మందు తాగేటప్పుడు మంచి కిక్కిచ్చే బ్రాండ్ చూస్తారు. అందులోకి టేస్టీ మంచింగ్ ఆర్డర్ చేస్తారు. కాని మిక్స్ చేసే నీళ్లు ఎందుకు టెస్ట్ చేయరు మందుబాబులు. అది ఎంత డేంజరో తెలుసా. మంచిర్యాల (Mancherial)మహేష్ అలాంటి పొరపాటు చేసే ఏకంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అసలు మహేష్ ఎవరూ..ఈ మందు గోలేంటి ..మంచినీళ్లేంటి అని కన్ఫ్యూజ్ అవకండి. స్టోరీలోకి వెళితే గత నెల 18వ తేదిన ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో చేసిన పొరపాటు కారణంగా ఓ ఫ్యామిలీకి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి ప్రాణాలు వదిలాడు. అత్యంత విషాదకరమైన సంఘటన మంచిర్యాల జిల్లా హజీపూర్ (Hajipur)మండలం మల్కల్ల(Malkalla)లో జరిగింది. సింగరేణిలో జాబ్ చేస్తున్న ఎర్రవేని మహేష్ (Mahesh)అనే 29సంవత్సరాల వ్యక్తి ఏప్రిల్(April)18వ తేదిన మద్యం తాగుతూ మత్తులో మందు(Liquor)లో కలుపుకునేందుకు నీళ్లకు బదులు యాసిడ్ acidకలుపుకున్నాడు. చూసుకోకుండా అలాగే తాగాడు. వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు మహేష్‌ని కరీంనగర్(Karimnagar)లోని ఓప్రైవేట్ ఆసుపత్రి(Private hospital)లో చేర్చారు. యాసిడ్ తాగిన మహేష్ గత 20రోజులుగా ట్రీట్మెంట్Treatment పొందుతూ సోమవారం(Died) చనిపోయాడు. ఈవిషయాన్నిహాజీపూర్ ఎస్ఐ ఉదయ్‌కుమార్(Udaykumar)వెల్లడించారు.
మందుబాబులు జర భద్రం..
మత్తు కోసం తాగిన మందులో ఏం కలుపుకుంటున్నామో తెలియని సోయిలో మహశ్ చేసిన పొరపాటుకు భార్య స్వర్ణలక్ష్మి, కొడుకు, కూతురు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయారు. మహేష్‌కి భార్య పిల్లలే కాదు తండ్రి శంకరయ్య, తల్లి లక్ష్మీ కూడా ఉన్నారు. చేతికొచ్చిన కొడుకు తమకు అండగా ఉంటాడని భావించారు. మహేష్ మరణవార్త వారి కుటుంబ సభ్యులకే కాదు మల్కల్ గ్రామస్తుల్ని తీవ్రంగా బాధిస్తోంది. తాగిన మైకంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా ఓ కుటుంబమే పెద్దదిక్కుని కోల్పోడం బాధకరమని గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మిక్సింగ్ చేసేటప్పుడు చూడాలిగా..
మహేష్ చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తాగిన మైకంలో ఇలాంటి పొరపాట్లు చేసి మందుబాబులు కుటుంబ సభ్యులకు దూరమై వాళ్ల కన్నీరుకు కారణం కావద్దని సూచిస్తున్నారు. తాగిన మైకంలో ఏం చేస్తున్నామో, ఎక్కడున్నామో మర్చిపోయి..కుటుంబ సభ్యులకు అన్యాయం చేయవద్దని..ఇలాంటి సంఘటనలు ఉదాహరణగా తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. మద్యం ఆరోగ్యానికి హానికరం అని బాటిల్‌పై రాసేది ఇందుకే. ఆ మందు వల్ల నష్టం జరగకపోయినా..తాగిన తర్వాత ఆ లిక్కర్‌తో వచ్చే కిక్కులోనే ఇలాంటి పొరపాట్లు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటారని అర్ధం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mancherial, VIRAL NEWS