవారం రాత్రి పెళ్లి చేసుకున్న కొద్దిసేపటికే నవ వధువును సినిమా స్టైల్లో కిడ్నాప్ చేశారు. అసలు పెళ్లి కూతుర్ని ఎత్తుకెళ్లిందెవరో తెలియడం లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(P.Srinivas,New18,Karimnagar)

సమాజంపై సినిమాల ప్రభావం బాగా పడుతోంది. సినిమాలో కిడ్నాప్ ప్లాన్‌లు, మర్డర్ స్కెచ్‌లు అమలు చేసినట్లుగా రియల్‌ లైఫ్‌లో కూడా చేస్తున్నారు కొందరు ప్రబుద్దులు. ముఖ్యంగా ప్రేమికుల విషయంలో ఈ తరహా నేరాలు ఈమధ్య కాలంలో మరింత పెరిగాయి. కరీంనగర్ (Karimnagar)జిల్లాలో బుధవారం (Wednesday)రాత్రి పెళ్లి చేసుకున్న కొద్దిసేపటికే నవ వధువు(Wew Bride)ను సినిమా స్టైల్లో కిడ్నాప్ Kidnapచేశారు గుర్తు తెలియని వ్యక్తులు. నచ్చిన వ్యక్తిని గుడిలో పెళ్లి చేసుకొని తిరిగి వస్తుండగా సుమారు 10-15మంది పెళ్లి కొడుకుని అడ్డుకొని చితకబాదారు. అటుపై వధువును ఎత్తుకెళ్లారు. ఈ కిడ్నాప్ జరిగిన తీరు, సీసీ ఫుటేజ్(CCTV footage)పరిశీలిస్తే యువతి బంధువులే ఇదంతా పక్కా ప్లాన్‌ ప్రకారం చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు.

నవ వధువు కిడ్నాప్ ..

కరీంనగర్ జిల్లాలో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపుతోంది. హుజురాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో నవ వధువును సినిమా స్టైల్లో పక్కాగా స్కెచ్‌ వేసి పెళ్లి కొడుకును చితకబాది కిడ్నాప్ ప్లాన్ అమలు చేశారు. హనుమకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన వధువు వరంగల్‌కు చెందిన వరుడు బుధవారం కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వెళ్తుండగా కొందరు వ్యక్తులు హుజురాబాద్‌ అంబేద్కర్ చౌక్‌ దగ్గర పెళ్లి కొడుకుని చితకబాది అమ్మాయిని కారులో ఎత్తుకెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు.

సినిమా స్టైల్లో స్కెచ్..

నవ వధువుని కిడ్నాప్ చేయడం, ఆమె భర్తను చితకబాదిన ఘటనపై హజురాబాద్ పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అయితే యువతిని ఎత్తుకెళ్లిన వ్యక్తులు మాట్లాడుకున్న తీరును బట్టి వాళ్లంతా హన్మకొండకు చెందిన వాళ్లుగా..ఆమెను అక్కడికే తీసుకెళ్లి ఉంటారని స్థానికులు చెబుతున్నారు.

Drug Seizure: కోళ్ల ఫారమ్‌లో కోట్ల రూపాయల డ్రగ్స్..పట్టుబడింది మన దగ్గరే

పెళ్లైన కాసేపటికే మాయం..,

సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తే కిడ్నాప్‌కు గురైన యువతి, ఆమె ప్రియుడి ప్రేమ వ్యవహారం పెద్దలకు ఇష్టం లేదని అందుకే వాళ్ల పెళ్లికి అభ్యంతరం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలోనే యువతి, యువకుడు పెద్దలను ఎదిరించి కొండగట్టు గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కిడ్నాప్‌కు గురైన యువతి వివరాలు, కిడ్నాపర్‌ల చేతిలో దెబ్బలు తిన్న యువకుడి వివరాలు మాత్రం తమకు తెలియదని హుజురాబాద్‌ పోలీసులు చెప్పడం విశేషం.

First published:

Tags: Karimangar, Love marriage, Telangana crime news

ఉత్తమ కథలు