Home /News /telangana /

KARIMNAGAR MUDRA AGRICULTURAL AND SKILL DEVELOPMENT SOCIETY CHEATED THEIR DEPOSITORS IN KARIMNAGAR AND NOW BRANCHES ALSO CLOSED KNR PRV

Karimnagar: ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన ముద్ర.. కోట్లాది రూపాయలు తీసుకుని బోర్డు తిప్పేసిన వైనం

ముద్రా బ్రాంచ్​

ముద్రా బ్రాంచ్​

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 300 కు పైగా బ్రాంచీలను ఏర్పాటు చేసింది . గ్రామీణ ఆర్థిక శక్తిని మెరుగుపరచడమే లక్ష్యంగా వెనుకబడిన, అణగారిన ప్రజల జీవితాల్లో ఆర్థిక ముద్ర వేస్తామని నమ్మించి నేడు నట్టేట ముంచింది.

    (న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్​  శ్రీనివాస్. పి.)

    సెంట్రల్ కో - ఆపరేటివ్ యాక్ట్ 2002 కింద ఏప్రిల్ 12 , 17 న ముద్ర అగ్రిక్చరల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ (Mudra Agricultural and Skill Development Society) ఏర్పాటైంది . తిప్పినేని రామదాసప్ప నాయుడు చైర్మన్​. నల్లకుంటలో ఈ సొసైటీని ఏర్పాటు చేశారు . ఇది విస్తరించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 300 కు పైగా బ్రాంచీలను ఏర్పాటు చేసింది . గ్రామీణ ఆర్థిక శక్తిని మెరుగుపరచడమే లక్ష్యంగా వెనుకబడిన, అణగారిన ప్రజల జీవితాల్లో ఆర్థిక ముద్ర వేస్తామని నమ్మించి నేడు నట్టేట ముంచింది.

    కరీంనగర్ (Karimnagar) ఉమ్మడి జిల్లాలో 15 వరకు బ్రాంచీలను ఏర్పాటు చేసింది . చిన్న మొత్తాల్లో రుణాలను తక్కువ వడ్డీకే (Low Interest) ఇస్తూ నమ్మకాన్ని చూరగొని తరువాత లక్ష నుంచి 4 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ల (Security deposits)ను తీసుకొని నెలవారి వేతనాల కింద ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 1,200 మందిని నియమించింది. బ్రాంచికి నలుగురి చొప్పున నియమించి వారి చేత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంది . కరీంనగర్ జిల్లాలోని ఒక్క రామడుగు బ్రాంచిలోనే 40 లక్షలు సేకరించారంటే సుమారుగా ఉమ్మడి జిల్లాలో పది కోట్ల రూపాయలపైనే ప్రజల సొమ్మను డిపాజిట్ల (Deposits) రూపాకంగా జమచేశారు.

    ఎలాంటి శిక్షణలు ఇవ్వలేదు..

    కరీంనగర్ జిల్లా కేంద్రంలో కోర్టు చౌరస్తా , మంకమ్మతోటతోపాటు జిల్లాలో చొప్పదండి , తిమ్మాపూర్ , రామడుగులతోపాటు ఉమ్మడి జిల్లాలో 12 వరకు బ్రాంచీలు ఉన్నాయి . ఇవి కాకుండా చిరు రుణాలు , వసూళ్లు కూడా కొనసాగించారు . స్కిల్ డెవలప్​మెంట్​పై ఆధునిక వ్యవసాయంపై ఎలాంటి శిక్షణలు (No Trainings) ఇవ్వలేదు. సంస్థలోని సగం మందికి పైగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందినంత దోచుకోవడంతో ఇటీవలే బ్రాంచీలకు తాళాలు (Locks to Branches) వేశారు .

    ఎలా బయటపడింది..?

    కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్నం సాయికృష్ణ ఏడాదిన్నర కిందట ముద్ర అగ్రికల్చరల్ అండ్ స్కిల్ డెవలప్ మెంట్ సొసైటీ (Mudra Agricultural and Skill Development Society)లో ట్రెయినీ అకౌంటెంట్​గా చేరాడు . సంస్థ ఇస్తున్న రుణాలు , డిపాజిట్లపై (Deposits) నమ్మకం కలిగి తన సన్నిహితులు , బంధువులతో 28 లక్షల వరకు సేకరించి సొసైటీలో డిపాజిట్ల రూపకంగా జమ చేశాడు. రెండు నెలలుగా కార్యాలయం (Office) మూసివేయడం తో డిపాజిట్ దారుల ఒత్తిడి తట్టుకోలేక డబ్బులు వచ్చే మార్గం కనిపించకపోవడంతో ఈ నెల 17 న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఇతని ఆత్మహత్యతో ఉమ్మడి జిల్లాలో ముద్ర లీలలు వెలుగులోకి వచ్చాయి.

    మూడు నెలల్లో డబ్బులు..

    రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో  సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ల​కు సంస్థ చైర్మన్ లేఖ రాశాడు . డైరెక్టర్లు మోసం చేశారని, మూడు నెలల్లో డబ్బులు చెల్లించే ప్రయత్నం చేస్తానంటూ హైకోర్టు న్యాయవాది చేత బహిరంగ ప్రకటన చేయించాడు .
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Cheated, Karimnagar, Money, Mudra loan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు