Murder: కరీంనగర్ లో దారుణం.. తండ్రీ, కూతుళ్ల దారుణ హత్య.. కారణం అదేనా..!

ఘటనా స్థలంలో మృతదేహాలు

Murder: కరీంనగర్‌ జిల్లా మానుకొండూరు మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త చేతిలో భార్యతోపాటు ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

    కుటుంబ కలహాలతో ఓ దుర్మార్గుడు.. కట్టుకున్న భార్య, మామను వెంటాడి మరి దారుణంగా చంపాడు. తన సోదరుడి సాయంతో ఇద్దరినీ గొంతుకోసి హత్యచేశాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం శ్రీనివాస్‌నగర్‌ గుట్ట సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన గుడాల రమేష్ కి కొంతకాలం క్రితం వెల్ది గ్రామానికి చెందిన శారదా తో వివాహం జరిగింది. వారికీ ఒక కొడుకు అజిత్ (19), కూతురు అక్షిత (17) ఉన్నారు. కొన్ని రోజుల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో దూరంగా ఉంటున్నారు.

    ఈ క్రమంలో లావణ్య రెండు నెలల క్రితం పుట్టింటికి వచ్చి ఉంటుంది. ఈ క్రమంలో లావణ్య తన భర్తపై కరీంనగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ విషయమై రమేశ్‌ మనస్తాపం చెందాడు. అదే క్రమంలో సోమవారం రోజున కరీంనగర్ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ నిమిత్తం వెళ్లి తిరిగి రాత్రి భార్య లావణ్య, మామ ఓదేలు (60) కుమారుడు అజిత్‌, కుమార్తె అక్షిత ఆటోలో వెల్దికి వస్తున్నారు. శ్రీనివాస్ నగర్ గ్రామ శివారులో రాగానే రమేశ్‌, అతని సోదరుడు అనిల్‌ బైక్‌పై వారిని వెంబడించారు.

    అనంతరం ఆటోను ఆపి భార్య, మామపై దాడిచేసి కత్తితో దారుణంగా గొంతు కోశారు. వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. తండ్రిని అడ్డుకోబోయిన కుమార్తె చేతికి గాయమైంది. హత్యలో ముగ్గురు పాల్గొన్నట్టు సమాచారం. అనంతరం నిందితులిద్దరూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఏసీపీ విజయసారథి, సీఐ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. రమేశ్‌ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Veera Babu
    First published: