Telangana: చనిపోయిన కోడితో పోలీసు స్టేషన్‌కు.. ఇంతకీ కేసు నమోదు అయిందా?.. అసలు ఏం జరిగిందంటే..

కోడితో పోలీస్ స్టేషన్‌‌లో రాజు

ఓ వ్యక్తి తన కోడి చనిపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. కోడి మరణానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

  • Share this:
    ఓ వ్యక్తి తన కోడి చనిపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. తన కోడి మరణానికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరాడు. ఈ ఘటన తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో గసికంటి రాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాజు కొంతకాలంగా 20 కోళ్లను పెంచుకున్నాడు. అయితే ఇటీవల వాటిలో 19 కోళ్లు ఓ వ్యాధి సోకి మరణించాయి. కేవలం ఒక్క కోడి మాత్రమే మిగిలిపోయింది. అయితే మంగళవారం రోజున రాజుకు చెందిన ఆ ఒక్క కోడి బయట తిరిగేందుకు రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో బావుసాయిపేటకు చెందిన దిలీప్ రావు ట్రాక్టర్ అటువైపు వచ్చింది. అయితే కోడి ప్రమాదవశాత్తు దిలీప్ రావు ట్రాక్టర్ కింద పడి మృతి చెందింది.

    ఈ విషయం తెలుసుకున్న రాజు ట్రాక్టర్ డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కోడి చనిపోయినందుకు పరిహారం ఇవ్వాలని కోరాడు. అయితే అందుకు దిలీప్ రావ్ నిరాకరించాడు. దీంతో రాజు బుధవారం నేరుగా చనిపోయిన కోడిని చేతిలో పట్టుకుని చందుర్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. కోడి మృతికి సంబంధించి పోలీసులకు వివరాలు తెలిపాడు. దిలీప్ రావుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు.

    Vemulawada: రాజన్న సన్నిధిలో పాక్షిక లాక్‌డౌన్.. నిబంధనలు పాటించకుంటే జరిమానా.. ఎప్పటివరకంటే..?.. పూర్తి వివరాలు..

    Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈదురు గాలులు కూడా.. ఎన్ని రోజులంటే..

    అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని ఎస్సై సునీల్ తెలిపారు. ఇక, అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కోడి చనిపోవడంతో తనకు న్యాయం చేయాలని పోలీసు మెట్లెక్కినట్టు రాజు వివరించాడు.
    Published by:Sumanth Kanukula
    First published: