Home /News /telangana /

KARIMNAGAR MULKANUR MILK RATES HIKE FOUR RUPEES FOR LITER VRY KNR

Milk rates hike : పెరిగిన పాల ధరలు.. ములకనూరు పాలు, లీటరు పై ఎంత పెంచారంటే..

 పెరిగిన పాల ధరలు

పెరిగిన పాల ధరలు

Milk rates hike : కరీంనగర్‌లోని ములకనూరు సోసైటి పంపిణి చేసే పాల ధరలను పెంచింది. లీటరుకు 4 రూపాయల చొప్పున పెంచిన సొసైటి వాటిని సోమవారం నుండే అమల్లోకి తెచ్చింది.

    ( కరీంనగర్ జిల్లా. న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి )

    అసలే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై మరో భారం పడింది . పాలధరలు లీటరుకు నాలుగు చొప్పున పెరిగాయి . సోమవారం నుంచి కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ వారి కరీంనగర్ డెయిరీ లో పెరిగిన ధరలు అమలులోకి రాగా ఉమ్మడి జిల్లాలో ఉత్పత్తి చేసే ముల్కనూరు , ప్రియా , ఎన్ఎస్ఆర్ , నాగార్జున పాల ధరలు కూడా పెరిగాయి . ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు సరఫరా అయ్యే జెర్సీ , హెరిటేజ్ , దొడ్ల , వైష్ణవి , తిరుమల పాల ధరలు కూడ పెరిగాయి . డీజిల్ , పెట్రోల్ పెరుగుదల తో పెరిగిన రవాణా చార్జీలు , ప్యాకింగ్ మెటీరియల్ , విద్యుత్ చార్జీలు గణనీ యంగా పెరిగినందున తప్పనిసరి పరి స్థితుల్లో ధరలను పెంచినట్లు కరీంనగర్ డెయిరీతోపాటు ఇతర డెయిరీలు ప్రకటించాయి .

    పాల వినియోగ దారులపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 10 నుంచి 15 లక్షల రూపాయల అదనపు భారం పడనుంది . ప్రభుత్వం ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లా మినహా ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విజయ పాల ధరలు జనవరి 1 నుంచే పెరగగా అన్ని కంపెనీలు పెంచడంతో కరీంనగర్ డెయిరీ సోమవారం నుంచి పెంచారు . కరీంనగర్ డెయిరీ రోజుకు లక్షా 50 వేల నుంచి రెండు లక్షల లీటర్ల పాలను అమ్ముతుంది . ఈ క్రమంలో డెయిరీకి సరాసరిన నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయం పెరిగింది .

    Khammam : ముందుగా మర్యాద రామన్న ఆ తర్వాత మున్నాభాయ్ ఎంబీబీఎస్.. మాములుగా లేదు కథ..

    పాల సేకరణలో సంతృప్తికరమైన వాటాను అందిస్తున్న కరీంనగర్ డెయిరీ పాలధర ఎందుకు పెంచాల్సి వచ్చిందో ఇంతకు ముందే వినియోగదారులకు తెలియ జేసింది . పెరిగిన ధరల ప్రకారం కరీంనగర్ డెయిరీ ఉత్పత్తి చేసే టోస్ట్ పాలు లీటరకు 52 రూపాయలు , 500 మిల్లీ లీటర్లకు 26 రూపాయలు , 200 మిల్లీ లీటర్లకు 13 రూపాయలు , ప్యూర్ పాలు అరలీటరుకు 32 రూపాయలు కాగా గోల్డ్ పాలు అరలీటరకు 34 , టీ స్పెషల్ పాలు అరలీటరుకు 24 రూపాయలు . కరీంనగర్ డెయిరీ పాలు టోన్డ్ పాలు లీటరుకు 48 రూపాయలు ఉండగా 52 చేశారు . అమ్మకం దారుకు లీటరుపై 47 రూపాయల బిల్డింగ్ చేశారు . గతంలో మూడు రూపాయల లాభం ఉండగా ఇప్పుడు ఐదు రూపాయలు లీటర్‌పై రానుంది . ప్యూర్ మిల్క్ లీటరుకు 54 ఉండగా 64 రూపాయలకు చేరుకుంది . బిల్డింగ్ ధర లీటరకు 58 రూపాయలు , టీ స్పెషల్ లీటరుకు 43 ఉండగా 48 కి పెరిగింది . బిల్డింగ్ ధర లీటరుకు 43 రూపాయలు .

    Khammam : ఖమ్మంలో విషాదం.. క్రికెట్ ఆడుతుంటే.. చెట్టు కూలి ఇద్దరు మృతి.

    ముల్కనూరు డెయిరీ టోన్డ్ మిల్క్ నుంచి 22 నుంచి 24 రూపాయలకు స్పెషల్ మిల్క్ 26 నుంచి 30 , ప్యూర్ 31 నుంచి 34 రూపాయలకు అరలీటరుపై పెంచారు . ప్రియా మిల్క్ వారు టోస్ట్ 24 నుంచి 26 , స్టాండెడ్ 26 నుంచి 29 రూపాయలు అరలీటరుపై పెంచారు . జెర్సీ , దొడ్ల , హెరిటేజ్ వారు కూడ ఇదే రేంజ్లో పెంచారు . ఇతర కంపెనీలు ... వైష్ణవి మిల్క్ లీటరు టోన్డ్ పాల ధరను 46 రూపాయల నుంచి 52 రూపాయలకు , ఆక్టీవ్ మిల్క్ లీటరుకు 42 రూపాయల నుంచి 50 కి , మహాగోల్ 475 ఎంఎల్ పాల ధరను 58 నుంచి 66 రూపాయలకు పెంచారు . ఎన్ఎస్ఆర్ అరలీటరు ప్యాకెట్ పై రెండు రూపాయలు , లీటర్పై నాలుగు రూపాయలు ఈ నెల 13 నుంచి పెంచారు . వల్లభ వారు కూడా అరలీటరు ప్యాకెట్‌పై 2 రూపాయలు పెంచారు . రెండు నాగార్జున మిల్క్ వారు బిల్డింగ్పై లీటరుకు రెండు రూపాయలు ఈనెల 15 నుంచి పెంచారు .

    మీ నగరం నుండి (కరీంనగర్)

    తెలంగాణ
    కరీంనగర్
    తెలంగాణ
    కరీంనగర్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Karimnagar, Milk price

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు