హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime New: మందు పార్టీలో మర్డర్ ..ఆస్ట్రేలియాలో ఉండే వాడ్ని పిలిపించి చంపడానికి రీజన్‌ ఏంటంటే

Crime New: మందు పార్టీలో మర్డర్ ..ఆస్ట్రేలియాలో ఉండే వాడ్ని పిలిపించి చంపడానికి రీజన్‌ ఏంటంటే

murder

murder

Crime News: ఓ వ్యక్తిని అతి దారుణంగా కత్తితో పొడిచి, గొంతు కోసి చంపేశారు. ఆస్ట్రేలియాలో సెటిలైన వ్యక్తిని ప్లాన్‌ ప్రకారం తల్లిదండ్రుల ఊరికి పిలిపించి ఓ పథకం ప్రకారం హతమార్చారు దుండగులు. ఈ హత్యకు అసలు కారణం తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(P.Srinivas,New18,Karimnagar)

రాను రాను మనవత్వం మంట కలిసి పోతుంది. భూముల కోసం, ఆస్తులకోసం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చివరకు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. కరీంనగర్‌(Karimnagar)లో ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది. సంతోష్‌నగర్‌కు చెందిన పురంశెట్టి నరసింహారావు అనే వ్యక్తి ఆర్టీసీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఆయన చిన్నకుమారుడు నరేంద్రరావు(Narendra Rao)ఆస్ట్రేలియా(Australia)లో ఎంఎస్సీ పూర్తి చేసి అక్కడే సెటిల్ అయ్యాడు. అంతకు ముందు జార్ఖండ్లో (Jharkhand)ప్రైవేటు జాబ్ చేసిన నరేందర్రావు భార్య, కుమార్తెతో కలిసి హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యాడు. మూడు నెలల క్రితమే కరీంనగర్‌లో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. అయితే భూమికి సంబంధించిన వ్యవహారంలో కొందరు తమ కొడుకుతో కొద్దిరోజులుగా గొడవపడుతున్నారని..ఇంటిపైకి వచ్చి దాడి కూడా చేశారని మృతుని తల్లి లక్ష్మీ పోలీసులకు తెలిపింది. ఈక్రమంలోనే బుధవారం కొందరు వచ్చి నరేంద్రరావును బయటకు తీసుకెళ్లి కత్తులతో అత్యంత దారుణంగా పొడిచి చంపారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పార్టీ పేరుతో పిలిపించి మర్డర్ ..

కరీంననగర్‌లోని సంతోష్‌నగర్‌కి చెందిన పురంశెట్టి నరసింహరావు కుమారుడు నరేంద్రరావు బుధవారం రాత్రి సమయంలో విద్యానగర్‌ వాటర్ ట్యాంక్‌ పోలీస్ శిక్షణ కళాశాల దారి మధ్యలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ స్తలంలో రక్తపు మడుగులో శవమైపడివున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకొని మృతుడు నరేంద్రరావుగా గుర్తించారు. గొంతును పదునైన కత్తితో కోసి పొట్టలో, తల, శరీరంపై కత్తి పోట్లు పొడిచి చంపినట్లుగా పోలీసుల ప్రాధమిక విచారణలో తేల్చారు. కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు.కేసు దర్యాప్తులో భాగంగా మృతుని తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం భూవివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

భూమి కోసం రక్తం తాగారు..

బుధవారం సాయంత్రం నరేంద్రరావును ఇంటి నుంచి తీసుకెళ్లిన కొందరు వ్యక్తులు మందు పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలోనే భూవివాదం చర్చకు వచ్చి కోపంతో నరేంద్రరావును పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని తల్లిదండ్రులు సైతం కచ్చితంగా హత్యేనంటున్నారు.మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బోనాల అజయ్, అభిషేక్ అలియాస్ బాతూ, రాజిరెడ్డి, సత్తి, సింగరి రాజేందర్, శేఖర్, బోనాల శ్రీను, ఆదిరెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తుల శ్రీనివాస్‌ తెలిపారు. హత్యకు దారి తీసిన కారణాలు, నిందుతులు ఎవరనే విషయంపై పూర్తి విచారణ జరిపించి దోషుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు మొదలుపెట్టారు.

First published:

Tags: Karimnagar, Telangana crime news

ఉత్తమ కథలు