అందరితో పాటే ఆ బాలిక నిమజ్జనానికి వెళ్లింది.. మాయ మాటలు చెప్పి 17 ఏళ్ల బాలుడు.. మసీదు వెనకకు తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మైనర్ బాలికపై .. మైనర్ బాలుడు అత్యాచారయత్నం చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  (P. Srinivas, News18, Karimnagar)

  నిర్భయ(Nirbhaya) లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్(Encounter) చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి. మొన్నటికి మొన్న చైత్ర సంఘటన మరువకముందే తాజాగా గణేష్ నిమజ్జనం చూడడానికి వచ్చిన ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి యత్నించిన మైనర్ బాలుడు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .

  Court Bail: వింత తీర్పు.. బెయిల్ మంజూరు చేయాలంటే.. ఈ పని చేయాల్సిందే..


  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్దిపూర్ గ్రామంలో సాయంత్రం వినాయక నిమజ్జన శోభాయాత్ర జరిగింది . ఈ కార్యక్రమాని చూసేందుకు వచ్చిన ఓ ఐదేళ్ల చిన్నారిపై కన్నేసిన అదే గ్రామాని చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడు గ్రామంలోని మసీదు వెనుక ఉన్న చెట్ల పొదల్లో తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.

  Telangana Crime: భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించిఉండరు..


  అతని నుంచి తప్పించుకొని వచ్చిన చిన్నారి .. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైప చిన్నారి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని సదరు మైనర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. తెలంగాణ(Telangana)లోని మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో ఒక దారుణ‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది.

  ప్రేమ వివాహం చేసుకున్నాడు.. భార్య ఇంత పని చేస్తుందని అతడు ఊహించలేకపోయాడు.. చివరకు..


  భార్యాభ‌ర్త‌ల(Wife and Husband) మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో భ‌ర్త‌ను అతడి భార్య దారుణంగా చంపి అత‌ని మ‌ర్మాంగం కోసేసింది. భార్యాభర్తల మధ్య గొడ‌వ‌లు రావ‌డం స‌హ‌జం. కానీ అందులో ఎవరో ఒకరు ఓపికతో ఉండాలి. ఇద్దరు కోపంతో ఉంటే ఊహించని పరిణామాలు చోటు చేసకుంటాయి. అలాంటిదే ఇక్కడ భార్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయింది. దీంతో ఘోరం జరిగిపోయింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధి వాంకుడోతు తండాలో భూక్య బీచ్యా – ప్రమీల భార్య భ‌ర్త‌లు నివ‌సిస్తుండేవారు.

  వాళ్లిద్దరు స్నేహితులు.. ఓ రోజు పొలం పనులకని వెళ్లారు.. తిరిగి వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు.. అసలేం జరిగిందంటే..


  తాజాగా భార్యాభ‌ర్త‌లు ఇద్దరూ గొడ‌వ ప‌డ్డారు. ఆ ఇంటి నుండి పెద్ద పెద్ద అరుపులు విన‌ప‌డ్డాయి. ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌ను దారుణంగా చంప‌డ‌మే కాకుండా అత‌ని ప్రైవేట్ పార్ట్ (మ‌ర్మాంగం ) కోసి చంపేసింది. భర్త ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి నిత్యం వేధిస్తున్నాడనే కోపంతో భార్య ప్రమీల మర్మాంగం కోసిందని స్థానికులు అంటున్నారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
  Published by:Veera Babu
  First published: