హోమ్ /వార్తలు /తెలంగాణ /

హుజురాబాద్ ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం..కారణం ఇదే!

హుజురాబాద్ ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం..కారణం ఇదే!

ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం

ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మున్సిపల్‌ ఛైర్మన్ లపై అవిశ్వాసాలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎంపిపి ఇరుకుల్ల రాణికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసులని 10 మంది ఎంపిటిసిలు‌ కరీంనగర్ కలెక్టర్ కు అందజేసారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్ఎస్ లోని విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే హుజురాబాద్ మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టగా తాజాగా హుజురాబాద్ ఎంపిపిపై పది మంది ఎంపిటీసిలు‌ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కి అవిశ్వాస నోటీసులు అందజేసారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

P.Srinivas,New18,Karimnagar

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మున్సిపల్‌ ఛైర్మన్ లపై అవిశ్వాసాలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎంపిపి ఇరుకుల్ల రాణికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీనికి సంబంధించి నోటీసులని 10 మంది ఎంపిటిసిలు‌ కరీంనగర్ కలెక్టర్ కు అందజేసారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్ఎస్ లోని విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే హుజురాబాద్ మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టగా తాజాగా హుజురాబాద్ ఎంపిపిపై పది మంది ఎంపిటీసిలు‌ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కి అవిశ్వాస నోటీసులు అందజేసారు.

Hyderabad: బూట్లలో 15 కేజీల బంగారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుకున్న పోలీసులు

ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ..హుజురాబాద్ ఎంపిపి ఇరుమల్ల రాణి  ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రశ్నించిన వారిపై బెదిరింపులకి పాల్పడుతున్నారని, ఎంపిటిసిలకి నిధులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ లకి‌ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అందుకే ఎంపిపిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్దమయ్యామని ఎంపీటీసీలు తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణిపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో తన పదవికి రాజీనామా చేసి తప్పుకున్నారు. ఇలానే రాజన్న సిరిసి జిల్లలో కూడా అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కేటీఆర్ కల్పించుకొని తీర్మాన పత్రాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పడంతో ఆగిపోవడం జరిగింది. రామగుండం మునిసిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రహస్యంగా కౌన్సిలర్లు మీటింగ్ పెట్టి అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు.

కరువు ప్రాంతంలో కూడా కాసులు కురిపిస్తున్న స్ట్రాబెర్రీ సాగు.. లాభాలు ఎలా ఉన్నాయంటే

ఇలా జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. కొద్దిరోజుల్లో ముందస్తు ఎన్నికల కోసం అధికార పార్టీ ఎన్నికల వెళ్లేందుకు అంత సిద్ధం చేసుకున్న సమయంలో ఇలా అసమ్మతి జ్వాలలు రావడంతో అధికార పార్టీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు.

ఇలా ఒక ఉమ్మడి జిల్లాలో కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే అవిశ్వాస తీర్మానాల జ్వాలలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇలాకాలో కూడ అవిశ్వాస తీర్మానాలకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది.

First published:

Tags: BRS, Huzurabad, Karimnagar, Telangana

ఉత్తమ కథలు