మంత్రి గంగుల కమలాకర్ , బీజేపీ నేతల మధ్య కరీంనగర్ కొనసాగుతున్న అంతర్గత వార్ ..కాస్త బహిరంగం అవుతోంది..ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే పరిస్థితి నెలకొంది..
ఇటివల మంత్రి గంగుల కమలాకర్ గతంలో నిర్వహించిన క్వారీలో అక్రమాలు జరగడంతో పాటు నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు కొనసాగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రానైట్ తవ్వకాల్లో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ మంత్రి గంగులకు ఈడీ నోటీసులు సైతం జారీ చేసింది.
దీంతో ఒకరిపై ఒకరు పై సాధించేందుకు ఇరు పార్టీల నేతలు రంగంలోకి దిరు..ఈ క్రమంలోనే కరీంనగర్ బీజేపీ నేత నేత బేతి మహెందర్ రెడ్డి మంత్రి గంగులకు సంబంధం లేకపోయిన సామాజిక మాధ్యమాలతో పాటు ఓ ట్యూబ్ చానల్‌లో తన పరువుకు భంగం కల్గే విధంగా వ్యవహరించాడని మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. దీంతో బేతి మహెందర్ రెడ్డిపై కరీంనగర్ టూటౌన్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
కాగా ఈటల రాజీనామా తర్వతా మంత్రి గంగులతోపాటు కొప్పుల ఈశ్వర్‌లు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గ బాద్యతలతోపాటు ఈటలపై మంత్రి గంగుల కమలాకర్ విరుచుకుపడుతున్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య రాజకీయ వ్యుహాలు, ప్రతివ్యూహాలు కొనసాగుతున్నాయి..ఈ క్రమంలోనే ఓ మంత్రి నేరుగా కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Karimnagar, Minister gangula kamalakar