హోమ్ /వార్తలు /తెలంగాణ /

Tribal reservations: గిరిజన రిజర్వేషన్లతో కేంద్రానికి సంబంధం లేదు.. కేసీఆరే ఆలస్యం చేశారు: ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

Tribal reservations: గిరిజన రిజర్వేషన్లతో కేంద్రానికి సంబంధం లేదు.. కేసీఆరే ఆలస్యం చేశారు: ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

జీవన్​ రెడ్డి (ఫైల్​)

జీవన్​ రెడ్డి (ఫైల్​)

కేసీఆర్ కు ఏ విషయం పూర్తిగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఎవరైనా చెప్పినా వినడు” అని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి మండిపడ్డారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  కేసీఆర్ (KCR) కు ఏ విషయం పూర్తిగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఎవరైనా చెప్పినా వినడు” అని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి (MLC Jeevan Reddy)మండిపడ్డారు. అసలు గిరిజన రిజర్వేషన్లు (Tribal reservations) కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోనే అమలు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని గతంలో అసెంబ్లీలోనే తాను చెప్పినట్లుగా జీవన్​ రెడ్డి గుర్తుచేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ గిరిజనులకు కల్పిస్తామన్న 10 శాతం కేవలం రాష్ట్ర స్థాయిలోనే వర్తిస్తుంది. దీన్ని అమలు చేసే విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేని అంశం.  కానీ కేసీఆర్ (CM KCR) ఇంతకాలం కేంద్రం మీద నెపం వేసి అమలు చేయకుండా జాప్యం చేశాడు.ఇదే విషయాన్ని గతంలో నేను అసెంబ్లీలో చెప్పాం. గిరిజన రిజర్వేషన్ అంశాన్ని ముస్లిం రిజర్వేషన్ తో జతచేసి పంపించారు. 50 శాతం మించి ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేనప్పటికీ ఎందుకు కేంద్రానికి నివేదించారు? ఏడేళ్లుగా కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే గిరిజనులు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కోల్పోయారు.

  ఏడేళ్లుగా మెడికల్ కాలేజీల్లో (Medical colleges) రిజర్వేషన్లు కోల్పోయి.. వైద్యులయ్యే అవకాశాన్ని కోల్పోయారు.. కేసీఆర్ ఈ విషయంలో గిరిజన ద్రోహిగా నిలిచిపోనున్నారు. కేసీఆర్ కు ఏ విషయం పూర్తిగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఎవరైనా చెప్పినా వినడు. రాజ్యాంగం గిరిజనులకు ప్రత్యేక హక్కు కల్పించింది.పీకల మీదకు వచ్చాక ఇప్పుడు గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేస్తా అంటున్నాడు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ జీవో ఇస్తానంటూనే.. మరోవైపు కేంద్రం జీవో అమలు చేయాలని మెలిక ఎందుకు పెడుతున్నాడు?

  జీవో 140 ఏం చేస్తుంది..?

  కేంద్రానికి సంబంధమే లేనప్పుడు ఆ జీవో కేంద్రానికి పంపుడెందుకు. నేనే అమలు చేస్తానని ఖచ్చితంగా ఎందుకు చెప్పడం లేదు . సామాజిక వెనకబాటు ఉన్నచోట రిజర్వేషన్లు 50 శాతం దాటినా తప్పులేదు. పోడు భూముల విషయంలో జీవో 140 ఏం చేస్తుంది. ఈ జీవో కేవలం సలహా కమిటీ కోసమే. గిరిజన బంధు అంటున్న కేసీఆర్ .. మళ్లీ భూమిలేని వారికే అంటూ కండిషన్ పెడుతున్నాడు. షరతులు లేకుండా గిరిజన బంధు ఇవ్వాలి. నీ ఇంట్లో నుంచేమీ ఎస్సీ, ఎస్టీలకేమీ ఇవ్వడం లేదు. అది వాళ్ల హక్కు..కేసీఆర్ మాటల్లో క్లారిటీ ఉండదు. మొదటొకటి చివరొకటి మాట్లాడుతాడు.

  ఆయన మాటలన్నీ కుట్రపూరితమే. ఈ విద్యాసంవత్సరం నీట్ కౌన్సిలింగ్ లో మెడికల్ సీట్లకు, ఉద్యోగాల భర్తీలో సత్వరమే 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.. ఇంతకాలం రిజర్వేషన్ 10 శాతం లేక పోవడం వల్ల కోల్పోయిన ఉద్యోగాలకు పరిహారంగా సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసి భర్తీ చేయాలి.

  దేశవ్యాప్తంగా 7.5 శాతం గిరిజన రిజర్వేషన్లు..

  ముస్లిం రిజర్వేషన్ అంశం మాత్రమే కోర్టులో ఉన్నందున.. వాటితో లింక్ చేసి గిరిజన రిజర్వేషన్ అంశాన్ని వివాదం చేయకండి. కేంద్రానికి లేని అధికారికాలు కల్పించకండి. కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా 7.5 శాతం గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. గిరిజన తండాలను పంచాయతీలు చేస్తేనో, గిరిజన భవన్లు కట్టిస్తేనో సరిపోదు. వారి జీవన ప్రమాణాలు పెంచాలి.

  ఇప్పటికైనా కేసీఆర్ తన మేడిపండు ముసుగు తొలగించి చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అటవీ భూముల చట్టాలకు అనుగుణంగా వెంటనే పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి. పక్కదారి పట్టించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో వారికి 10 లక్షల ఇండ్లు కట్టించాలి” అని జీవన్​ రెడ్డి అన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Congress, Jeevan reddy, Reservations, Telangana, Tribes

  ఉత్తమ కథలు