హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mangoes: మామిడి పూతే బంగారమాయే.. సామాన్యుడికి షాక్​ ఇవ్వబోతున్న మామిడి పండ్ల ధరలు.. కారణాలివే..

Mangoes: మామిడి పూతే బంగారమాయే.. సామాన్యుడికి షాక్​ ఇవ్వబోతున్న మామిడి పండ్ల ధరలు.. కారణాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఎండాకాలంలో మామిడి పండ్లు తినేద్దాం అనుకునే వారికి ఇది బ్యాడ్​న్యూస్​ అనే చెప్పాలి. డిమాండ్​ దృష్ట్యా ధరలు మరింత పెరిగే ఛాన్సు ఉంది. ఈ డిమాండ్​కు కారణం ఏంటి అంటారా? పూర్తి వివరాలివే..

  (కరీంనగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్​, శ్రీనివాస్. పి)

  ఈ ఏడాది మామిడి పండు (mango) మార్కెట్లో ప్రియమయ్యే  (likely to go up)పరిస్థితులు కనిపిస్తు న్నాయి . గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోయిన విషయం తెలిసిందే . ఈసారి ప్రభుత్వ ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మామిడికి పూత సరిగా రాకపోవడంతో దిగుబడులు తగ్గే అవకాశం కనిపిస్తోంది . కొన్ని చెట్లకు పూత వచ్చినా కాయలు దక్కక పోవడంతో దిగుబడి మాత్రం 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతు న్నారు . దీంతో ఈ ఎండాకాలంలో మామిడి పండ్లు తినేద్దాం అనుకునే వారికి ఇది బ్యాడ్​న్యూస్​ అనే చెప్పాలి. దిగుబడి తగ్గడంతో డిమాండ్​ దృష్ట్యా ధరలు (mango price) మరింత పెరిగే ఛాన్సు (price Likely to hike ) ఉంది. మామిడి తోటల రైతుల పరిస్థితిపై న్యూస్ 18 తెలుగు ప్రత్యేక కథనం ..

  నామమాత్రపు పూత .. 

  ఈసారి మామిడి పండు (mango)  దొరకడం కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఎంతో కొంత లభించినా భారీగా ధరలు పలికేలా ఉంది . మామిడి రైతులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మామిడి పూత నిలువక పోవడంతో రైతులు దిగుబడి లేక లబోదిబోమంటున్నారు. ఈ సంవత్సరం మామిడి తోటలకు వాతావరణం అనుకూలించక తోటలలో వచ్చిన పూత రాలిపోయి చెట్లకు కాయలు (mango) కనబడడంలేదు. ఎక్కడో ఒక చెట్టుకు కాయలు కాయడం విశేషం. ఇలా జిల్లాల తో పాటు రాష్ట్రమంతా ఉన్నట్లు ఉద్యానవన అధికారులు చెబుతున్నారు . ఈ సంవత్సరం మామిడి కాయలు అంతంత మాత్రమే అని అధికారులు చెబుతున్నారు . వాతావరణంలో మార్పులు రావడంతో రైతులకు తోటలో పూత నిలవక పోవడంతో మామిడి కాయలేదని (crop yields are expected to fall sharply) అధికారులు తెలుపుతున్నారు .

  ఈసారి తగ్గనున్న దిగుబడి. .

  ఈ ఏడాది 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే మామిడి దిగుబడి వచ్చే అవ కాశాలు అధికారులు అంచనా వేశారు . రైతులకు (Farmers) గత రెండేళ్లుగా కరోనా , ఈసారి వాతావరణం అనుకూలించక పోడంతో మామిడి తోటల రైతులు దిగాలు చెందుతున్నారు .ఉమ్మడి కరీంనగర్​ (Karimnagar) జిల్లాలలోని అత్యధికంగా జగిత్యాల జిల్లా గ్రామాల్లో  అత్యధికంగా మామిడి తోటలు ఉండటం విశేషం. ఏ రైతు తోటను చూసినా పరిస్థితులు ఇలాగే  (crop yields are expected to fall sharply) ఉండటంతో తోటల పట్టిన గుత్తేదారులు సైతం ముందుకు రావడం లేదు . ఇప్పటికే గత రెండేళ్లు తోటలను గుత్తలు పట్టి ఎగుమతి లేక నష్టపోయామని బోరుమంటున్నారు . ఈసారి కూడా దిగుబడి అంతంతమాత్రమే ఉండటం తో వారు ముందుకు రావడం లేదని తెలిపార . మామిడి తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు . గతంలో కరోనా వల్ల మార్కెట్లో ఎగుమతి లేకపోవడంతో గ్రామాల్లో ప్రతి ఒక్కరికి చౌకగా దొరికాయి . ఈసారి డబ్బులు ఎక్కువైనా పెట్టి కొనుగోలు చేస్తామంటే దిగుమతి లేకపోవడంతో మామిడి పండ్లు అందని ద్రాక్షగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి.

  నాలుగు చెట్లకూ కాయలు లేవు..

  మామిడి రైతులు మాట్లాడుతూ..  ‘‘100 మామిడి చెట్లు ఉంటే 4 చెట్లకు చెట్లకు కూడా కాయలు లేవు.  రెండు సంవత్సరాలలో వందల ఎకరాల తోటలో భారీగా కాయలు కాసినా కరోనా వల్ల మార్కెట్లోకి ఎగుమతి చేయలేకపోయాం . ఈసారి మార్కెట్లు ముందస్తుగా ప్రారంభించినా మామిడి తోటలలో కాయలు అంతంత మాత్రం కాశాయి . కొన్ని చెట్లు పూత పూయాక పోవడం , మరికొన్ని చెట్లకు పూత రాలిపోయి కాయలు లేవు. ఉద్యానవన అధికారులు వాతావరణంలో మార్పుల తో ఇలా జరిగిందని చెప్పారు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి”అని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Farmer, Karimangar, Mango

  ఉత్తమ కథలు