news18-telugu
Updated: January 27, 2020, 9:08 AM IST
ప్రతీకాత్మక చిత్రం
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ పక్రియ ప్రారంభం అయ్యింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 58 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. మొత్తం 4 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరుగనుంది. ఇందుకోసం మొత్తం 58 టేబుల్స్ ఏర్పాటు చేయగా… 58 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఇద్దరు అసిస్టెంట్లు, 20 మంది మైక్రో అబ్జర్వర్లను ఈసీ నియమించింది. అయితే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ప్రారంభం అయ్యింది. అయితే, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లు ఉండగా… రెండు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
Published by:
Krishna Adithya
First published:
January 27, 2020, 8:23 AM IST