హోమ్ /వార్తలు /తెలంగాణ /

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్.. తీవ్ర కలకలం రేపిన లేఖ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్.. తీవ్ర కలకలం రేపిన లేఖ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తనపై వస్తున్న ఆరోపణలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mancherial, India

బెల్లంపల్లి ఎమ్మెల్యే (BRS MLA)కు మావోయిస్టులు వార్నింగ్ (Maoists Warning) ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మహిళలను ప్రలోభపెట్టి లొంగదీసుకుంటున్నారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (Durgam Chinnaiah)కు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటీ హెచ్చరించింది. ఎన్ని సార్లు హెచ్చరించినా బుద్ధి మార్చు కోవడం లేదని మావోయిస్టు కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ అన్నారు. అర్జిన్ డైరీకి ఎమ్మెల్యే అండదండలున్నాయని... ఎమ్మెల్యే వల్లనే రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య.. విషపు చూపులు, కామా పిశాచి, అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. ఎమ్మెల్యేకు డైరీ నిర్వాహకులు అమ్మాయిలను సరఫరా చేశారన్నారని... రైతుల నుంచి వసూళ్లు చేసిన డబ్బులు వెంటనే చెల్లించాలని స్పష్టం చేశారు. లేకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని ప్రభాత్ తీవ్రంగా హెచ్చరించారు.

మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల పేరుతో ఈ లేఖ దర్శనమివ్వడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఐతే దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లేఖను నిజంగా మావోయిస్టులే రాశారా? లేదంటే.. ఇంకెవరైనా మావోయిస్టుల పేరుతో లేఖ రాశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఇటీవల బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓ వివాదంలో చిక్కుకున్నారు. అర్జిన్ డెయిరీ సంస్థ‌లో భాగస్వామిగా ఉన్న మహిళ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. చిన్నయ్య తమను మోసం చేశారని, అమ్మాయిలను పంపించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటుకు సాయం చేస్తానని చెప్పి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డబ్బులు తీసుకున్నారని అన్నారు. ఇందుకోసం ఆయన చెప్పినట్టుగా విన్నామని.. కానీ చిన్నయ్య తమను నమ్మించి మోసం చేశాడని ఆమె వాపోయారు. తమను లైంగికంగా వేధిస్తూ.. తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు.

ఐతే తనపై వస్తున్న ఆరోపణలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. రైతుల నుంచి లక్షలాది రూపాయాలను వసూలు చేసిన ఆర్జిన్ డెయిరీ సంస్థపై ఇది వరకే కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ కుట్రలో భాగంగానే.. తనపై ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు దుర్గం చిన్నయ్య.

First published:

Tags: Local News, Mancherial, Maoists, Telangana

ఉత్తమ కథలు