హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana | Job mela : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ .. కరీంనగర్ కమీషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

Telangana | Job mela : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ .. కరీంనగర్ కమీషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

Karimnagar job mela

Karimnagar job mela

Job mela | Telangana : రాష్ట్రంలోని చదువుకున్న నిరుద్యోగ యువత కోసం ఉద్యోగవకాశాలు కల్పించాలనే భావనతో కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్ ఆధ్వర్యంలో మంగళవారం మెగా జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నారు. ఏ ఏ విద్యార్హతతో ఎన్ని జాబ్‌లు ఉన్నాయంటే.

(P.Srinivas,New18,Karimnagar)

రాష్ట్రంలోని చదువుకున్న నిరుద్యోగ యువత కోసం ఉద్యోగవకాశాలు కల్పించాలనే భావనతో కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్(Karimnagar Police Commissionerate) ఆధ్వర్యంలో మంగళవారంTuesday మెగా జాబ్‌ మేళా(Mega Job)ను నిర్వహిస్తున్నారు. టాలెంట్, విద్యార్హతతో పాటు జీవితంలో స్వశక్తితో ..సొంత కాళ్లపై నిలబడాలనుకునే వాళ్లంతా ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ సత్యనారాయణ (Satyanarayana) పిలుపునిచ్చారు. జీవితంలో ఎదిగేందుకు ప్రైవేటు రంగ సంస్థలు(Private sector organizations), మల్టీ నేషనల్‌ కంపెనీ (Multi National Company)ల్లో ఉద్యోగాలు ఎంతగానో ఉపకరిస్తాయని యువత తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Telangana : ఓ ఫ్యామిలీని టార్చర్ పెట్టిన అన్నదమ్ములు .. భరించలేక భార్య, బిడ్డలతో ఏం చేశాడంటే ..?పోలీసుల ఆధ్వర్యంలో ..

ప్రస్తుత సమాజంలో ఉద్యోగం పురుష లక్షణం కాదు..ప్రతి ఒక్కరికి అవసరం అన్నట్లుగా మారిపోయింది. జీవితంలో బాగా స్థిరపడాలని చదువుకున్న యువతి, యువకుల కోసం కరీంనగర్ కమీషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం మేగా జాబ్‌ మేళా ఏర్పాటు చేశారు. ఈ ఉచిత జాబ్ మేళాలో సుమారు 70కిపై అంతర్జాతీయ కంపెనీలతో పాటు మల్టీ నేషనల్‌ కంపెనీలు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ మెగా జాబ్ మేళా కొనసాగుతుందని కరీంనగర్ పోలీస్ కమిషర్ వి.సత్యనారాయణ తెలిపారు.

మేగా జాబ్‌ మేళా ..

కరీంనగర్ పట్టణంలోని గీతాభావన్ సమీపంలోని పద్మనాయక కళ్యాణ మండపం ఆవరణలో ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు. ఇక్కడకు వచ్చే కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీలతో పాటుగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ జాబ్‌ మేళా ద్వారా మొత్తం మూడు వేల మందికిపైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు పోలీసు అధికారులు. ఉద్యోగానికి అర్హతలు పదవతరగతి పాసైన వారితో పాటు ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ నర్సింగ్ విద్యార్హతలు కలిగిన ప్రతి ఒక్కరు ఈ జాబ్‌ మేళాలో పాల్గొని విద్యార్హతకు తగిన ఉద్యోగాన్ని పొందాలని పోలీసు అధికారులు సూచించారు.


Telangana : ఓ ఫ్యామిలీని టార్చర్ పెట్టిన అన్నదమ్ములు .. భరించలేక భార్య, బిడ్డలతో ఏం చేశాడంటే ..?


సద్వినియోగం చేసుకోండి..

మల్టీ నేషనల్,అంతర్జాతీయ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలకు చెందిన ప్రతినిధులు విచ్చేసి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఇక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే యువతకు సంవత్సరానికి 1 లక్ష 50 వేల రూపాయల కనిష్ట వేతనం నుండి 20 లక్షల గరిష్ట వేతనం వరకు ఎంపికైన ఉద్యోగులకు వేతనాలు చెల్లించబడును. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్‌ మేళాలో నిరుద్యోగ యువత పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు.

First published:

Tags: Job Mela, Karimnagar, Telangana News

ఉత్తమ కథలు