P.Srinivas,New18,Karimnagar
ఫలరాజు మామిడిని పండిస్తున్న రైతులు భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మామిడి తోటలలో ఇప్పటికే రావాల్సిన పూతలు లేక దిగులు చెందుతున్నారు. అలాగే పూత దశలోనే కాయ రాలడంతో మామిడి తోటల్లో ఇటు పూతలు లేక అటు పిందలు లేక మామిడి కాపు వస్తుందా రాదా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికి 20 శాతం మామిడి తోటల్లో పూత రాలడంతో పాటుగా తెగుల్ల బెడదతో ఉన్న పూతకి తెగులు వస్తుండడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు.
నిరాశలో మామిడి రైతులు..
ఫిబ్రవరి వచ్చినా చెట్టుపై పూత కనిపించక..కనిపించిన పూత రాలడంతో మామిడి దిగుబడిపై అన్నదాత దిగాలు చెందుతున్నారు. డిసెంబర్ లో పూతకి వచ్చి ఇప్పటికే విరగ కాయాల్సిన మామిడి చెట్టుపై కాయలే లేకపోవడంతో దిగులు పడుతున్నారు. మామిడి రైతులు..మామిడి పూతని బట్టి మామిడి గుత్తేదారులు చెట్టుపై పూతలు లేకపోవడం గుత్తకి తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. అక్టోబర్ నవంబర్ లో వర్షాలు భారీగా పడడంతో పూత ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్న మామిడి పంట ఆలస్యం అవుతుందని గుత్తేదారులు మామిడి తోటలని గుత్తకి తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ , జగిత్యాల జిల్లాల్లో ఎక్కువగా మామిడి తోటలు ఉంటాయి. ఇక్కడ బంగినపల్లి, రసాలు, దసరి, హిమాయత్ తోటలు ఎక్కువగా సాగు అవుతుండగా జగిత్యాల జిలాల్లో మామిడి చాలా ఫేమస్. ఇక్కడి నుండి వేరే రాష్ట్రాలకి దిగుమతి అవుతూ ఉంటుంది. గత సంవత్సరం 18200 టన్నుల దిగుబడి రాగా ఈసారి మాత్రం అందులో సగం కూడా వచ్చే పరిస్థితి కనబడడం లేదు. గత ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలో కురిసిన వర్షాలకి మామిడి పూత రావడం ఆలస్యం అయ్యింది. గత సంవత్సరం గూడు పురుగు ఎక్కువగా ఉండడంతో రైతులు రసాయన మందులని ఎక్కువగా పిచికారి చేయడంతో ఆ ప్రభావం ఉందని అంటున్నారు.
చలి వాతావరణం కావడం సాధారణం పూత ఆలస్యంగా రావడం.. వచ్చిన పూత కూడా రాలే అవకాశం ఉంది. మొగ్గలని ఉత్తేజపరిచే పూతని తెప్పించే జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన మందులు పిచికారి చేస్తే పూత, పిందెలకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. గత మూడేళ్లలో రెండు సంవత్సరాల కరోనా నేపథ్యంలో పంట పండిన కొనేవారు లేక నష్టపోయిన పరిస్థితి. ఈసారైనా మామిడి రైతులకు భరోసాని ఇస్తుందనుకుంటే ఆదిలోనే హంస పాదంగా అన్నట్లుగా మారిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, Karimnagar, Mango, Telangana