జగిత్యాల (jagityal) పట్టణంలోని 20వ వార్డులో డ్రైనేజీ అది. అక్కడ పారిశుధ్య కార్మికులు పనులు చేస్తున్నారు. అప్పుడే వచ్చారు మునిసిపల్ కమిషనర్ స్వరూప. ఆ తర్వాత..
జగిత్యాల (jagityal) పట్టణంలోని 20వ వార్డులో డ్రైనేజీ అది. అక్కడ పారిశుధ్య కార్మికులు పనులు చేస్తున్నారు. అప్పుడే వచ్చారు మునిసిపల్ కమిషనర్ స్వరూప. ఆ తర్వాత..
జగిత్యాల (jagityal) పట్టణంలోని 20వ వార్డులో డ్రైనేజీలో సుమారు రెండు ట్రాక్టర్లు సరిపోయెంత చెత్త నిండిపోయింది. గత 2 రోజులుగా వార్డులో డ్రైనేజీలో చెత్త నిండి డ్రైనేజి (Drainage)నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో వార్డు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ చెత్త తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను (Sanitation workers) చూసిన మున్సిపల్ కమిషనర్ స్వరూప (Municipal Commissioner Swaroopa) చలించి పోయారు. వారి సేవలు గొప్పవి వెలకట్టలేనివని కొనియడారు. ఇప్పటికైనా ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. పారిశుధ్య కార్మికులు మన ఆరోగ్యం కోసం ఎంతో శ్రమిస్తున్నారని, నిత్యం రోడ్లను ఊడుస్తూ, ఇళ్ల నుంచి చెత్తను తరలిస్తున్నా ప్రజలు పట్టించుకోక పోవడం బాధాకరమని అన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు..
మునిసిపల్ కమిషనర్ స్వరూప రాణి (Municipal Commissioner Swaroopa rani) మాట్లాడుతూ.. తడి చెత్త పొడి చెత్త వేరుచేసి ఇవ్వండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజల సహకారం తోనే ప్లాస్టిక్ ను అంతం చేయవచ్చని, ప్లాస్టిక్ కరగదు, కాలదు, మురగదు అనే విషయాన్ని ప్రజలు గమనించాలని, అదే విషయాన్ని నిత్యం టీవీ, పేపర్ ల్లో చెప్తున్నపటికి ప్రజలు వాటిని పట్టించుకోకుండా ఉండటం పట్ల కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు.
కార్మికులను చూసి..
ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి జరిమానాలు విధించాలని, అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ కోరారు. వర్షాలు కురవక ముందే డ్రైనేజీ నుంచి మురుగు నీరు రోడ్డుపై పారడం చాలా బాధాకరమని, ప్రజలు ఇప్పటికైనా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలనీ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణంతో పాటు మానవాళికి ముప్పు పొంచి ఉందన్నారు కమిషనర్. ఈ సందర్భంగా ఆ చెత్త తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను చూసిన మున్సిపల్ కమిషనర్ కంటతడి పెట్టారు. వారి కష్టాలను చూసి ఆమె చలించిపోయారు. వారిని ఆప్యాయంగా పలకరించారు కమిషనర్ స్వరూప. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.