హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : అక్కడ మంకీపాక్స్ కంటే అవే ఎక్కువ భయపెడుతున్నాయి .. గడప దాటాలంటే గజగజ వణుకుతున్నారు

Telangana : అక్కడ మంకీపాక్స్ కంటే అవే ఎక్కువ భయపెడుతున్నాయి .. గడప దాటాలంటే గజగజ వణుకుతున్నారు

MONKEYS FEAR

MONKEYS FEAR

Telangana: వాటిని చూస్తే ఎవరికైనా నవ్వొస్తోంది. కాని అవి చేసే పనులు చూస్తే ఒళ్లు మండిపోతుంది. ఒక్కటిగా ఉంటే కుదురుగా ఉంటుంది..సైన్యంగా వస్తే ఇల్లు పీకి పందిరేస్తాయి. ఊరు, రోడ్లపై జనాన్ని తిరిగనివ్వకుండా పరుగులు పెట్టిస్తాయి. తెలంగాణలో మంకీపాక్స్‌ భయపెడుతున్నట్లుగానే కరీంనగర్ జిల్లాను మంకీస్ ఫీయర్‌ వెంటాడుతోంది.

ఇంకా చదవండి ...

  (P.Srinivas,New18,Karimnagar)

  గతంలో కోతులు ఎక్కువగా అడవుల్లో ...తోటల్లో మాత్రమే ఉండేవి. ఆ తర్వాత కొందరు కోతుల(Monkeys)ను గ్రామాల్లోకి తీసుకొచ్చి ఆడిస్తూ ఉండేవారు. అప్పుడు ఆ కోతి జనాన్ని చూసి భయపడుతుండేది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. కోతుల్లేని ఊరంటూ లేదనే విధంగా వనార సంతతి విపరీతంగా పెరిగిపోయింది. కోతుల సంఖ్య పెరగడమే కాదు సైన్యంగా వచ్చి ఊరు, జనంపై పడి చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్(Karimnagar)జిల్లా ప్రజలకు వానరసైన్యం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. విపరీతంగా భయపెడుతున్నాయి.

  Hyderabad | Heavy rains:సైలెంట్‌గా కురిసిన వర్షానికి వణికిపోయిన ఓల్డ్ సిటీ ..ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు  కోతులతో కొత్త చిక్కులు..

  తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మంకీ పాక్స్ భయపెడుతుంటే ..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం మంకీస్ ఫీయర్ ప్రజల్ని వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రతి పట్టణం, గ్రామంలోని గల్లీ గల్లీలో కోతులు వందల సంఖ్యలో తిష్టవేసుకున్నాయి. జనావాసల మధ్య తిరుగుతూ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఒకటేంటి ఇంటి పైకప్పులను ఊడదీస్తూ ఇల్లు పీకి పాతరేస్తున్నాయి. రోడ్లు, బజారుకు వెళ్లే వారిపై దాడి చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. వీటి ఆగడాలకు ప్రజలు హడలెత్తిపోతు న్నారు . ఇంటిపై పెంకులు , డిష్ వైర్లు ఇంట్లోని వంట సామగ్రి ధ్వంసం చేస్తు ఏకంగా మనుషులను చంపేవారకు వచ్చాయి.. అంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. కోతుల బారిన పడి గాయాల పాలైన వారు ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఉన్నారు.

  ప్రాణాలు తోడేస్తున్న వానరసైన్యం..

  ప్రజలు ఏమాత్రం ఆదమరిచినా ఇంట్లోని వస్తువులన్ని చిందర వందర చేస్తున్నాయి. మనిషి చేతిలో సంచులు, పిల్ల చేతుల్లో తినుబండారాలు కనిపిస్తే చాలు మీద పడి లాక్కునే వరకు వదలడం లేదు. ఆత్మరక్షణ కోసం కోతులను బెదిరించే ప్రయత్నం చేస్తే దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇళ్లు , మనుషులే కాదు చివరకు పంట పొలాల్ని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. పత్తి , వరి , మొక్కజొన్న పంటలను చిందరవందర చేస్తూ నోటితో పీకేస్తూ రైతులకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. ఒక్కటిగా వస్తే కుదురుగా ఉండే కోతి ..గుంపులు గుంపులుగా రోడ్లపై, గ్రామాల్లో సంచరిస్తుండటంతో జనం రోడ్లపై తిరగాలన్న, ఇంటి గడప దాటి అడుగు పెట్టాలన్నా భయంతో వణికిపోతున్నారు.

  Telangana : భర్తను వదిలేసి 3ఏళ్లుగా బాత్రూంలోనే ఉంటున్న యువతి .. జరిగిందేంటో తెలిస్తే షాక్ అవుతారు  ఎక్కడపడితే అక్కడ తిష్ట..

  ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారం చేసుకునే వాళ్లు, పండ్ల దుకాణాలు పెట్టుకున్న వాళ్లను వదలడం లేదు వానర సైన్యం. కోతుల బెడద తట్టుకోలేక కొందరు ఇనుప మెస్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అడవులు అంతరించిపోవడం వల్లే కోతులు ఊరిపైన పడి తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాని కరీంనగర్ జిల్లా ప్రజలు వాపోతున్నారు. సామాన్య ప్రజలు, రైతులే కాదు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర చెట్లు, పెంకులపై మందగా చేరి అక్కడికి పనులపై వచ్చే వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జిల్లాలోని కోతుల బెడద తగ్గించాలని ఫారెస్ట్ , ఇతర శాఖల అధికారుల్ని జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలకు దూరంగా వదిలిపెట్టి వాటిని జనజీవన ప్రదేశాలకు రాకుండా ఆహారం సమకూర్చమని కోరుతున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimnagar, Monkeys, Telangana News

  ఉత్తమ కథలు