హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar :కరోనా కాలంలో వడ్డీల దందా...కుదేలవుతున్న చిరువ్యాపారులు

Karimnagar :కరోనా కాలంలో వడ్డీల దందా...కుదేలవుతున్న చిరువ్యాపారులు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Karimnagar : ఓ వైపు కరోనాతో ప్రజలు ,చిరు వ్యాపారులు తల్లడిల్లుతుంటే..వడ్డీ వ్యాపారులు, చిట్టీలు నడిపే వ్యాపారులు తమ దందాను ఇంకా ఎక్కువ చేశారు..అవసరానికి వచ్చిన వారి వద్ద అధిక వడ్డీలు గుంజుతున్నారు.

న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి. .

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాన్యుల అవసరాలు , ఎదుటివారి ఆర్థిక ఇబ్బందే వ్యాపారంగా మారుతుంది . కరోనా కాలంలో వడ్డీ వ్యాపారుల దందా మూడు పువ్వులు ఆరు కాయలూగా నడుస్తుంది. అత్యవసరానికి తీసుకున్న అప్పు కారణంగా శక్తికి మించి వడ్డీ కడుతూ మానసికంగా , ఆర్థికంగా కుంగిపోతున్న కుటుంబాలు జిల్లాలో చాలా ఉన్నాయి . సిరిసిల్ల , కరీంనగర్ , పెద్దపల్లి ,జగిత్యాల జిల్లాలో రకరకాల పేర్లతో డబ్బులను వడ్డీకి ఇచ్చి సామాన్య కుటుంబాలకు నరకం చూపిస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి .

అనధికార చిట్టీ పాటలు తోడవుతున్నాయి . వడ్డీ దందా నిత్యం జరుగుతూనే ఉన్నా కరోనా కాలం వ్యాపారులకు మరింత కలిసొచ్చిందని పలువురు పేర్కొంటున్నారు . పలు రకాలుగా దోపిడీ నిరు పేదలు , సామాన్యులు , మధ్య తరగతి వర్గాల వారు అవసరాల కోసం గిరిగిరి , వీక్లీ , ఫైనాన్స్ , నెలవారి వడ్డీ తదితర పేర్లతో డబ్బు తీసుకుంటారు . దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు వ్యాపారులు 15

నుంచి 25 శాతం వడ్డీ వసూలు చేస్తూ ఆర్ధిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు . గిరిగిరిలో రూ .10 వేలు కావాల్సి వస్తే రూ .8 వేలు ఇస్తారు . రోజూ రూ .100 చొప్పున వంద రోజుల్లో రూ .10 వేలు చెల్లించాల్సి ఉంటుంది . అదే రూ .10 వేలు నేరుగా ఇస్తే రోజుకు రూ .120 చొప్పున వందరోజులు కట్టాలి . నెలవారి ఫైనాలో రూ .50 వేలు ఇస్తే రూ . 6,500 చొప్పున 10 నెలలు తిరిగి చెల్లించాలి .

ఈ విధంగా వడ్డీల పేరుతో సామాన్యులను , చిరు వ్యాపారులను దోపిడి చేస్తున్న వారు రోజురోజుకు పెరుగుతున్నారు . కొందరు బడా వ్యాపారులు సైతం తమ సహచర వ్యాపారులకు ఉదయం రూ.లక్ష ఇచ్చి సాయంత్రానికి దానికి అదనంగా రూ .10000 వసూలు చేస్తున్నారు . ఈ వ్యవహారంలో కొందరు రాజకీయ నేతలు చక్రవడ్డీలు సైతం వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి . వారిని ప్రశ్నించే వారే లేరని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

అయితే వేధింపులపై పోలీసులకు సమాచారం అందించాలని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిస్తున్నారు.

First published:

Tags: Karimangar, Telangana

ఉత్తమ కథలు