హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: పార్టీ మీటింగ్ లో కన్నీళ్లు పెట్టుకున్న కరీంనగర్ జడ్పి చైర్ పర్సన్..ఓదార్చిన మంత్రి గంగుల కమలాకర్

Karimnagar: పార్టీ మీటింగ్ లో కన్నీళ్లు పెట్టుకున్న కరీంనగర్ జడ్పి చైర్ పర్సన్..ఓదార్చిన మంత్రి గంగుల కమలాకర్

కన్నీళ్లు పెట్టుకున్న కరీంనగర్ జడ్పి చైర్ పర్సన్

కన్నీళ్లు పెట్టుకున్న కరీంనగర్ జడ్పి చైర్ పర్సన్

 టీఆర్ఎస్ బలోపేతానికి  పట్టణంలో నిర్వహించిన పార్టీ మీటింగ్ లో కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ కన్నీళ్లు పెట్టుకున్నారు. మినిస్టర్ గంగుల కమాలకర్ , ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ దగ్గరకు వెళ్లి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గురించి గోడు వెళ్లబోసుకున్నారు. ' ఈటల రాజేందర్ పార్టీలో ఉన్నపుడు యాక్టివ్ గా పని చేసిన విజయ. ఇప్పుడు ఆ స్థాయిలో పని చేయడం లేదని , పూర్తిస్థాయిలో నియోజకవర్గంలో ఉండడంలేదని ' కౌశిక్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ప్రొటోకాల్ లో తనదే పెద్ద పదవని, నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా అందుబాటులో ఉండాలని చెప్పినట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar | Hyderabad

(కరీంనగర్ జిల్లా, శ్రీనివాస్. పి, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి)

టీఆర్ఎస్ బలోపేతానికి  పట్టణంలో నిర్వహించిన పార్టీ మీటింగ్ లో కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ కన్నీళ్లు పెట్టుకున్నారు. మినిస్టర్ గంగుల కమాలకర్ , ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ దగ్గరకు వెళ్లి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గురించి గోడు వెళ్లబోసుకున్నారు. ' ఈటల రాజేందర్ పార్టీలో ఉన్నపుడు యాక్టివ్ గా పని చేసిన విజయ. ఇప్పుడు ఆ స్థాయిలో పని చేయడం లేదని , పూర్తిస్థాయిలో నియోజకవర్గంలో ఉండడంలేదని ' కౌశిక్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ప్రొటోకాల్ లో తనదే పెద్ద పదవని, నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా అందుబాటులో ఉండాలని చెప్పినట్లు సమాచారం.

ఇది చదవండి: పోలీస్ చేతిలో స్టెతస్కోప్.. కాంబినేషన్ అదుర్స్..! అసలు స్టోరీ ఇదే..!

దీంతో మంత్రి గంగుల ఆమెను ఓదార్చి తన పక్కనే కూర్చొబెట్టుకున్నారు  మీటింగ్ కు నేతల దూరం టీఆర్ఎస్ జిల్లా సమావేశానికి చొప్పదండి టీఆర్ఎస్ లీడర్లు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండలంలో చేపట్టే కార్యక్ర మాలు, పదవుల ఎంపికలో ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారని పలువురు టీఆర్ఎస్ లీడర్లు, ప్రజా ప్రతినిధులు ఆయన పట్ల అసంతృప్తిగా ఉన్నారు. చొప్పదండి ఏఎంసీ పాలకవర్గం ఏర్పాటు కారణంగా అసంతృప్తిగా ఉన్న మున్సి పల్ చైర్ పర్సన్ నీరజ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడురాజేశ్వర్ రెడ్డి, ఏఎంసీ తాజా మాజీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ గంగారెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు వెంకటరమణ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రమేశ్, పలువురు కౌన్సిలర్లు , కోఆప్షన్ సభ్యులు , సీని యర్ లీడర్లు మీటింగ్ కు దూరంగా ఉన్నారు.

ఇది చదవండి: మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టమా..? అయితే ఇదే పర్‌ఫెక్ట్ ప్లేస్..!

అలాగే ఎమ్మెల్యే ప్రొగ్రాంలకు పదిహేను రోజులుగా వీరంతా దూరంగా ఉంటున్నారు. ఈసందర్బంగా మంత్రి గంగుల కమలాకర్  మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలే టీఆర్ ఎస్ సైన్యం అని అన్నారు. దేశంలో ప్రజా సంక్షేమ పాలన అందిచడం కోసమే టిఆర్ఎస్ , జాతీయ పార్టీ బీఆర్ఎస్ మారిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీనీ గెలిపించాలని కోరారు. తెలంగాణా ప్రజలు తయారుచేసుకున్న ఆయుధం కేసీఅర్ అని అన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని విమర్శలు చేసిన తిప్పి కొట్టాలనీ నాయకులకు పిలుపునిచ్చారు. టీఎర్ఎస్ నాయకులు , కార్యకర్తలు ప్రజలకు జవాబు దారులుగా ఉండాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే టీఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉండాలన్నారు. తెలంగాణ రాకముందు దూర ప్రాంతాలకు వలసలు ఎక్కువ ఉండేవన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ సస్యశ్యామలం అయిందని తెలిపారు. నీళ్ళు , కరెంట్ లేక సతమతం అయిన రైతులకు నేడు కష్టాలు తీరాయన్నారు.

హైదరాబాద్ సంపద పెరిగిందని, ఇక్క డికి ఇతర దేశాల కంపెనీలు వచ్చి పెట్టు బడులు పడుతున్నాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి కొందరు వచ్చి ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. కేసీఅర్ లేక పోతే తెలంగాణ అంధకారం అవుతుంద న్నారు . టీఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తల భద్రత, రక్షణ అధిష్టానం చూసుకుంటుందన్నారు.

First published:

Tags: Karimnagar, Minister gangula kamalakar, Telangana

ఉత్తమ కథలు