మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ..

మంత్రి కాన్వాయ్‌కి అడ్డుగా వెళ్లిన ఏబివిపి

స్వంత నియోజవర్గ పర్యటనలో ఉన్న వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌ను ఏబివిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతో నిరుద్యోగ భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

  • Share this:


కరీంనగర్ జిల్లా : స్వంత నియోజవర్గ పర్యటనలో ఉన్న వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌ను ఏబివిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతో నిరుద్యోగ భృతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి కాన్వాయ్‌కి ఒక్కసారిగా అడ్డుగా వెళ్లారు .

దీంతో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక హుజురాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ధర్నా చేస్టున్న విద్యార్థులను అరెస్ట్ చేసే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సైతం నిలిచిపోవడంతో పాటు, విద్యార్థులు సైతం సొమ్మసిల్లి పడిపోయారు. అయితే కాన్వాయ్‌కి అడ్డుగా వచ్చిన విద్యార్థులతో మంత్రి మాట్లాడేందుకు ప్రయత్నం చేయడానికి కాన్వాయ్ బయటకు వచ్చినా..సాధ్యం కాకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు.

అంతకుముందు హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్గులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం హుజురాబాద్ మండలం లో ఇటీవల మృతి చెందిన ప్రతాప సాయి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి వస్తున్న సందర్భంలో ఏబివిపి కార్యకర్తలు అడ్డుకున్నారు.
Published by:yveerash yveerash
First published: