హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: ముందస్తు ఎన్నికలపై ప్రధాన పార్టీల నజర్..!

Karimnagar: ముందస్తు ఎన్నికలపై ప్రధాన పార్టీల నజర్..!

ముందస్తు ఎన్నికలపై పార్టీల నజర్

ముందస్తు ఎన్నికలపై పార్టీల నజర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట్లు మళ్లీ తెర మీదికి వచ్చాయి. రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. ప్రస్తుత అసెంబ్లీకి 2023 డిసెంబర్ వరకు గడువుంది. డిసెంబర్ అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికల నిబంధను ప్రకారం 2023 జూన్ వరకు అసెంబ్లీ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ గడువుకు ఆరు నెలల ముందు వరకు ఎన్నికలు జరపాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరు నెలల వరకు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఆ సమయంలో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఈ లెక్క ప్రకారమే అసెంబ్లీని రద్దు చేసే విషయమై విభిన్న కథనాలు తెరమీదికి వస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Karimnagar

(కరీంనగర్ జిల్లా, శ్రీనివాస్. పి. న్యూస్ 18 తెలుగు ప్రతినిధి)

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట్లు మళ్లీ తెర మీదికి వచ్చాయి. రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. ప్రస్తుత అసెంబ్లీకి 2023 డిసెంబర్ వరకు గడువుంది. డిసెంబర్ అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికల నిబంధను ప్రకారం 2023 జూన్ వరకు అసెంబ్లీ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ గడువుకు ఆరు నెలల ముందు వరకు ఎన్నికలు జరపాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరు నెలల వరకు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఆ సమయంలో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఈ లెక్క ప్రకారమే అసెంబ్లీని రద్దు చేసే విషయమై విభిన్న కథనాలు తెరమీదికి వస్తున్నాయి.

Warangal: తరాలు మారినా తీరని చేనేతల కష్టాలు!

ఇదిలా ఉండగా..ముందుస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లటం లేదని..షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగు తాయని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోని ప్రజలు అందుబాటులో ఉంటూ.. ఎన్నికలకు సన్నద్ధం కావాల నిసూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, రాష్ట్రాభి వృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇక జిల్లాలో కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయనే చర్చ కూడ నడుస్తుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాను తీసుకుంటే ప్రస్తుతం టీఆర్ఎస్ బలంగా ఉంది. 13 అసెంబ్లీ సెగ్మెంట్లలలో 11 సెగ్మెంట్లలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

Ts Congress: తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం..బీజేపీలోకి మరో ఐదుగురు నాయకులు?

హుజురాబాద్ లో బీజేపీ, మంథనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సిట్టింగులకే టికెట్లు అని కేసీఆర్ ప్రకటించడంతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజవర్గాలను చుట్టేస్తున్నారు. ముగ్గురు మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లు తమతమ నియోజవర్గాలే కాకుండా పక్క నియోజకవర్గాలపై దృష్టి సారించాలని కేసీఆర్ సూచించడంతో వీరు రంగంలోకి దిగనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను టచ్ చేయనుంది. ఉప ఎన్నికల ప్రచారం వేల ఆయన పాదయాత్ర కొనసాగుతుండటంతో వేములవాడ , చొప్పదండి , కరీంనగర్ అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న వారు భారీ జనసమీ కరణ కు సిద్దమవుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుతో జొష్ మీద ఉన్న బీజేపీ ఉమ్మడి జిల్లాలో సీట్ల సంఖ్యను పెంచుకునే దిశగా అడుగులు వేయనుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల కాలం నుంచి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు వస్తే జగిత్యాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. మంథని నుంచి శ్రీధర్ బాబు ఎలాగు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లేదా ఇతర అసెంబ్లీ ఎంచుకుంటారా, పార్లమెంటును ఎంచుకుంటారా చూడాలి. హుజురాబాద్ పై ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన ఎన్ఎస్ఎయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఫోకప్ పెట్టారు. కాంగ్రెస్ కు నాలుగు నియోజవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడం మైనస్ గా చెప్పవచ్చు. ఏది ఏమైనా ముందస్తు ప్రచారం అన్ని పార్టీలను అప్రమత్తం చేసింది. పార్టీ నాయకులు కూడా ఎవరికి వారే ముందస్తు ఎన్నికల కోసం రెడీ అవడం కొస మెరుపు.

First published:

Tags: Bjp, Congress, Elections, Karimnagar, Telangana, Trs

ఉత్తమ కథలు